breaking news
peddapuram municipality
-
రాజకీయం....ఆధ్యాత్మికం
సాక్షి, సామర్లకోట : మెట్ట ప్రాంతానికి ముఖద్వారమైన పెద్దాపురం నియోజకవర్గంపై ప్రతి ఒక్కరి కన్ను పడుతోంది. పాండవులు అజ్ఞాతవాసం సమయంలో నడయాడిన నేలగా పెద్దాపురానికి పేరు ఉంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి 1955లో మొదటి సారిగా ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుంది. పెద్దాపురం నియోజకవర్గానికి నలువైపులా ఒక వైపు కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, అనపర్తి నియోజకవర్గాలు ఉన్నాయి.ప్రస్తుతం 2019లో ఎన్నికలు జరుగుతున్నాయి. భౌగోలిక స్వరూపం 291.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నియోజకవర్గంలో జనాభా:2,61,378 పురుషులు: 1,30,376 మహిళలు : 1,31,002 ఓటర్లు: 1,98,369 పురుషులు : 99,936 మహిళలు : 98,407 ఇతరులు : 17 పరిశ్రమలకు కోట నియోజకవర్గంలోని సామర్లకోటలో రైల్వే స్టేషన్ – ఎదురుగానే బస్సు కాంప్లెక్స్ ఉన్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి సదుపాయం లేదు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద బస్సు కాంప్లెక్స్ ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిటిష్‌వారి కాలంలో నిర్మించిన పంచదార పరిశ్రమ నేటికీ ఉంది. నవభారత్ వెంచర్స్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ సాగుతోంది. నియోజకవర్గంలోని వాణిజ్య పంటలైన చెరకు నుంచి పంచదార తయారు చేస్తారు. మరో వాణిజ్య పంట దుంప నుంచి సగ్గు బియ్యం తయారు చేసే పరిశ్రమలు నియోజకవర్గంలో పది వరకు ఉన్నాయి. వరి ప్రధాన పంట కావడంతో దానికి తగిన రీతిలో ధాన్యం మిల్లులు కూడా నియోజకవర్గంలో ఎక్కువ. తవుడు నుంచి నూనె తీసే పరిశ్రమలూ ఉన్నాయి. ఇటీవల కాలంలో పామాలిన్ తోటలపై రైతులు మక్కువ చూపడంతో సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డులో పామాలిన్ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేశారు. ఏడీబీ రోడ్డు ఏర్పాటు తరువాత ఈ రోడ్డు వెంబడి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రాక్ సిరామిక్స్, రిలయన్స్ పవర్ ప్లాంటు, జీవీకే పవర్ ప్లాంటు, అపర్ణ సిరామిక్స్ పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో సామర్లకోట మున్సిపాలిటీలో ప్రముఖ పుణ్యక్షేత్రమే శ్రీకుమారారామభీమేశ్వర ఆలయం ఉంది. మహాశివరాత్రి, కార్తికమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఆధ్మాత్మికంగానూ.. పెద్దాపురం మున్సిపాలిటీ ముఖ్య కూడలి ప్రదేశంలో మరిడమ్మ అమ్మవారి ఆలయం ఉంది. సామర్లకోటకు చెందిన చింతపల్లి వారి ఆడపడుచుగా చెబుతారు. ఈ ఆలయంలో ఏటా నెల రోజుల పాటు మరిడమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. పెద్దాపురానికి శివారులో జగ్గంపేట, రాజమహేంద్రవరం వెళ్లే రోడ్ల కూడలి ప్రదేశంలో పాండవుల మెట్ట ఉంది. పాండవులు అజ్ఞాత వాసం సమయంలో ఇక్కడ తల దాచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో పాండవులు రాజమహేంద్రవరం గోదావరి కాలువ వరకు ఏర్పాటు చేసుకున్న గృహ నేటికీ ఉంది. పెద్దాపురం మండల పరిధిలో కాండ్రకోట గ్రామంలొ వేంచేసిన నూకాలమ్మ ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్త అమావాస్య నుంచి నెల రోజుల ఆలయ వద్ద తిరునాళ్లు జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన 2014లో నియోజకవర్గాలను పునఃవిభజనతో అప్పటి వరకు సంపర నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రామాలు(సామర్లకోట మండలానికి చెందిన ) పెద్దాపురం నియోజకవర్గంలో కలిపారు. చంద్రంపాలెం, పవర, పండ్రవాడ, నవర, గొంచాల, అచ్చంపేట, పనసపాడు, పి.వేమవరం గ్రామాలను పెద్దాపురం నియోజకవర్గంలో కలిపారు. నియోజకవర్గం ఏర్పడిన సంవత్సరం : 1952 మొదటిసారిగా జరిగిన ఎన్నికలు : 1955 సామర్లకోట మున్సిపాలిటీ, మండల పరిధిలో గ్రామాలు : 18 పెద్దాపురం మున్సిపాలిటీ, మండల పరి«ధిలో గ్రామాలు : 23 పోలింగ్ కేంద్రాలు : 211 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు : 95 నియోజకవర్గంలో అక్షరాస్యత శాతం : 63.92 ప్రభుత్వ పాఠశాలలు : 160 ప్రైవేటు పాఠశాలలు : 89 ప్రభుత్వ జూనియర్ కళాశాల : 1 ప్రైవేటు జూనియర్ కళాశాలలు : 6 డీగ్రీ కళాశాలలు :5 బీఈడీ కళాశాలలు :3 ఇంజినీరింగ్ కళాశాలలు : 2 ఇప్పటి వరకు 13 పర్యాయాలు జరిగిన సాధారణ ఎన్నికలలో ఏడు పర్యాయాలు స్థానికేతరులే విజయం సాధించారు.మిగిలిన ఆరు పర్యాయాలు స్థానికులు కైవసం చేసుకున్నారు. -
తిరగబడ్డ తమ్ముళ్లు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మున్సిపల్ పోరులో గెలిచిన ముచ్చట మూడు నెలలు కూడా తీరకుండానే పెద్దాపురంలో తెలుగు తమ్ముళ్ల తగవు బజారుకెక్కింది. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడైన నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం రాష్ట్రంలోనే రెండు మున్సిపాలిటీలు (పెద్దాపురం, సామర్లకోట) ఉన్న ఏకైక నియోజకవర్గం. ఈ రెండు పట్టణాల్లో టీడీపీయే విజయం సాధించింది. పెద్దాపురంలో 28 వార్డులుండగా 23 ఆ పార్టీ గెలుచుకుంది. తిరుగులేని మెజారిటీ సాధించిన ఈ పట్టణంలో చైర్పర్సన్ గా అనుభవజ్ఞుడైన రాజా సూరిబాబురాజును కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడాయన ఏలుబడి ఏకపక్షంగా సాగుతోందంటూ స్వపక్షానికి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు పార్టీ జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సూరిబాబురాజు వైఖరిని నిరసిస్తున్న వారు పార్టీ జిల్లా అధ్యక్షుడైన చినరాజప్పకు ఆదివారం ఫిర్యాద ు చేశారు. ఇదే విషయాన్ని వారు శనివారం పార్టీ సీనియర్ నాయకుడైన గోలి రామారావు దృష్టికి తీసుకువెళ్లారు. చినరాజప్పతో మాట్లాడి సర్దుబాటు చేద్దామని రామారావు నచ్చచెప్పినా వారు ససేమిరా అన్నారు. అనేక సందర్భాల్లో అభివృద్ధి, ఇతర విషయాల్లో తమకు కనీస సమాచారం ఉండడం లేదని, తాము ఏ చిన్న పని కోసం అధికారులను అడుగుతున్నా చైర్‌పర్సన్‌తో ఫోన్ చేయించండనడం అవమానకరంగా ఉందని 15 మంది కౌన్సిలర్లు చినరాజప్పకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. ఫలితంగా ఈ వివాదం ముదురుపాకాన పడింది. చైర్పర్సన్ పక్షాన ఎనిమిది మంది కౌన్సిలర్లు నిలవగా, వైస్ చైర్మన్ ఎస్.సత్యభాస్కరరావు సహా 15 మంది ఆయన వ్యతిరేకవర్గంగా నిలిచారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్నపెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లే అవుట్ల వ్యవహారమే ప్రధాన కారణం.. తమ ప్రమేయం లేకుండా చైర్పర్సన్ 13 ఎకరాల లే అవుట్ అనుమతులకు కౌన్సిల్లో ప్రతిపాదించడమే మెజారిటీ కౌన్సిలర్ల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. ఇదే విషయాన్ని వారు చినరాజప్ప దృష్టికి తీసుకువెళ్లారు. రామారావుపేటలో 13 ఎకరాల లేఅవుట్లో 139 ఫ్లాట్లు నిర్మించాలని ఒక సంస్థ ప్రతిపాదించింది. ఇదే లే అవుట్‌కు ఇటీవల చినరాజప్ప భూమి పూజ చేయడం గమనార్హం. తమకు మాట వరసకైనా చెప్పకుండా చైర్పర్సన్ ఏకపక్షంగా ప్రతిపాదించడంలో ఆంతర్యమేమిటని కౌన్సిలర్లు ప్రశ్నిస్త్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పూడిక తీత పనులకు టెండర్లు పిలిచే వ్యవహారం చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్ల తిరుగుబాటుకు మరో కారణమైంది. పనులన్నింటినీ చైర్పర్సన్ ఏకపక్షంగా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించేయడంపై కూడా కౌన్సిలర్లు చినరాజప్పకు ఫిర్యాదు చేశారు. పూడికతీత పనులకు రూ.15 లక్షలు మున్సిపాలిటీ కేటాయించింది. ఈ నిధులను 18 పనులుగా విభజించారు. రూ.లక్ష దాటే పనులకు విధిగా టెండర్లు పిలవాలి. లక్షలోపు అయితే నామినేషన్ ప్రాతిపదికన అప్పగించే వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటును ఆసరాగా రూ.15 లక్షలతో చేపట్టే ప్రతి పనినీ రూ.లక్ష లోపుగా నిర్ణయించి తనకు నచ్చిన ముగ్గురు కాంట్రాక్టర్లకు చైర్పర్సన్ అప్పగించేశారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇందుకు తోడు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల పింఛన్ల కమిటీల ఏర్పాటులో కూడా తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. చైర్పర్సన్, మెజారిటీ కౌన్సిలర్ల మధ్య విభేదాలతో మున్సిపల్ అధికారుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా మారింది. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలుగుతమ్ముళ్ల వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.