breaking news
panche kattu
-
ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ..
ఉగాది అనగానే అందరికీ పంచెకట్టు గుర్తుకువస్తుంది. నేటి ఆధునిక కాలంలో జీన్స్, టీ-షర్టులు, సూట్లు ఎన్ని వచ్చినా, భారతీయుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలువుటద్దం ‘పంచె’. వేల ఏళ్లుగా మహర్షుల నుంచి మహారాజుల వరకు, సామాన్యుల నుంచి స్వాతంత్ర్య సమరయోధుల వరకు ప్రతి ఒక్కరూ గర్వంగా ధరించిన వస్త్రమిది. మన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన పంచె (ధోతీ) ప్రస్థానం గురించి ఆసక్తికర విశేషాలు..సింధు నాగరికత నుంచే..పంచె చరిత్ర నేటిది కాదు.. దాదాపు 5,000 ఏళ్ల క్రితం నాటిది. క్రీస్తుపూర్వం 2500 కాలంలోని సింధు లోయ నాగరికత తవ్వకాల్లో బయటపడిన శిల్పాలను గమనిస్తే, అప్పటి పురుషులు నడుము చుట్టూ ఒక పొడవైన వస్త్రాన్ని ధరించేవారని తెలుస్తున్నది. భారత దేశ ఉష్ణమండల వాతావరణానికి, ఇక్కడి తేమతో కూడిన వేడికి ఈ పంచెకట్టు ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో ఇది కాలక్రమేణా మన జీవనశైలిలో భాగమైపోయింది.‘ధౌత’ నుంచి ‘ధోతీ’ వరకూ..పంచెను ఉత్తరాదిలో ‘ధోతీ’ అని పిలుస్తారు. ఈ పదం సంస్కృత పదమైన ‘ధౌత’ నుంచి ఉద్భవించింది. వేద కాలంలో దీనిని ‘వస్త్ర’ లేదా 'అంతరీయ' అని పిలిచేవారు. అప్పట్లో దైనందిన జీవితంలోనే కాకుండా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా దీనిని తప్పనిసరిగా ధరించేవారు. నేటికీ దేవాలయాల్లో లేదా పూజా కార్యక్రమాల్లో పంచె ధరించడం అనేది క్రమశిక్షణకు, పవిత్రతకు నిదర్శనంగా భావిస్తారు.ప్రాంతం ఏదైనా.. ప్రాభవం ఒక్కటే!భారతదేశం విభిన్న సంస్కృతుల నిలయం. అందుకే పంచె కట్టులో కూడా ప్రాంతాన్ని బట్టి మార్పులు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్‌లో: దీనిని ‘పంచె’ అని పిలుస్తారు. రెండు వైపులా మడతలతో గట్టిగా కట్టడం ఇక్కడి ప్రత్యేకత.తమిళనాడులో: 'వేష్టి' అంటారు. సాధారణంగా ఒకే మడతతో సరళంగా కట్టుకుంటారు.కేరళలో: 'ముండు' అని పిలుస్తారు.బెంగాల్లో: అందమైన కుచ్చెళ్లతో, ముడులతో ప్రత్యేక శైలిలో ధరిస్తారు.సాధారణంగా 5 గజాల పొడవు ఉండే ఈ వస్త్రాన్ని దాదాపు ఐదు ముడులతో కట్టడం ఒక కళ. దక్షిణ భారత దేశంలో తెల్లటి పంచెలకు బంగారు రంగు జరీ అంచు (గోల్డ్ బోర్డర్) ఉండటం గౌరవ సూచకంగా భావిస్తారు.స్వాతంత్య్ర పోరాటంలో అస్త్రంగా..బ్రిటీష్ కాలంలో విదేశీ వస్త్రాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంచె ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది. మహాత్మా గాంధీ స్వయంగా పంచెను ధరించి, విదేశీ దుస్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇది సమానత్వానికి చిహ్నంగా మారి, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి రాజకీయ నేతలకు ఇది ఒక అధికారిక ఆహార్యంగా మారింది.ఆధునిక కాలంలో కొత్త హంగులుమారుతున్న కాలానికి అనుగుణంగా పంచె కూడా తన రూపురేఖలను మార్చుకుంటోంది. ఒకప్పుడు కేవలం సంప్రదాయ వస్త్రానికే పరిమితమైన పంచె, నేడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తన సత్తా చాటుతోంది. నేటి తరం యువత కోసం ‘ధోతీ ప్యాంట్స్’ అందుబాటులోకి వచ్చాయి. ఇవి అటు పాశ్చాత్య సౌకర్యాన్ని, ఇటు భారతీయ లుక్‌ను అందిస్తున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్లు కూడా వేదికల మీద పంచెకట్టుతో మెరుస్తూ దీనికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏవైనా పంచె లేకుండా మన వేడుక పూర్తికాదు. పత్తి (కాటన్) తో తయారయ్యే పంచెలు నిత్యం ధరించడానికి సౌకర్యంగా ఉంటే, పట్టు పంచెలు వైభవానికి గుర్తుగా నిలుస్తాయి. పంచె అనేది కేవలం ఒక వస్త్రం కాదు అది మన భారతీయత మూలాలతో ముడిపడిన ఒక అనుబంధం.ఇది కూడా చదవండి: బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా.. -
అన్నవరంలో కొత్త నిబంధన
అన్నవరం (ప్రత్తిపాడు): తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించే భక్తులు ఇకపై విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. స్వామివారి వ్రతం, నిత్య కల్యాణం, ఇతర సేవలలో పాల్గొనేటప్పుడు, స్వామివారి దర్శనం సమయంలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురుషులు పంచె, కండువా ధరించాల్సి ఉంటుందన్నారు. షర్టు ధరించవచ్చు, ప్యాంటు మాత్రం ధరించకూడదని తెలిపారు. మహిళలు చీర, పంజాబీ డ్రెస్ వంటివి ధరించాలి. ఫ్యాషన్ దుస్తులు ధరించి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఈవో వివరించారు. దేవస్థానం సత్రాలలో వసతి గదులు తీసుకునే భక్తులు జూలై ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా గదులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గదులు కావాల్సినవారు తప్పనిసరిగా ఆధార్‌కార్డ్ చూపించాలన్నారు. ఎవరి పేరుపై రూమ్ రిజర్వ్ అయి ఉంటుందో వారికే రూమ్ ఇస్తారన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్న భక్తులు వారు రిజర్వేషన్ చేయించుకున్న సమయం దాటాక రెండు గంటల వరకు మాత్రమే గదులు ఇస్తారని, ఆ సమయం దాటితే మరో భక్తునికి ఆ గది కేటాయిస్తామన్నారు. నగదు వాపస్ కూడా ఇవ్వబోమని తెలిపారు. ప్రాకారం, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు రద్దు ఆలయ రక్షణ చర్యలలో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి స్వామివారి ఆలయ ప్రాకారంలో, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు చేసుకోవడం నిషేధించామని ఈవో తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ఆలయం తలుపులు మూసేశాక ఆ ప్రదేశంలోకి ఎవరినీ అనుమతించరని వివరించారు. -
సోగ్గాడి లుక్‌లో సమంత
పెళ్లి వార్తల తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత తిరిగి బిజీ అవుతుంది. ఇప్పటికే రాజుగారి గది 2 తో పాటు రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు మరికొన్ని తమిళ, తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పల్లెటూరి పెద్దమనిషిలా సమంత పంచె కట్టు, షర్టు తో కనిపిస్తున్న ఈ స్టిల్.. రామ్ చరణ్ సినిమాలోది అన్న టాక్ వినిపిస్తోంది. చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. ఫోటోలో రావూ రమేష్ కూడా ఉండటంతో ఈ సినిమాలో సమంత సరదాగా తండ్రి ఆటపట్టించే సీన్‌కు సంబంధించిన స్టిల్ అని భావిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా.. సమంత లుక్కు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.


