breaking news
Patriotic movies
-
సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్
దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి... ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్ హీరోస్’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి... యుద్ధానికి కొత్త నిర్వచనం‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని యూనిట్ పేర్కొంది.అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్. కొన్ని చారిత్రక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావొచ్చు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో గాల్వాన్ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనే సల్మాన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై సల్మాన్ ఖాన్ ఈ దేశభక్తి సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మేజర్ షైతాన్ సింగ్ మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్ వార్ డ్రామా ‘120 బహదూర్’. ఈ హిందీ చిత్రంలో సిల్వర్ స్క్రీన్‌పై షైతాన్ సింగ్‌గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1962లో జరిగిన ఇండియా–చైనా వార్‌లో ప్రధానంగా చెప్పుకునే ‘రెజాంగ్ లా’ యుద్ధం సంఘటనలు ప్రధాన ఇతివృత్తంతో ‘120 బహదూర్’ సినిమా రూపొందుతోంది. దాదాపు 3 వేలమంది చైనా సైనికులను ఎదుర్కొని, 120 మంది భారతీయ సైనికులు ఎలా వీరోచితంగాపోరాడారు? అనే నేపథ్యంలో ‘120 బహదూర్’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఈ నవంబరు 21న విడుదల కానుంది. రాజ్‌పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్‌లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్స్ ట్రాప్‌లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఈ సైనికులను రెస్క్యూ చేసే ఆపరేషన్‌ను రాజ్‌పాల్ పునియా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేశారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటల నేపథ్యంలో ‘ఆపరేషన్ ఖుక్రీ’ సినిమా రానుంది. ఈ చిత్రంలో రాజ్‌పాల్ పునియాగా రణ్‌దీప్ హుడా నటిస్తారు. ఆపరేషన్ ఖుక్రీ: ది ట్రూ స్టోరీ బిహైండ్ ది ఇండియన్ ఆర్మీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ బుక్ హక్కులను రణ్‌దీప్ హుడా ఫిల్మ్స్, రాహుల్ మిత్రా ఫిల్మ్స్ దక్కించుకున్నాయి. బోర్డర్లో వార్ భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్ చేయగా, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్’ (1977) సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ చిత్రం తెరకెక్కిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. గూఢచారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘జీ2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలోని ఈ చిత్రంలో వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో చేస్తున్నారు. అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా 2018లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్‌లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్‌చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కీస్ పరమ వీర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘ఇక్కీస్’ అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగాపోరాడి, అమరుడైన అరుణ్ ఖేత్రపాల్గా అగస్త్య నంద (అమితాబ్‌బచ్చన్ మనవడు) నటిస్తున్నారు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో సాగే మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు సూపర్‌గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్‌లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్‌పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్‌గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్‌పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్‌ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్‌కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్‌గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్‌లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్‌తోపాటు కశ్మీర్‌లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్‌లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్‌లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్‌లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్‌ను రాజ్ పాల్ పునియా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్‌దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్‌దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్‌లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
Independence Day 2024: మేరా భారత్ మహాన్
దేశం అంటే భక్తి... ప్రేమ ఉన్నవాళ్లు దేశం కోసం ప్రాణాలను వదిలేయడానికి కూడా వెనకడుగు వేయరు. ‘మేరా భారత్ మహాన్’ అంటూ నిజజీవితంలోప్రాణాలను పణంగా పెట్టిన అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరి జీవితాల ఆదర్శంగా వెండితెరపైకి వచ్చిన సినిమాలనూ చూశాం. ప్రస్తుతం నిర్మాణంలో అలాంటి నిజ జీవిత వీరుల నేపథ్యంలో, కల్పిత పాత్రలతోనూ రూపొందుతున్న దేశభక్తి చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.భూతల్లిపై ఒట్టేయ్... ‘‘భూతల్లిపై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్... తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టేయ్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా, వారిలో దేశభక్తి ఉ΄÷్పంగేలా పాట పాడుతున్నాడు వీరశేఖరన్. ఇతని గురించి బాగా తెలిసిన వ్యక్తి సేనాపతి. ఎందుకంటే సేనాపతి తండ్రి వీర శేఖరన్. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ (కల్పిత పాత్ర) ఏ విధంగా పోరాడాడు? అనేది వెండితెరపై ‘ఇండియన్ 3’ సినిమాలో చూడొచ్చు. హీరో కమల్‌హాసన్–దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇండియన్’ (‘భారతీయుడు’) ఫ్రాంచైజీలో త్వరలో రానున్న చిత్రం ‘ఇండియన్ 3’. ఈ చిత్రంలో వీరశేఖరన్, సేనాపతి పాత్రల్లో తండ్రీకొడుకుగా కమల్‌హాసన్ కనిపిస్తారు. 1806 సమయంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ ఏ విధంగా పోరాడాడు? అతని పోరాట స్ఫూర్తితో 1940లలో సేనాపతి ఏం చేశాడు? అనే అంశాలతో ‘ఇండియన్ 3’ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారత్ మాతా కీ జై ‘తేరే పాకిస్తానీ అడ్డా మే బైట్ కే బతా రహా హూ... భారత్ మాతా కీ జై...’ అంటూ నాగచైతన్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ‘తండేల్’ సినిమాలోనిది. విజయనగరం, శ్రీకాకుళంప్రాంతాలకు చెందిన మత్య్సకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరప్రాంతానికి వలస వెళ్తారు. వేటలో భాగంగా వారికి తెలియకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డులు ఈ భారత మత్స్యకారులను బంధీలుగా పట్టుకుని జైల్లో వేస్తారు. పాకిస్తాన్ జైల్లో వీరి పరిస్థితి ఏంటి? వీరి కుటుంబ సభ్యులు వీరి కోసం ఏమైనా పోరాటం చేశారా? అనే అంశాల నేపథ్యంలో ‘తండేల్’ కథనం ఉంటుందని తెలిసింది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, అతని భార్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.మార్టిన్... ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ మార్టిన్ అనే భారతీయుడిని క్రూరంగా శిక్షించాలనుకుంటుంది. మార్టిన్‌కు దేశభక్తి ఎక్కువ. ఎంతలా అంటే... అతని చేతిపై ఇండియన్ అనే ట్యాటూ ఉంటుంది. అసలు పాకిస్తాన్ జైల్లో మార్టిన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అనేది కన్నడ చిత్రం ‘మార్టిన్’ చూస్తే తెలుస్తుంది. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన చిత్రం ఇది. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ దేశభక్తి, యాక్షన్, ఎమోషనల్ మూవీ అక్టోబరు 11న రిలీజ్ కానుంది.అమరన్ ‘రమణ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయింది), తుపాకీ, కత్తి’ వంటి సినిమాల్లో సామాజిక బాధ్యతతో పాటు కాస్త దేశభక్తిని కూడా మిళితం చేసి, హిట్ సాధించారు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌తో ‘అమరన్’ సినిమా చేస్తున్నారాయన. ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపిస్తారు శివ కార్తికేయన్. సాయిపల్లవి హీరోయిన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ‘సికందర్’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే ఉంటుందని టాక్.సరిహద్దు యుద్ధం దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రాల్లో నటించేందుకు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన చేసిన ‘బేబీ, ఎయిర్ లిఫ్ట్, ‘మిషన్ మంగళ్’ వంటి చిత్రాలు ఇందుకు ఓ నిదర్శనం. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. 1965లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సారా అలీఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. సందీప్ కెవ్లానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. అలాగే 1971లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో 1997లో హిందీలో ‘బోర్డర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. కాగా ఇటీవల సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ను ప్రకటించారు. ఇంకా భారత్–పాకిస్తాన్ విడిపోయిన నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘లాహోర్ –1947’ సినిమా కూడా చేస్తున్నారు సన్నీ డియోల్. ఇక పాకిస్తాన్ చిన్నారిని ఆమె దేశంలో విడిచిపెట్టేందుకు ‘భజరంగీ భాయిజాన్’ (2015)గా సల్మాన్ ఖాన్ చేసిన సాహసాలను సులభంగా మర్చిపోలేం. ఈ ఫిల్మ్‌కు సీక్వెల్ ఉంటుందని చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
Independence Day 2023: మేరా భారత్ మహాన్
దేశం అనగానే భారతీయ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. సరైన దేశభక్తి సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్ చేసి భావోద్వేగంతో ఊగిపోతారు. బాలీవుడ్లో మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన 10 దేశభక్తి సినిమాలు.. హకీకత్ (1964): దేశాల మధ్య యుద్ధాలు వస్తే సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు తప్పనిసరి. వాటిని చూపుతూనే యుద్ధాలు ఎలా సగటు సైనికుడి ్రపాణాలు బలిగొంటాయో కూడా చూపిన సినిమా హకీకత్. 1962 నాటి ఇండో చైనా యుద్ధం మీద వచ్చిన ఈ సినిమా అతి తక్కువ మంది భారత సైనిక పటాలం చైనా భారీ సేనతో ఎలా తలపడిందో చూపుతుంది. బల్రాజ్ సహానీ, ధరేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. కైఫీ ఆజ్మీ రాసిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఏ వతన్ సాథియో’ ఇందులోదే. ఉప్కార్ (1967): దేశభక్తి సినిమాలు తీసి ‘మిస్టర్ భరత్’ బిరుదు ΄÷ందిన నటుడు మనోజ్ కుమార్ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సూచన మేరకు ‘జై జవాన్ జై కిసాన్’ నినాదానికి ఇచ్చిన సినీ రూపం ‘ఉప్కార్’. సైనికులు దేశ సరి హద్దుల వద్ద మాత్రమే సంఘర్షణ చేస్తారు... కాని రైతులు దేశంలో జీవితాంతం సంఘర్షణ చేసి గింజలు పండించి జనం కడుపులు నింపుతారు... వారే నిజమైన హీరోలు అని చెప్పే సినిమా ఇది. ‘ఇస్ దేశ్ కి ధర్తీ ఉగ్లే హీరా మోథీ’ హిట్ గీతం ఇందులోదే. బోర్డర్ (1997): యుద్ధంలో చావు కళ్ల ముందు కదలాడుతుంటే దేశం తప్ప మరేమీ గుర్తు రాక సంతోషంగా బలిదానం ఇచ్చే సైనికుల వీరత్యాగం ఎలా ఉంటుందో ‘బోర్డర్’లో చూడాలి. 1971 నాటి ఇండో పాక్ యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు జె.పి. దత్తా తీసిన ఈ సినిమా ఒక గొప్ప వార్ మూవీ. సన్ని డియోల్, సునీల్ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాలో సైనికుల జీవితాన్ని వాస్తవికంగా చూపడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. యుద్ధ వ్యూహాలు కూడా ఈ సినిమాలో తెలుస్తాయి. లగాన్ (2001): దేశభక్తికి క్రీడలు జత చేసి గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ‘లగాన్’. పన్నుల మీద పన్నులు వేసి దాష్టీకం చేస్తున్న బ్రిటిష్ వారిని చిన్న పల్లెజనం క్రికెట్లో ఓడించడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఆస్కార్ నామినేషన్ ΄÷ందింది. అద్భుతమైన కథనం, సంగీతం, నటన, భావోద్వేగాలు, ఆటలో ఉండే మలుపులు తోడు కావడంతో ప్రేక్షకులు జేజేలు పలికారు. ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్ (2002): అమర దేశభక్తుడు భగత్ సింగ్ కథను తీసుకుని రాజ్ కుమార్ సంతోషి తీసిన అద్భుతమైన సినిమా ఇది. అజయ్ దేవగణ్– భగత్ సింగ్ పాత్రను పోషించి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్... ఈ ముగ్గురు దేశభక్తులు తమ ఉడుకు నెత్తురుతో దేశం కోసం పోరాడి లేత వయసులో మరణించడం ప్రేక్షకుల మనసు కలచి వేసేలా ఈ సినిమా చూపుతుంది. దేశం కోసం ఎలాంటి స్ఫూర్తితో ఉండాలో తెలుపుతుంది. లక్ష్య (2004): మంచి దేశభక్తి సినిమా మాత్రమే కాదు యువతను లక్ష్యం వైపు నడిపించే సినిమా కూడా. రిలీజైనప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కార్గిల్ వార్‌ను నేపథ్యంగా తీసుకుని గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. హృతిక్ రోషన్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. మిలట్రీ వాతావరణం, క్రమశిక్షణ, ధీరత్వం ఈ సినిమాలో పుష్టిగా చూడొచ్చు. స్వదేశ్ (2004): ఈ దేశం నీకేమిచ్చిందని కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అని తరచి ప్రశ్నించుకోవాలని నెహ్రూ అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకుని పరాయి దేశానికి వెళ్లి ఆ దేశానికి సేవ చేయడం తప్పు కాదు కానీ మన దేశానికి ఏదైనా చేయాలన్న బాధ్యతను మరువకూడదని ఎంతో గట్టిగా చెప్పింది ‘స్వదేశ్’. షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఎన్ఆర్ఐల బాధ్యతను నిలదీసిన సినిమా ఇది. రంగ్ దే బసంతి(2006): ఉద్యోగం వచ్చే చదువును చదువుకోవడం వేరు, దేశం పట్ల చైతన్యాన్ని కలిగించుకుని బాధ్యతను గుర్తెరగడం వేరు. నేటి యువత తమ కెరీర్‌ను వెతుక్కుంటున్నది గాని దేశం కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదు. ‘రంగ్ దే బసంతి’... అల్లరి చిల్లరి యూనివర్సిటీ కుర్రాళ్లను దేశం కోసం ఏదైనా గట్టిగా చేయాలని నిర్ణయించుకోవడాన్ని చూపుతుంది. పుచ్చిపోయిన వ్యవస్థను సరిచేయాలనుకుని ్రపాణాలు అర్పించే కుర్రాళ్ల కథ ఇది. రాకేష్ మెహ్రా దర్శకుడు. ఆమిర్ ఖాన్ హీరో. ది ఫర్గాటెన్ హీరో (2004): నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ఈ దేశం గుండె సగర్వంగా స్పందిస్తూనే ఉంటుంది. బ్రిటిష్ వారిపై పోరాడటానికి ఏకంగా సైన్యాన్ని నిర్మించిన ధీరుడు ఆయన. నేతాజీ మరణం ఇంకా మిస్టరీనే. నేతాజీ జీవితాన్ని అథెంటిక్‌గా చూపిన సినిమా ఇది. శ్యామ్ బెనగళ్ దర్శకునిగా ఎంత రీసెర్చ్ చేశాడో తెలుస్తుంది. నేతాజీగా సచిన్ ఖడేకర్ అద్భుతంగా నటించారు. గతించిన చరిత్రకు దర్పణం ఈ సినిమా. రాజీ (2018): దేశం కోసం గూఢచారిగా పని చేసి త్యాగాలు చేసిన వారు ఎందరో. వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి ఒక స్త్రీ కథ ‘రాజీ’. ఆలియా భట్ నటించిన ఈ సినిమా పాకిస్తాన్‌కు కోడలుగా వెళ్లి అక్కడ భారత్ కోసం గూఢచారిగా పని చేసిన సెహమత్ అనే స్త్రీ ఎదుర్కొన్న సవాళ్లను చూపుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో నిర్మితమైనా భారీ వసూళ్లను రాబట్టింది. -
Independence day celebrations 2023: స్వేచ్ఛాగీతం
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంతర్జాలంలో ఆరంభం అయ్యాయి. ఆనాటి దేశభక్తి గీతాల నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల వరకు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు... వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడి వడి స్వేచ్ఛా వాయువు పీల్చి – రాట్నగీతము (గురజాడ రాఘవశర్మ) వీరభారతి సందేశం పరదేశీయులు తొలగండి ఈ భారతదేశం మా దేశం వినండి! వినండి! విశ్వప్రజలు వీరభారతి సందేశం – వానమామలై వరదాచార్యులు చిత్రం: 1857 సిపాయి తిరుగుబాటు ఉప్పోయమ్మ ఉప్పు ముప్పది కోట్ల ప్రజల ముప్పు దీర్చే ఉప్పు ఉప్పుగాదిది రత్నపు తిప్ప మన పాలిటికి – ఉప్పుపాట (గరికపాటి మల్లావధాని) ఫోటో: దండి సత్యాగ్రహం: ఏప్రిల్6, 1930 చెప్పరా...లేకున్న ముప్పురా! చెప్పరా! నీ కన్నులిటపై/ విప్పరా! ఆ ప్రభుత నింతట త్రిప్పరా! లేకున్న–నీకగు ముప్పురా! మాయప్ప ఇప్పుడు – పాంచాలము (గరిమెళ్ల) ఫొటో: సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో బాంబేలో బ్రిటిష్ వారి వస్తువులతో ఉన్న ఎడ్లబండి ముందుకు పోకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్న ఉద్యమకారుడు -
రిపబ్లిక్ డే: ఓటీటీలో చూడాల్సిన దేశభక్తి సినిమాలివే!
రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు స్కూళ్లు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించుకుంటాయి. దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు, పాటలతో ఊరూవాడా హోరెత్తిపోతుంది. మనకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారిని, ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడంతో మనసు ఉప్పొంగుతుంది. ఇక ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏ ఛానల్లో చూసినా దేశభక్తి సినిమాలే! అవును మరి.. గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి సినిమా చూడకపోతే ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి.. వూట్ ► ఖడ్గం ► మేజర్ చంద్రకాంత్ (ప్రైమ్‌లోనూ లభ్యం) అమెజాన్ ప్రైమ్ వీడియో ► భారతీయుడు ► సర్దార్ పాపారాయుడు ► రాజీ ► సర్దార్ ఉద్ధమ్ ► చక్‌దే ఇండియా ► మణికర్ణిక ► షేర్షా హాట్‌స్టార్ ► మంగళ్‌పాండే ► కంచె నెట్‌ఫ్లిక్స్ ► మేజర్ ► లగాన్ ► ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ► స్వేడ్స్ ► రంగ్ దే బసంతి జీ5 ► ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ► సుభాష్ చంద్రబోస్ ఇవే కాకుండా మేజర్ చంద్రకాంత్, సైరా నరసింహారెడ్డి, చిట్టగాంగ్, ఎల్ఓసీ కార్గిల్, మంగళ్ పాండే, బార్డర్, ఇలా మరోన్నో సినిమాలు దేశభక్తి ఆధారంగా తెరకెక్కినవే! ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఓ మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోండి. -
Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం
సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్ విశేషాలు తెలుసుకుందాం. బయోపిక్‌ల వెల్లువ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్ బోస్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్ బోస్’ టైటిల్‌తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్ పాత్రను రాకేష్ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కనిపిస్తారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్‌తో సినిమా రూపొందుతోంది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 1971లో భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్ బహదూర్’ టైటిల్‌తో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చఫీస్’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారు. 1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. ఖేతర్పాల్ పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తుండగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. జీవిత కథలు కాదు కానీ.. ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లోనే సీక్వెల్ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్’. కంగనా రనౌత్ లీడ్ రోల్లో సర్వేశ్ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీకి గాంధీ బయోపిక్ జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్‌గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించనున్నారు. ఈ సిరీస్‌లో గాంధీ పాత్రను ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. -
దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 టాలీవుడ్ సినిమాలు ఇవే
యావత్ భారతదేశం గర్వకారణంగా, దేశభక్తిని గుండెలో నింపుకొని జరుపుకొనే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది భారతీయులను స్వత్రంత్ర్యం పొందిన గొప్ప రోజు ఇది. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. ఈ 75 ఏళ్లలో దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగులో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల ఓ లుక్కేద్దాం.! అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది. ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి. శుభాష్ చంద్ర బోస్ క్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ఇది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాం బాక్సాపీస్ వద్ద బోల్తా పడినప్పటీకీ.. వెంకటేశ్ నటన మాత్రం ఆకట్టుకుంది. భారతీయుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా,, అకాగే అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది. సైరా నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. . బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు. మహాత్మ 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట’దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది. పరమ వీర చక్ర 2011 లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఘాజీ 1971లో జరిగిన యదార్ధ యుద్దగాద నేపధ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. సర్దార్ పాపారాయుడు 1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. బొబ్బిలి పులి 1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. -
మనోజ్‌కుమార్‌కు ‘ఫాల్కే’
* దేశభక్తి సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన హీరో *పురస్కారంతో పాటు 10 లక్షల నగదు న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ కుమార్(78)కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించారు. ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘ఉపకార్’, ‘క్రాంతి’ లాంటి విజయవంతమైన దేశభక్తిని ప్రబోధించే సినిమాల్లో కథానాయకుడిగా మనోజ్ నటించారు. ‘మేరా దేశ్ కి ధర్తీ..’ ‘ఏక్ ప్యార్ క నగ్మా హై తదితర ఎవర్గ్రీన్ పాటల్లోనూ ఆయన కనిపిస్తారు. ఫాల్కే అవార్డ్ కింద స్వర్ణ కమలం, 10 లక్షల నగదును ఆయనకు అందించనున్నారు. లతామంగేష్కర్, ఆశాభోంస్లే, కవి, రచయిత సలీమ్ ఖాన్, గాయకులు నితిన్ ముకేశ్, అనూప్ జలోటాలతో ప్రభుత్వం నియమించిన ఎంపిక కమిటీ మనోజ్ కుమార్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. మనోజ్ కుమార్ హీరోగా నటించిన వాటిలో హరియాలీ ఔర్ రాస్తా, హనీమూన్, వో కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, సాజన్, దో బదన్, పథ్థర్ కే సనమ్, రోటీ కపడా ఔర్ మకాన్.. తదితర విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న అబోతాబాద్లో 1937, జూలై 24న మనోజ్ జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు హరికృష్ణగిరి గోస్వామి. మనోజ్‌కు పదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఢిల్లీకి తరలి వచ్చింది. డిగ్రీ అనంతరం మనోజ్ సినీరంగ ప్రవేశం చేశారు. నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం ప్రేరణతో మనోజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఉపకార్’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. సంతోషంగా ఉంది: మనోజ్‌కుమార్ పురస్కారాన్ని తనకు ప్రకటించడం పట్ల మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. స్నేహితులు ఫోన్ చేసి చెబితే తొలుత నమ్మలేదని వ్యాఖ్యానించారు.