breaking news
Pasindu Sooriyabandara
-
మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉంది. సోనల్ దినూష (7), కెషారా నువంత (3) క్రీజులో ఉన్నారు. సోనల్ దినూష మాత్రమే బ్యాటర్ కావడం, మిగతావాళ్లంతా టెయిలెండర్లు కావడంతో చివరి రోజు టీమిండియా బౌలర్లకు మిగతా నాలుగు వికెట్లు తీయడం కష్టమేమీ కాదు. అయితే లంక రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్ పసిందు సూరియబండార ఆయువు పట్టుగా నిలిచాడు. 21 పరుగుల వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత 90 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక నాలుగో రోజు ఆటను పూర్తి చేయగలిగిందంటే అదంతా పసిందు చలవే. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పసిందును ఔట్ చేసేందుకు టీమిండియా మాస్టర్‌ప్లాన్ వేసింది.ఆ మాస్టర్‌ప్లాన్‌లో పంత్, మానవ్ సుతార్లు కీలకపాత్ర పోషించారు. ఇన్నింగ్స్ 61వ ఓవర్ మానవ్ సుతార్ వేశాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన స్లో బంతిని పసిందు ఆడే ప్రయత్నంలో క్రీజులైన్ దాటి బయటికి వచ్చాడు. ఇది గమనించిన పంత్ కేవలం 0.3 సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. రిప్లేలో పంత్ చేసిన డిస్మిసల్ చూస్తే వారెవ్వా అనకుండా ఉండలేం. ఈ ఒక్క స్టంపౌట్ విషయంలో మాత్రం భారత మాజీ కీపర్ ఎంఎస్ ధోనిని కూడా మించిపోయాడనంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా మానవ్ సుతార్ తెలివైన బంతితో పసిందును బోల్తా కొట్టించినప్పటికీ, ఇక్కడ పంత్‌ను కూడా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకముందు బంతికే పసిందు ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో పంత్.. ‘బ్యాటర్ అలసిపోయాడు.. రెడీగా ఉండండి’ అన్న మాటలు మైక్ స్టంప్‌లో రికార్డయ్యాయి.Rishabh Pant stumped Sri Lanka’s Sooriyabandara in just 0.3 seconds 🥶🔥What a quick stumping 🔥 pic.twitter.com/lztPjNcEMf— Harshit (@I_am_Harshit_17) August 26, 2026Read: దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే? -
దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే?
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆటకు మరో రోజు మిగిలి ఉన్న సమయంలో టీమిండియా మరో విజయం దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత రెండో సెషన్లో జడేజా, సిరాజ్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడేజా బౌలింగ్‌లో పసిందు సూరియబండార డీప్ ఫార్వర్డ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లనప్పటికీ, అక్కడే ఉన్న సిరాజ్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చాలా దూరంలో పడింది. క్యాచ్ పట్టడం కష్టమని తెలిసినా కూడా జడేజా మాత్రం సిరాజ్ చర్యపట్ల అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచాడు. దీంతో సిరాజ్‌కు చిర్రెత్తుకొచ్చి.. ‘అరె జడ్డూ బాయ్.. నువ్వు నా ఏరియాలో నిలబడి ఫీల్డింగ్ చెయ్యు.. అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది’ అని నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. దీనికి ప్రతిచర్యగా జడేజా మాత్రం ‘సరే వదిలెయ్’ అన్నట్లుగా తలూపాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాటలు అరుచుకున్నప్పటికీ కాసేపటికే ఇద్దరూ కూల్ అయ్యారు. మ్యాచ్ విషయానికొస్తే.. బుధవారం నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. డెబ్యూ ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకను ఫాలో ఆన్ ఆడించేందుకు టీమిండియా మొగ్గు చూపింది. లంక తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రోజు ముగిసేసరికి 5 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న లంక 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.pic.twitter.com/jFfDPp6M6B— crictalk (@crictalk7) August 26, 2026Read: 27 ఏళ్లకే కెరీర్ క్లోజ్; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్ సిద్ధం! -
IND vs SL: ఎట్టకేలకు ఆధిక్యంలోకి శ్రీలంక!
టీమిండియాతో రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. పసిందు సూరియబండారా అద్భుత ఆట తీరుతో లంక పరువును కాపాడాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాల వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.290 రుగులకే ఆలౌట్అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 290 రుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. దీంతో లంక దాదాపు మూడు వందల పరుగులకు చేరువకాగలిగింది.ఫాలో ఆన్భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అరంగేట్ర ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలో ఆన్‌లో భాగంగా వెంటనే శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రాణించిన పసిందు, కమిందుఈ క్రమంలో బుధవారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే శ్రీలంక తమ ఓపెనర్ లాహిరు ఉదార (3) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ కమిల్ మిశార (32)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ పసిందు రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత కమిందు మెండిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించాడు.ఈ క్రమంలో కమిందు అర్ధ శతకం (55) పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కాగా.. పసిందు సెంచరీ దిశగా పయనించాడు. అయితే, మానవ్ సుతార్ స్పిన్ మాయలో చిక్కుకుని.. 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (6) విఫలమయ్యాడు.ఎట్టకేలకు ఆధిక్యంలోకి లంకఅయితే, వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు. మొత్తానికి నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. సెంచరీ వీరుడు సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆటకు గురువారమే చివరి రోజు. అయితే, బుధవారం వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేసిన క్రమంలో గురువారం ఉదయం 9.45 నిమిషాలకే మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే గాలెలో టీమిండియా గెలుపొందింది. కొలంబోలోనూ భారత్ గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే, వర్షం ముప్పు కారణంగా గురువారం వీలైనంత త్వరగా లంకను ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
టీమిండియా కొంపముంచిన ప్రసిధ్.. గంభీర్, జడేజా ఆగ్రహం!
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫాలో ఆన్‌లో మాత్రం లంక జాగ్రత్తగా ఆడుతోంది. భారత్‌కు విజయం దక్కనివ్వొద్దనే కాంక్షతో లంక బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు టీమిండియా ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవిడవడం కూడా లంకకు కలిసొచ్చింది. ముఖ్యంగా పసిందు సూరియబండారా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం 90 పరుగులతో ఆడుతున్న సూరియబండారా 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ క్రిష్ణ వదిలేయడం భారత్ కొంపముంచింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జడేజా వేసిన ఫ్లైటెడ్ డెలివరీని పసిందు బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిధ్ క్యాచ్ అందుకోవడం కష్టతరమైనప్పటికీ, కాస్త ముందుకు డైవ్ చేసి ఉంటే సులువుగా క్యాచ్ తీసుకునేవాడే. కానీ అతడు ప్రయత్నం చేయకపోవడంతో బంతి అతని చేతి వేళ్లను తాకుతూ పక్కకు వెళ్లిపోయింది. ఇది చూసిన జడేజా..‘ అరె బాయ్.. ఏ క్యా హై?’ అంటూ ప్రసిధ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇదే సమయంలో డ్రెసింగ్ రూమ్ నుంచి గమనిస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రసిధ్ క్యాచ్ జారవిడవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా క్యాచ్ డ్రాప్‌తో బతికిపోయిన పసిందు సూరియబండారా ఇప్పుడు సెంచరీకి చేరువలో ఉన్నాడు. తనకు వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత ఫిఫ్టీ సాధించడంతో పాటు తన జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఒకవేళ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ అందుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.pic.twitter.com/YHn9sJJyfU— crictalk (@crictalk7) August 26, 2026Read: నంబర్‌వన్ బౌలర్‌గా స్టార్క్.. 16 ఏళ్ల కెరీర్లో తొలిసారి -
గాయపడ్డ సిరాజ్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. శ్రీలంకతో రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా క్యాచ్ అందుకునే క్రమంలో ఈ హైదరాబాదీ అదుపుతప్పి కిందపడ్డాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 503-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన.. టీమిండియా ఫాలో ఆన్ ఆడిస్తోంది.పసిందు క్యాచ్ అందుకునేందుకు..ఈ క్రమంలో లంక రెండో ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో శ్రీలంక వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా షాట్ ఆడగా.. క్యాచ్ పట్టేందుకు సిరాజ్ డీప్ మిడ్ వికెట్ పొజిషన్ నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ కొట్టాడు.మైదానం వీడి.. ఈ క్రమంలో బంతిని అందుకున్నప్పటికీ.. అది సిరాజ్ చేజారింది. అదుపు తప్పి కిందపడ్డ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కటెముకల వద్ద చేయి పెట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. హుటాహుటిన ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, నొప్పి తగ్గకపోవడంతో సిరాజ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చిన సిరాజ్భోజన విరామం తర్వాత కూడా సిరాజ్ ఫీల్డ్‌కు రాలేదు. దీంతో సిరాజ్ గాయంపై అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అయితే, కాసేపటి తర్వాత అతడు మైదానానికి వచ్చి చురుకుగా ఫీల్డింగ్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్! -
మెరిసిన పసిందు, దినుష.. ఇంకా వెనుకబడే ఉన్న శ్రీలంక
టీమిండియాతో రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక పోరాట పటిమ కనబరిచింది. కొలంబోలో 8/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట మొదలుపెట్టింది ఆతిథ్య జట్టు. కాసేటికే ఓపెనర్ కమిల్ మిశారా (19) వెనుదిరిగినప్పటికీ.. నాలుగో నంబర్ బ్యాటర్ పసిందు సూరియబండారా పట్టుదలగా నిలబడ్డాడు.మెరిసిన పసిందుభారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. కమిందు మెండిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న పసిందు తొమ్మిది ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ రవీంద్ర జడేజా అద్భుత బంతితో పసిందును బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియాకు మంచి బ్రేక్ లభించింది.మిగిలిన వారిలో కమిందు మెండిస్ (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా డకౌట్ అయి నిరాశపరచగా.. ఈసారి సొనాల్ దినుష బాధ్యత తీసుకున్నాడు. అతడికి తోడుగా కేశారా నువాంత (74 బంతుల్లో 18) నిలబడ్డాడు.దినుష పోరాటంమంగళవారం ఆట ముగిసే సమయానికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార (8*) నిలిచాడు. వర్షం వల్ల భోజన విరామం తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత చాలా సేపు ఆట కొనసాగగా.. మూడో సెషన్‌ను మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 5.45 నిమిషాల వరకు నిర్వహించాలని భావించారు. అయితే, మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాలకు ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడి ఉంది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆటలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: టెక్నిక్ లేకుండా ఆడతాడు.. పంత్‌కు అదొక్కటే ప్లస్!


