breaking news
pension cash
-
రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?
ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. -
పెన్షన్ పేరుతో వృద్ధులకు బురిడీ
ఒంగోలు (ప్రకాశం): వృద్ధులను టార్గెట్ చేస్తూ వారి మెడలోని చైన్లను కాజేస్తున్న ఘటనలు మన జిల్లాలోను 5 చోటు చేసుకోగా కందుకూరు సీఐగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు ఎట్టకేలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐటీ కోర్ టీం సురేష్ సాయంతో నిందితుడ్ని గుర్తించి కటకటాలు లెక్కించేలా చేశాడు. నిందితుడిని గుర్తించింది ఇలా: నెల్లూరు జిల్లా దుత్తలూరు ప్రాంతానికి చెందిన కొండెపోగు జీవరత్నం అలియాస్ జీవా ఆర్కే బియ్యం వ్యాపారం చేస్తుంటాడు. ఇతని బాబాయి కన్నుమూయడంతో తన పిన్నమ్మతోపాటు వారి ఆరుగురు సంతానాన్ని పోషించేందుకు ఆర్థిక భారం తోడు కావడంతో నేర ప్రవృత్తివైపు దృష్టి సారించా డు. ఒకసారి తన అమ్మమ్మను పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అధికారులు మెడలో బంగారు చైన్ ఉంటే డబ్బున్న మనుషులని భావించి పెన్షన్ రాదని, కనుక మెడలోని బంగారు చైన్ తీసేయమంటూ సూచించారు. ఈ విషయం అతని మెదడులో వృద్ధులను సులువుగా టార్గెట్ చేయవచ్చనే భా వన కలిగించింది. ఈ క్రమంలో మెడలో బంగారం వేసుకుని ఉన్న వృద్ధ మహిళలను గుర్తించి వారి వద్దకు వెళ్లి మీకు పెన్షన్ మంజూరైంది. మీరు ఫోటో దిగాలి అని కొంత మందిని, మీకు పెన్షన్ పెరిగింది. దీనికి మరలా ఫోటో తీయించుకోవాలంటూ చెప్పేవా డు. వారు ఫోటో దిగే సమయంలో మెడలో చైన్ ఉం టే రుణం రద్దు అవుతుందని చెప్పి వారి చేత తీ యించి పక్కనే ఉంచేలా చేసి తనకు ఆధార్‌కార్డు, రేషన్ కార్డు నకలు కావాలంటూ హడావుడి చేసి వారిని బయటకు పంపడం, లేదా ఇంట్లోకి వెళ్లి వారు వెతికే క్రమంలో బంగారు చైన్‌తో ఉడాయిం చడం జీవరత్నం అలవాటుగా మారింది. అప్పట్లో సంచలనం ఒంగోలు టూటౌన్ పరిధిలో పెన్షన్ పెరిగిందంటూ వృద్ధురాలిని మోసం చేసిన కేసు అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే ఈ తరహా నేరాలు జిల్లాలో కందుకూరులో 2, టంగుటూరు–1, కనిగిరి–1 వెరసీ మొత్తం 5 చోట్ల చేసుకున్నాయి. ఇటీవలే కందుకూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ కె.వెంకటేశ్వరరావు ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాడు. జిల్లాతో పాటు కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో నేరస్థలం ఏదైతే ఉందో ఆ ప్రాంత పరిధిలో సంబంధిత ప్రాంత పోలీసుల ద్వారా సెల్టవర్ల ద్వారా వివరాలు సేకరించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఐటీ కోర్‌టీం సురేష్ ప్రత్యేక దృష్టి సారించి అన్ని చోట్ల కామన్‌గా వస్తున్న సెల్ నంబర్లను గుర్తించే పనిలో పడ్డాడు. తీరా అన్నింటిలోనూ ఒకే ఒక నంబర్ కనిపిస్తుండడంతో అతనే నేరస్తుడు అయి ఉంటాడని దృష్టి సారించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాడు. వృద్ధులే అతని టార్గెట్: కొండెపోగు జీవరత్నంను తమ సిబ్బంది విచారిస్తే మొత్తం 21 కేసుల్లో నిందితుడిగా అంగీకరించాడని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. మొత్తం 8 కేసులలో సొత్తును తమ సిబ్బంది స్వాధీనం చేసుకున్నార ని, వాటిలో జిల్లాలోని ఒంగోలు టూటౌన్–1, కందుకూరు–2, టంగుటూరు–1, కనిగిరి–1 వెరసి అయిదు కేసులు, కడప జిల్లా బద్వేలులో ఒకటి, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మరొకటి వెరసి ఏడు కేసులు ఉన్నాయన్నారు. అయితే 8వ కేసులో సొత్తును స్వా«ధీనం చేసుకోగలిగినా ఆ చైన్ ఎక్కడ చోరీ చేశాడనే విషయం బహిర్గతం కాలేదని ఎస్పీ పేర్కొన్నారు. దొంగిలించిన సొమ్మును అదే రోజు పాన్ బ్రోకర్ల వద్ద కుదువపెట్టి వాడుకోవడం పరిపాటిగా మారిందన్నారు. వీటితోపాటు కడప జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లాలోని అనంతపురం, హిందూపూర్, కదిరి, తాడిపత్రి, నెల్లూరు జిల్లాలో సంగం, కావలి, నెల్లూరు, వింజమూరు, బుచ్చిరెడ్డిపాలెంలలో కూడా నేరాలు చేసినట్లు అంగీకరించాడని, అయితే వీటికి సంబంధించిన సొత్తు రికవరీ కాలేదన్నారు. సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులకు నిందితుడి సమాచారం పంపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొత్తు 204 గ్రాములని, విలువ రూ.6లక్షలుగా ఉంటుందన్నారు. అయితే 8వ చైన్ ఎవరిదనేది తెలి య రావడం లేదన్నారు. ఎవరైనా ఇప్పటివరకు ఇటువంటి తరహా ఘటనల్లో బంగారం పోగొట్టుకొ ని ఇంతవరకు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయని వా రు ఎవరైనా ఉంటే తక్షణమే సమీపంలోని పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా కేసును చేధించడంలో సత్తాచాటిన కందుకూరు సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సైలు యు.వేమన, ప్రభాకర్, ఎ ఎస్సైలు లక్ష్మణస్వామి, ఐటీ కోర్ కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు విష్ణు, రవిలకు జిల్లా ఎస్పీ నగదు రి వార్డులు అందించి అభినందించారు. అదనపు ఎస్పీ కె.లావణ్యలక్ష్మి, కందుకూరు డీఎస్పీ కె.ప్రకాశరావు , స్పెషల్ బ్రాంచి సీఐ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పింఛన్ కష్టాలు
నెల్లూరు(బారకాసు): పింఛన్‌దారులకు పది రోజులుగా ఎదురుచూపులు తప్ప.. పింఛన్ నగదు అందలేదు. గతంలో ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛన్ అందేది. ఇప్పుడా పరిస్థితులు కనుమరుగయ్యాయి. పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక వృద్ధులు ఆందోళన చెందుతున్నా రు. 10వ తేదీ దాటిపోయినా పింఛన్ సొమ్ము అందలేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం తమతో చెలగాటం ఆడుతుందని పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలపై పింఛన్‌దారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈనెల పింఛన్ వస్తుందా.. రాదా అని సందేహ పడుతున్నారు. గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేసే కమ్యూనిటీ సర్వీసు ప్రొవైడర్ల జాడే లేదు. పింఛన్ సొమ్ము మంజూరైతే లబ్ధిదారుల వివరాలు అక్విటెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందేవి. అలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని, ప్రభుత్వం ఇంకా పింఛన్ సొమ్మును మంజూరు చేయలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా డీఆర్డీఏ పరిధిలో 2,61,123 పింఛన్ దారులున్నారు. వారందరికి సుమారు రూ.5 కోట్లు పంపిణీ జరుగుతోంది. ఒక్క నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోనే 22,036 మంది లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ సొమ్మును ప్రభుత్వం పలు బ్యాంకుల అకౌంట్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఆయా బ్యాంకుల ఖాతాలకు ప్రభుత్వం సొమ్ము పంపలేదని, అందువల్లనే జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత శాఖలోని ఓ అధికారి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,61,123 మంది పింఛన్‌దారులున్నారు. వారిలో వృద్ధులు 1,24,677 మంది, వితంతువులు 90,042, వికలాంగులు 30,009, కల్లుగీత కార్మికులు 676, చేనేత కార్మికులు 4,843, అభయహస్తం కింద 10,876 మంది పింఛన్‌దారులున్నారు. ప్రభుత్వం నుంచి రాగానే అందజేస్తాం ఈనెల పింఛన్ సొమ్ము విడుదల చేయడం ఎందుకు ఆలస్యమైందో తెలియలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్ సొమ్ము మాకు రాలేదు. పింఛన్ సొమ్ము రాగానే వెంటనే పింఛన్ దారులకు అందజేస్తాం. అయితే ఎప్పుడు అనేది తాను కచ్చితంగా చెప్పలేను. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. - చంద్రమౌళి, ప్రాజెక్ట్ సంచాలకులు, డీఆర్డీఏ