pdf candidate
-
ఆ రూ.లక్ష గిఫ్ట్ కూపన్లు నాకొద్దు
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలకు రూ.లక్ష విలువ చేసే గిఫ్ట్ కూపన్లు ఇచ్చిందని, అందుకే తాను ఆ కూపన్లను తిరిగి పంపుతున్నానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఏసీ టైం టేబుల్ ప్రకారం శాసనమండలిలో ఐదు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరగాల్సింది పోయి ఇతర అంశాల వైపు దారి మళ్లిస్తున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో విపక్షం లేనందున, అధికార పార్టీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, వాళ్లే జబ్బలు చరుచుకుంటున్నారనని ఆయన ఎద్దేవా చేశారు. అయితే మండలిలో విపక్షాలు ఉన్నాయి.. కనీసం ఇక్కడైనా చర్చించాల్సింది పోయి, తమ లాంటి స్వతంత్ర ఎమ్మెల్సీల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, అంగన్వాడీలు, కేజీబీవీ సిబ్బంది, రైతుల సమస్యలపై అసలు చర్చించడం లేదని ఆరోపించారు. ఎలాంటి చర్చలు జరగని మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న తనకు ఇచ్చిన రూ.లక్ష విలువైన గిఫ్ట్ కూపన్లను తిరస్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాది పాటు టాటా సంస్థకు చెందిన ‘క్రోమా’ షో రూమ్‌లో రూ.లక్ష విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోమంటూ కూపన్లు ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నట్లుగా భావించి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలి జాయింట్ సెక్రటరీ విజయరాజుకు సోమవారం కూపన్లు తిరిగి ఇచ్చేశారు. -
చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!
సాక్షి, అమరావతి: శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని బిల్లులు చట్టరూపం దాల్చకుండా తాత్కాలికంగా అడ్డుకుని.. తమ పదవులకే ఎసరు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు. (చదవండి: అప్రజాస్వామికం) మండలి రద్దయితే టీడీపీకి తీరనినష్టం మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 32 కాగా.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఆ పార్టీకి చెందిన వారే. మండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. మండలిలో ఈ రెండు బిల్లుల్ని అడ్డుకునేందుకు బాబు, లోకేష్, యనమల మంత్రాంగం నడుపుతున్న సమయంలోనే పలువురు టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులను కొద్దిరోజులు అడ్డుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని.. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చిందని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. (చదవండి: వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) ఈ క్రమంలోనే పార్టీ విప్‌ను ధిక్కరించి పోతుల సునీత, శివనాథరెడ్డిలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. కొందరు యనమల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు, లోకేశ్ రాజకీయాల వల్ల పైకి మాట్లాడలేక పోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తమ భవిష్యత్తును పణంగా పెట్టారని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తమ పదవులకు ఎసరు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారని మరికొందరు వాపోతున్నారు. శాసనమండలి రద్దు దిశగా అడుగులు పడుతుండడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితి వస్తుందని చెప్పినా వినలేదు: పీడీఎఫ్ చంద్రబాబు, లోకేశ్ తీరు వల్లే శాసన మండలి ఉనికే లేకుండాపోయే పరిస్థితి ఏర్పడిందని పీడీఎఫ్ సభ్యులు, పలువురు ఇండిపెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం కావాలని తాము మొదటి నుంచి టీడీపీ సభ్యులకు చెబుతున్నా స్వప్రయోజనాలు చూసుకున్నారని, వారి స్వార్థానికి అందరూ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. టీడీపీ తీరుపై పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం మండలిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బిల్లులు అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత చైర్మన్‌తో జరిగిన చర్చల్లోనూ.. నిబంధనల ప్రకారం వ్యవహరించి బిల్లులపై ఓటింగ్ నిర్వహించాలని కోరారు. (చదవండి:ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) చైర్మన్‌తో చంద్రబాబు తప్పు చేయించి అందరినీ బలి చేస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలికి ఎలాంటి అధికారాలు, విధులు లేవని.. అనవసరంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని స్వతంత్య్ర సభ్యుడు కంతేటి సత్యనారాయణరాజు టీడీపీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చాన్నాళ్ల అనంతరం వైఎస్ హయాంలో మండలిని పునరుద్ధరించుకుంటే.. ఇప్పుడు దాన్ని లేకుండా చేయొద్దని హితవు పలికినా చంద్రబాబు అండ్ కో పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయం వల్ల సొంత పారీ్టకి చెందిన సభ్యులతోపాటు పట్టభద్రులు, ఉపాధ్యాయుల ప్రతినిధులుగా మండలిలో అడుగుపెట్టిన మేధావులకు సైతం నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని సభ్యులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. (గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?) -
పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం..!
సాక్షి, కాకినాడ సిటీ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవీ) విజయ పథంలో దూసుకుపోతున్నారు. రంగరాయ మెడికల్ కళాశాలలో ఎన్నికల అధికారులు బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. 7 టేబుళ్లు వేసి బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభించారు. ఒక్కో రౌండ్‌కు గంటన్నర నుంచి 2 గంటల సమయం పట్టడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. 26 రౌండ్లు ముగిసేసరికి ఐవీ రావు 91820, నల్లమిల్లి శేషారెడ్డి 37056 ఓట్లు సాధించారు. నాలుగు రౌండ్లు మిగిలి ఉండగానే ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి) గెలుపు కోటాకు సరిపడా ఓట్లు సాధించారు. 26 రౌండ్లకు 1,82,000 ఓట్లు లెక్కించగా, ఇళ్ళ వెంకటేశ్వరరావు 54,764 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇంకా కేవలం రెండు రౌండ్లు మాత్రమే లెక్కించాల్సి ఉంది. మిగిలిన ఓట్ల లెక్కింపు, ఐవీ గెలుపొదినట్టు అధికారిక ప్రకటన వెలువడడం ఇక లాంఛనమే. మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 46 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఉభయ గోదావరి జిల్లాల్లో నమోదైన పట్టభద్రుల ఓటర్లు 1,92,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతి తక్కువ మంది మూడంకెల స్థానంలో నిలిచారు. చాలా మంది అభ్యర్థులు అంతంత మాత్రంగానే ఓట్లు పొందారు. చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. -
పీడీఎఫ్ అభ్యర్థిగా గేయానంద్
అనంతపురం ఎడ్యుకేషన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థిగా ఎమ్మెల్సీ గేయానంద్ బరిలో దిగనున్నారు. ఈ మేరకు స్థానిక కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించే సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనున్నారు.


