breaking news
Peace ralley
-
'కేసీఆర్ పాలన సామాజ్య్ర వాద శక్తులకంటే దారుణం'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సామ్రాజ్య వాద శక్తుల కంటే దారుణంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్ఎస్ పతనం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న కొన్ని చట్టాలపై అభ్యంతరం తెలుపుతూ గాంధీభవన్ నుంచి శాంతియుత ర్యాలీ తీయాలనుకున్నామని తెలిపారు. కాగా లౌకిక వాదాన్ని పెంచే ర్యాలీకి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు. దీంతో మౌనంగా శాంతి యాత్ర చేద్దామనుకున్నా ఇప్పుడు పోలీసులు అనుమతించలేదని, గాంధీభవన్ చుట్టు వేలాది మంది పోలీసులను మోహరించి కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రంలో గాంధీని చంపిన వారి పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. 6 దశాబ్దాల తమ పాలనలో లౌకిక వాదంలో బతికిన ప్రజలు ప్రస్తుతం బీజేపీ పాలనలో మాత్రం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీకి పరోక్షంగా కేసీఆర్ సహాయసహకారాలు అందించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గుండెను తట్టి లేపుదామని కార్యకర్తలకు భట్టి పిలుపునిచ్చారు. -
సద్భావనతో కలసి సాగుదాం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య శాంతి, సుహృద్భావ వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తూ సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతికి చిహ్నంగా తెల్ల బ్యాడ్జీలు కట్టుకుని సచివాలయంలోని ‘కే’ బ్లాకు నుంచి సమతా బ్లాక్ వరకూ మౌనంగా ర్యాలీ నిర్వహించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలసి ఉందామని పిలుపునిచ్చారు. ఉద్యోగులందరం ఆత్మీయంగా, పరస్పర సహకారంతో కొనసాగుదామని, విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు. ర్యాలీ అనంతరం సచివాలయ తెలంగాణ సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి నరేందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ రెండు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు శాంతి, సామరస్యాలతో సహకరించుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులు సభ్యులుగా ఉన్న ఏపీఎన్జీవోల సంఘం నేతృత్వంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాగిస్తున్న సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఏమాత్రం నైతిక విలువలున్నా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోలకు శాశ్వత గుర్తింపు లేనందున దాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందుతున్న అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామని చర్చలకు ఆహ్వానించారు. సచివాలయ తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ప్రాంతానికి వెళ్లిపోతామని చెప్పిన సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు మాటమార్చారని తప్పుపట్టారు.