breaking news
PCC leader
-
బాబు ఇచ్చిన 600 హామీలపై నిలదీయండి
కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్లో ఆలోచించి ఓటేయండి ప్రజలకు రుద్రరాజు సూచన అమలాపురం టౌ¯ŒS : చంద్రబాబు 2014 ఎన్నికల్లో తమ ఎన్నికల మేనిఫేస్టోలో 600 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లయినా ఆ హామీలను అమలు చేయలేదని, ఆ అంశంపై టీడీపీ జన చైతన్య యాత్రలో మీ ముందుకు వచ్చే నాయకులను నిలదీయండని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఏజేవీబీ మహేశ్వరరావు, పీసీసీ నాయకులతో కలిసి గురువారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా? వద్దా? చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలు అమలయ్యాయా? లేదా? అనే రెండు ప్రశ్నలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్లో ప్రజలు ఆలోచించి మరీ ఓట్లు వేయాలని రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రజా బ్యాలెట్లు తొలుత జిల్లా కేంద్రాలు, తర్వాత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో కూడా దశల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతిలో ప్రజాబ్యాలెట్ నిర్వహించామని, ఈనెల 7న కర్నూలులో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మన జిల్లాలోనూ ప్రజా బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఓ మాజీ సైనికుడు ఆత్యహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని పీపీపీ ఉపాధ్యక్షుడు బుచ్చి మహేశ్వరరావు ఖండించారు. 19 నుంచి ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వందో జయంతి ఈనెల 19న జరుగుతోందనిరుద్రరాజు తెలిపారు. 19వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 19 వరకూ ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఏడాదంతా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఇందిరాగాంధీ పేరును కొనసాగించాలని ఆయన డిమాండు చేశారు. పీసీసీ నాయకులు కల్వకొలను తాతాజీ, అయితాబత్తుల సుభాషిణి, సత్తి బాపూజీ, ములపర్తి సత్యనారాయణ, విప్పర్తి మాధవరావు, కొత్తూరి శ్రీను, షహె¯ŒS షా, ఎండీ ఆరీఫ్, డీసీసీ నాయకులు కోడూరి బాబి, కుడుపూడి శ్రీను, తిక్కా ప్రసాద్, అడపా మాచరరావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు రైతులు కనిపించరా?: గండ్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా, రైతులు తీవ్ర నిరాశానిస్పృహలో ఉన్నా సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని పీసీసీ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, వెంటనే ఏకమొత్తంగా పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ల సదస్సులో రైతు రుణమాఫీ, కరువు గురించి ప్రస్తావిస్తారని, సమస్యలను పరిష్కరిస్తారని ఆశించినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. బ్యాంకర్లతో సీఎం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, రైతులకు కొత్త రుణాలు ఇచ్చేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రజలు పక్కరాష్ట్రాలకు వలసలు పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదన్నారు. దేశంలో కాంగ్రెస్ సీఎంలకు ఒక న్యాయం, కాంగ్రెసేతర సీఎంలకు మరో న్యాయం అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.