breaking news
PAVITHROTSAVAM
-
బ్రహ్మాండనాయకుడి పవిత్రోత్సవాలు! ఎందుకు చేస్తారంటే..?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి శాస్త్రోక్తంగా అర్చించటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కానిపని. అలాంటిది సామాన్య మానవులు జరిపే శాస్త్రోక్త విధానమైన భగవత్పూజా విధానం అతిదుస్సాధ్యమని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారికి జరిగే నిత్యపూజల్లో, ఉత్సవాలలోనూ ద్రవ్య మంత్రతంత్రాది లోపాలు అనేకం చోటు చేసుచేసుకోవడం పరిపాటి. ఇలా తెలిసీ తెలియక జరిగిన దోషనివృత్తికి ప్రత్యేకంగా ఉత్సవ రూపాల్లో ఉన్న ఒక ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది. దానికే పవిత్రారోపణం లేక పవిత్రోత్సవం అని పేరు. ఆగస్టు 3 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్న సందర్భంగా....పవిత్రోత్సవం అంటే పరమపవిత్రమైన ప్రాయశ్చిత్త మహోత్సవం. సంవత్సరానికొకసారి ఆలయ పవిత్ర వాతావరణం పునఃస్థాపితం కావడానికి జరిపే ఉత్సవమిది. ఆలయాల్లో సంవత్సర పర్యంత చేసే ఆరాధనలలో జరిగే దోషాలను నిత్య, నైమిత్తిక, కామ్య ఉత్సవాలైన నిత్యారాధనాహోమ (బలి) నివేదన, బలి సమర్పణలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జ్యేష్టాభిషేక, సహస్రకలశ స్నపన, ఆరాధనాదులు, దేశ ప్రజాజనహితార్థం ఆచరించే యజ్ఞ యాగాది క్రియలలో జరిగే మంత్ర, తంత్ర, క్రియారూప, శౌచ, అశౌచ దోషనివారణకై స్వామికి జరిపించే ఉత్సవం. ఈ పవిత్రోత్సవంలో పూసలుగా అమర్చబడిన మాలలను ప్రతిష్టించి శ్రీస్వామివారికి, ఆలయపరివార దేవతలకు సమర్పించటం ప్రధానఘట్టం. పవిత్ర సూత్రాలను పవిత్రమండపంలోని పీఠంలో ఉంచి వాటిని దర్భకొసలతో కూడిన పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి ఆగమోక్త విధానంగా వాటిని ప్రతిష్టించి ఉక్తహోమం జరిపి ఉత్సవమూర్తులకు అష్టకలశ స్నపనం జరిపి ధ్వజ ఛత్ర చామర పింఛ నృత్య గేయ సమాయుక్తంగా ఆచార్యుడు ఆలయ ప్రదక్షిణం చేసి దేవదేవుణ్ణి విశేషంగా అర్చించి అష్టోత్తరశత పవిత్ర సూత్రాలను జాను పర్యంతం సమర్పించడం ఉత్తమం. చతుః పంచాశత్ (54) సూత్రములను ఊరువుల వరకు సమర్పిస్తే మధ్యమం. సప్తవింశతి (27) సూత్రాలను నాభ్యన్తం సమర్పిస్తే అధమం అని ఆగమోక్తం. వీటిలో యథాశక్తి సమర్పించాలి. పవిత్రములను ఈవిధంగా దేవ దేవునికి ఆరోపణ చేయటమే పవిత్రారోపణం. ఇదే విధంగా పరివారదేవతలకు కూడా ఒక్కొక్కరికీ సమర్పించాలి. ముందుగా అంకురార్పణ చేయాలి. ఇది దాదాపు అన్ని ప్రధాన ఆలయాలలోనూ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరిపించవలసిన ఉత్సవం.తిరుమలలో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితజన వత్సలుడు అయిన శ్రీమన్నారాయణునికి వైఖానసాగమోక్తంగా జరిగే ఈ పవిత్రోత్సవం భక్తితో చేయించినా, కళ్లారా దర్శించినా భక్తులు సర్వ పాపల నుంచి విముక్తి పొంది యశస్సు, సంపద, సంవత్సరార్చన ఫలం, విష్ణుసాయుజ్యం, అశ్వమేధయాగ ఫలం, సర్వోపద్రవనివారణయేగాక సర్వాభీష్టఫలాలు పొంది నిర్భీతులై, ధర్మ తత్పర నిష్టాగరిష్టులై సుఖిస్తారని భృగు సంహిత చెబుతోంది. పవిత్రోత్సవం అనే మాటకు పవిత్రీకరణ కార్యక్రమమని పేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వ్రేలికి దర్భతో చేయబడిన పవిత్రం ధరించి కార్యక్రమం జరపడం అలవాటు. దీనివల్ల కార్యక్రమానికి మానసికంగా యజమానికి నిర్మలతత్త్వం చేకూరుతుందనేది సంప్రదాయం.ఆలయాల్లో పవిత్రోత్సవం ఏడాదికొక పర్యాయం ఆలయపవిత్ర వాతావరణం పునఃస్థాపితమయ్యేందుకు జరుగుతుందని చెప్పుకున్నాం కదా... ఐతే ఇది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో, అంతకు ముందు బలిపీఠాల వద్ద, మూలబేరం వద్ద జనసమ్మర్దం వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని పోగొట్టేందుకు జరిపే సంప్రోక్షణం కన్నా భిన్నమైంది. దానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పేరు. పవిత్రోత్సవంలో మంత్ర, వేద, పురాణపారాయణాది కార్యక్రమాల ద్వారా భగవానుడే లేదా మూలమూర్తే విద్యుదుత్పాదక యంత్రంగా పనిచేయడం జరుగుతుంది.ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ రోజుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి, ఆయన దేవేరులతో పాటు ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యాణ మండపంలోని యాగశాలలో ఉంచబడి ఉత్సవానంతరం పూర్ణాహుతి అయిన తర్వాత మరల ఆలయప్రవేశం గావించబడతాయి. ఈ దినాల్లో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మొదటిరోజున పట్టుపోగులతో తులసిపూసలు లేదా తామరతూడు సరంలా కనిపించే పవిత్రాలను యాగశాలలో ఉంచుతారు. రెండవరోజున శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రములను శ్రీవారి ఆలయానికి, బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి నడుమగల ప్రధాన ఇతర పరివారదేవతలకు సమర్పించటం జరుగుతుంది. మూడవరోజున పవిత్ర విసర్జనం జరుపబడి పూర్ణాహుతితో ఉత్సవం సమాప్తమవుతుంది.చారిత్రకంగా ఈ పవిత్రోత్సవం 15వ శతాబ్దంలో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటానికి, ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల లేదా సిబ్బంది వల్ల తెలియకుండా జరిగే దోషాలను నివారించడానికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ ఏకాదశినాడు ఉత్సవమూర్తిని తిరుమామణిమండపంలో వేంచేపు చేస్తారు. ద్వాదశినాడు తలకు, మెడకు, మణికట్టుకు తిరుపవిత్రంతో అలంకరించి దేవేరులతో కూడా ఊరేగింపు జరుపుతారు. శ్రావణ శుక్లద్వాదశి విష్ణు పవిత్రారోపణ దినంగా తులసి పెంచటానికి ఉపయోగించే భూమిలో పెరిగిన ప్రత్తి చెట్లనుండి తీసిన దారంతో ఈ పవిత్రం చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద నివేదన తప్పకుండా జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలను ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజమాసాల్లో శుక్లపక్షంలోని పాడ్యమి, విదియ, పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమిల్లో భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, రేవతి, శ్రవణం మొదలైన నక్షత్రాల్లో ఆచరించాలని పంచరాత్రాగమం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఉపయోగించే పవిత్రాలు బంగారు, వెండి, రాగి, మృణ్మయం, పత్తి, ముంజ గడ్డి, దర్భ, పట్టు మొదలైనవాటితో చేస్తారు. అలా చేసిన పవిత్రాలను ఆచార్యుడు స్వీకరించి, పంచగవ్యాదులతో ప్రోక్షించి, ఆ ఆలయాగమాన్ననుసరించి పవిత్రాలకు యజ్ఞ ఆరాధనాదులను పూర్తి చేస్తారు. వీటిని స్వామికి సమర్పించడంవల్ల సర్వులకూ ఆయుః క్షేమాభివృద్ధి కలుగుతుంది. శ్రీమన్నారాయణారాధనను అత్యంత భక్తిశ్రద్ధలతో సంవత్సర కాలం చేస్తే కలిగే ఫలితమంతా పవిత్రారోపణమాచరిస్తే కలుగుతుందని ప్రతీతి. చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?ఈ పవిత్రోత్సవం (Pavithrotsavam) మహా ప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతీ సంవత్సరం చేయాలి. ఈ ఉత్సవం అలా ఆచరించకున్నా పరమాత్మకు ఆ సంవత్సరకాలం చేసిన ఆరాధనమంతా నిష్పలమవుతుంది. అందువల్ల ఈ ఉత్సవాన్ని ప్రతిసంవత్సరం ఆచరించాలని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచడం, ఆ తర్వాత రోజు పవిత్రాలు యాగశాలలో ఉంచడం, తర్వాత పవిత్రసమర్పణం, పూర్ణాహుతి జరిపి ఉత్సవాలకు స్వస్తి వాచకం పలుకుతారు. ఎప్పుడు ప్రారంభం...ఈ పవిత్రోత్సవాలు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజులలో మూడు రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు ముందు రోజు ‘అంకురార్పణం’తో ప్రారంభమవుతాయి, ఇందులో నవధాన్యాలను మట్టి పాత్రలలో విత్తుతారు.ముఖ్య ఉద్దేశ్యం...ఏడాది పొడవునా జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. - డి.వి.ఆర్. భాస్కర్ -
ఆగస్టు 15 నుంచి 17 వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు
-
తిరుమల: నేడు నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు మరో వార్షికోత్సవం కనువిందు చెయ్యనుంది. ఆగస్టు 27 నుంచి వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంంది. ఎల్లుండి మాఢవీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగనున్నారు. మూడ్రోజుల పాటు(ఆగస్టు 29) వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది కాగా ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. నేడు నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఆన్లైన్ వసతి కోటాను 25న విడుదల చేయనుంది, తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది,. శ్రీవారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చింది. -
పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ
ఏడు కొండల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజూ పండుగే. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలను విశిష్ట కైంకర్యంగా చేపడతారు. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసన ఆధారం. సోమవారం నుంచి పదో తేదీ వరకు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల చరిత్ర తెలుసుకుందాం.. తిరుమల : శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి దోషాల పరిహారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆలయ శాసనాలలో.. తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ క్రమం తప్పకుండా ఏటా శ్రావణమాసం శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. శాస్త్రోక్తంగా అంకురార్పణ పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామివారి సేనాపతి అయిన విష్వక్సేనుడు పల్లకీపై తిరువీధుల్లో విహరిస్తూ ఆలయ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడే భూమి పూజ, మృత్సంగ్రహణం (పుట్టమన్నును) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు. ఈమేరకు శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డెప్యూటీ ఈఓ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలిరోజు మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతో తయారు చేసిన పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగిస్తారు. మూడోరోజు – ముగింపు హోమాలు, అభిషేక పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగ మోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు. (చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు) మూడు రోజులు ఆర్జిత సేవల రద్దు పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 8న సహస్ర దీపాలంకరణ సేవ, 9న అష్టదళ పాద పద్మారాధన సేవ, 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కల్యోణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. రెండో రోజు – సమర్పణ తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారికి సమ ర్పిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని పరివార దేవతలకు పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. -
ఆన్లైన్లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను జారీ చేస్తారు. రూ.2,500 చెల్లించి భక్తులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు స్నపన తిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్స వాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజి నల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. (క్లిక్: బ్రహ్మోత్సవాల సమయంలో ‘ప్రత్యేక’ దర్శనాలు రద్దు) -
సింహగిరిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు
సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమాలతో పవిత్రోత్సవాలను ప్రారంభిస్తారు. 29వ తేదీన ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి ఆదివాసములు, పారాయణలు, 30వ తేదీ ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి పవిత్ర సమర్పణ, 31న ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం ఏకాంత స్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆర్జిత సేవలన్నీ రద్దుచేసినట్లు దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. -
శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: తిరుమలలో బుధవారం నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 5వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఈ పవిత్రోత్సవాలకు ఉదయం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను రద్దు చేశారు. కాగా, ఈ నెల 7న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఆరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి మూసివేయనున్నారు. -
పవిత్రోత్సవాలకు శాస్రోక్తంగా అంకురార్పణ
సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం నిర్వహించే పవిత్రోత్సవాలకు శనివారం శాస్రోక్తంగా అంకురార్పణతో ఆరంభించారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసనాధారాలు ఉన్నాయి. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. ఆదివారంæనుంచి ఈనెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక ఉత్సవం నిర్వహిం^è నున్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాపతి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయం వెలుపల వసంత మండపంలో వేంచేపు చేశారు. తర్వాత వైఖానస ఆగమోక్తకంగా మృత్సంగ్రహణం, అంకురార్పణం, ఆస్థానంతో కార్యక్రమాన్ని వైదికంగా పూర్తి చేశారు. ఇక తొలిరోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి పవిత్రోత్సవ మండపం వేంచేపు చేసి పట్టు పవిత్రాలను ( పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. రెండోరోజు సోమవారం పట్టు పవిత్రాలు సమర్పించనున్నారు. చివరి రోజు మంగళవారం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈ ఉత్సవం కారణంగా ఆదివారంæనుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆయా రోజుల్లో నిర్వహించే విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు అపవిత్రమయ్యాయి తెలిసో, తెలియక జరిగిన దోషాల నివారణ కోసం చేసే పవిత్రోత్సవాలు దోçషం ఉన్న అర్చకుడితో నిర్వహించటం మరింత దోషం అవుతుంది. అరిష్టాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్యక్రమాన్ని నిర్వహించే సీతారామాచార్యులు అత్తకు కర్మకాండలు నిర్వహించి రెండు నెలలు కూడా గడవక ముందే ఆయనతో పవిత్రోత్సవాలు నిర్వహించటం శాస్త్ర విరుద్ధం. దీనిపై ఆలయ అధికారులకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పవిత్రోత్సవాలు మరింత అపవిత్రం అవుతాయి. జరగబోయే అరిష్టాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. –మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు విమర్శ