breaking news
peravalli
-
జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే!
సేంద్రియ పెరటి తోటల విప్లవానికి వెంకట్రాయపురం గ్రామ గృహిణులు శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో ఓ మారుమూల గ్రామం ఇది. 364 కుటుంబాలు.. 1,566 మంది జనాభా. గతంలో కిలోమీటర్ల దూరం వెళ్ళి కూరగాయలు కొని తెచ్చుకునేవారు. గృహిణులంతా చైతన్యవంతులై 5 ఏళ్ళ క్రితం సెర్ప్ తోడ్పాటుతో సేంద్రియ పెరటి తోటల సాగును నేర్చుకొని ఆచరిస్తున్నారు. రోడ్ల పక్కన, ఇంటి చుట్టూ, ఖాళీ స్థలాల్లో, గ్రామంలో ఖాళీగా ఉన్న పోరంబోకు స్థలాల్లోనూ కూరగాయ పంటలు, పండ్ల మొక్కలు నాటి, చక్కని ఫలసాయం పొందుతున్నారు. జానెడు జాగా ఉందంటే అందులో ఏదో ఒక కూరగాయ మొక్క ఉండవలసిందే. డాబా ఇళ్ళపై, ఇళ్ల చుట్టూ పంట మొక్కలతో ఆ గ్రామం కళకళలాడుతూ కనిపిస్తున్నది. ప్రతీ ఇంటి వద్ద వంగ, బెండ, టమాటా, బీర, పొట్ల, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి, మునక్కాడలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూరతో పాటు కంద కూడా ఇళ్ల వద్దే సాగు చేసుకుంటున్నారు. జామ, బొప్పాయి, నారింజ, పంపర పనస, సపోటా, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఫలసాయం అందిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం గ్రామంలో ఒక ద్రాక్ష పాదును నాటారు. ఇప్పుడు గ్రామంలో 50 శాతం ఇళ్లలో ద్రాక్ష పాదులు పండ్లను అందిస్తున్నాయి. మహిళల్లో వచ్చిన చైతన్యం ఫలితంగా ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా అనేక రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి. ఎవరికి వీలైన పంటలు వారు తమ పెరట్లో పండిస్తున్నారు. తాము ఇంటిపట్టున పండించిన కూరగాయలు, పండ్లను డబ్బు ప్రమేయం లేకుండా ఇరుగు పొరుగు వారికి ఇచ్చిపుచ్చుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. తాము సేంద్రియంగా పండించిన కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు తినటం వల్ల అందరం ఆరోగ్యంగా ఉన్నామని మహిళలు సంబరంగా చెబుతున్నారు. కుల మతాలకు అతీతంగా కలిసి మెలసి పనులు చేసుకుంటారు. ఒకటే మాట, ఒకటే బాట అన్నట్లు జీవిస్తుండటం విశేషం. – పంతం వెంకటేశ్వర రావు, సాక్షి, పెరవలి, తూ.గో. జిల్లా కూరగాయలన్నీ ఉచితమే ఈ గ్రామానికి కొత్త కోడలిని. కూరగాయల దుకాణాలు ఏమీ లేవు. ఏం వండుకోవాలో తెలిసేది కాదు. ప్రతీ ఇంటి వద్ద కూరగాయలు పండించడంతో ఇప్పుడు కూరగాయల కొరత బాధ లేదు. ఏ కూరగాయలు కావాలన్నా ఇక్కడే ఉచితంగా దొరుకుతున్నాయి. – బోళ్ళ నాగమణి, గృహిణి, వెంకట్రాయపురం ప్రతి ఇంటి పరిసరాల్లోనూ... గ్రామస్థులు కూరగాయల కోసం పడుతున్న ఇబ్బందుల గురించి ఉన్నతాధికారుల వివరించాను. సుస్థిర వ్యవసాయం ద్వారా కూరగాయల సమస్యను తీర్చవచ్చని అందుకు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆ మేరకు మహిళలందరినీ చైతన్యపరిచి సామూహిక కూరగాయల సాగు చేయించాను. ఇప్పుడు ఏ ఇల్లు చూసినా కూరగాయ పంటలతో కళకళలాడుతూ కనిపిస్తున్నది. ప్రభుత్వం 90 శాతం సబ్సీడీపై విత్తనాలు సరఫరా చేసింది. రోడ్ల పక్కన, పోరంబోకు స్థలాల్లో కూడా కూరగాయ పంటలు పండిస్తున్నారు. – పాటి అనంతలక్ష్మి(93909 72585), విఏఏ, వెంకట్రాయపురం సమష్టి నిర్ణయాలు తీసుకుంటాం గ్రామం చిన్నది. పంచాయతీ ఆదాయం ఏడాదికి రూ.70 వేలు మాత్రమే. ఉన్నదాంట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. గ్రామస్తులందరం కలసి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి ఇంటి వద్దా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎవరికి ఏ కూరగాయలు కావాలంటే అవి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు. కుల మత భేదాలకు తావు లేదు. అనారోగ్యాల్లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాం. – పోలిశెట్టి బాలాజీ (93164 44777), సర్పంచ్, వెంకట్రాయపురం 23న విత్తనోత్సవం తూర్పు కనుమలలో వెల్లివిరిసిన దేశీ వంగడాల వార్షిక జీవవైవిధ్య విత్తనోత్సవం ఈ నెల 23న అల్లూరి సీతారామరాజు జిల్లా దుంబ్రిగూడ మండలం దేముడువలస గ్రామంలో జరుగుతుందని నిర్వాహకులు, సంజీవని సంస్థ అధిపతి దేవుళ్లు తెలిపారు. వందలాది రకాల దేశీ విత్తనాలను ప్రదర్శిస్తారు. వివరాలకు.. దేవుళ్లు – 94401 19789. 25న అనంతపురం జిల్లాలో డా. ఖాదర్ సభలు ఈనెల 25(సోమవారం) ఉ.10.30 గం.కు ధర్మవరంలోని వివేకానంద డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే సభలో ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గం.కు రాప్తాడు మండలం హంపాపురంలోని ఆదరణ పాడి పంట ఎకో విలేజ్‌లో ఉపన్యసిస్తారు. సా. 5.30 గం.కు బత్తలపల్లిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం‘ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. చదవండి: భళా.. బాపట్ల బ్లాక్ రైస్! -
ఇరువర్గాల కొట్లాట
పెరవలి, న్యూస్‌లైన్ : ఇరువర్గాల కొట్లాటలో ఐదుగురు తీవ్ర గాయూలపాలవ్వగా, గ్రామస్తుల దాడిలో పెరవలి ఎస్సై గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తీపర్రు వేబ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ట్రాఫిక్ నిలిచిపోవడంతో గ్రామ ఉప సర్పంచ్ కుందుల భూపతి సంఘటనా స్థలానికి వెళ్లి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేస్తుండగా ఆర్టీసీ బస్సు వెళ్లే సమయంలో కానూరు వైపు వెళ్తున్న ఆటోలో ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఆర్టీసీ డ్రైవర్‌ను కొట్టడానికి వెళ్తుండగా భూపతి అడ్డుకోవడంతో అతనిపై తిరగబడి చేయి చేసుకోవడంతో గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో వేబ్రిడ్జి వద్ద ఉన్న వ్యక్తులు పరుగున వచ్చి ఆటో ప్రయూణికులతో కలబడ్డారు. విషయం తీపర్రు గ్రామస్తులకు తెలియడంతో అధిక సంఖ్యలో వచ్చి ఆటోలో ఉన్న వ్యక్తులను బంధించి తీవ్రంగా గాయపరిచారు. అదే సమయంలో కానూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయూరుు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెరవలి ఎస్సై, సిబ్బంది గాయపడిన యలగన రాజు, దుర్గయ్యలను 108లో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై కూర్చున్న కానూరు గ్రామస్తులు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదని ఎస్సైకు చెప్పడంతో గాయపడిన వారికి వైద్యం అందించి, కారకులైన వారిపై కేసు నమోదు చేస్తానని చెప్పి ఇరువర్గాలను అక్కడ నుంచి పంపేశారు. ఈ విషయం రుచించని కానూరు గ్రామస్తులు సోమవారం ఉదయం 11 గంటలకు తీపర్రు వేబ్రిడ్జి వద్దకు ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లపై పెద్ద సంఖ్యలో చేరుకుని దొరికిన వారిని దొరికినట్లు కర్రలు, రాడ్డులతో కొట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వేబ్రిడ్జి వద్ద ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు వేబ్రిడ్జికి సంబంధించిన కంప్యూటర్ రూమ్‌ను పూర్తిగా ధ్వంసం అయ్యూరుు. వీటితో పాటు 3 మోటార్ సైకిళ్లు, 2 సైకిళ్లు ధ్వంసం చేశారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న కానూరు గ్రామస్తులు పొక్లెయిన్ డ్రైవర్ ఆకుల వెంకటేశ్వర్లును తీవ్రంగా కొట్టి ట్రాక్టర్లో వేసుకుని గ్రామానికి తీసుకుని వె ళ్లిపోయారు. ఎస్సైపై దాడి తీపర్రు వేబ్రిడ్జి వద్ద సోమవారం తీపర్రు, కానూరు గ్రామస్తులు కర్రలు, రాడ్డులతో కొట్టుకుంటున్నారని సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఇరువర్గాలను చెదరగొడుతుండగా కానూరు గ్రామస్తులు తీవ్ర ఆగ్ర హంతో ఎస్సైపై దాడికి దిగారు. కేసు కట్టమంటే రాజీ చేయడానికి చూస్తావా అంటూ కొందరు ఎస్సై కాలర్ పట్టుకుని గిరగిరా తిప్పారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో తె లియని గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీ సులు లాఠీఛార్జీ చేశారు. పొక్లెయిన్ డ్రైవర్‌ను తీసుకుపోయారని స్థానికులు చెప్పడంతో ఎస్సై సిబ్బం దితో కలిసి కానూరు వెళ్లారు. ఎస్సైపై దాడి జరిగి నట్లు తణుకు సీఐకు సమాచారం ఇవ్వడంతో తణు కు రూరల్ ఎస్సై, ఉండ్రాజవరం ఎస్సై సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చారు. కానూరు పంచాయతీ కార్యాలయం వద్ద దాడికి కారణమైన వ్యక్తులను పిలిచి తనపై దాడి చేసిన వ్యక్తిని అప్పగించాలని ఎస్సై కోరడంతో దాడిలో పాల్గొన్న వ్యక్తులు ఎవరు ఎవరిని కొట్టారో తెలియదని, మమ్మలందర్ని తీసుకువెళ్లండని తెలపడంతో ఎస్సై అక్కడి నుంచి తిరిగి వచ్చారు. పెరవలి స్టేషన్లో ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఎస్సైపై దాడి చేసిన వారిపై కూడా కేసు నమోదు చేశామని ఎస్సై ఎంవీఎస్ మూర్తి తెలిపారు.