breaking news
Pakistan Hockey
-
రోజుకు 40 డాలర్లేనా!.. ఇలాగే కొనసాగితే...
లాహోర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్‌లకు గాను ఇచ్చిన మ్యాచ్ ఫీజుపై పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్‌ల్లో భాగంగా... ఈ నెల అర్జెంటీనాలో పాకిస్తాన్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. వాటికి సంబంధించిన రోజూవారీ భత్యాలు తాజాగా అందించారు. అయితే ముందు చెప్పిన దాంట్లో మూడో వంతు ఫీజులు కూడా ఇవ్వకపోవడంపై జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో ఆడబోమని వెల్లడించారు. ఇది చాలా అవమానకరం‘అర్జెంటీనాలో జరిగిన ప్రొ లీగ్ సందర్భంగా రోజుకు 30,000 రూపాయలు ఇస్తామని ముందు చెప్పారు. కానీ దానికి బదులు రోజుకు 11,000 చొప్పున ఇచ్చారు. ఇది చాలా అవమానకరం. అంటే డాలర్ల రూపంలో చూసుకుంటే రోజుకు 110 డాలర్లు ఇస్తామని చెప్పి 40 డాలర్లు కూడా ఇవ్వలేదు. చెప్పిన దానికి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది’ అని ఒక ఆటగాడు పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లకు 30,000 రూపాయలు రోజూవారీ భత్యం చెల్లించాలనేది పాకిస్తాన్ హాకీ సమాఖ్య విధానం. మేము ఏమీ చేయలేంకానీ ప్రొ లీగ్ రెండు దశలకు జట్టు మొత్తం ఖర్చులను పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు నిధులు సమకూరుస్తున్నందున ఈ విషయంలో మేము ఏమీ చేయలేం’ అని ఎఫ్ఐహెచ్ కార్యదర్శి రాణా ముజాహిద్ పేర్కొన్నాడు. కాగా అర్జెంటీనా అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు పరాజయం పాలైంది. -
ఆసియా కప్‌లో నేడు భారత్-పాకిస్తాన్ ‘ఢీ’
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జకార్తాలో నేడు జరిగే తొలి మ్యాచ్‌తో భారత హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ వేటను ప్రారంభించనుంది. బీరేంద్ర లాక్రా కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగనుంది. సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టులో 10 మంది కొత్త ఆటగాళ్లకు తొలిసారి అవకాశం లభించింది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో, డిస్నీ–హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. దాంతో గ్రూప్ ‘డి’లో ఒక విజయం, రెండు ఓటములతో 3 పాయింట్లు సాధించిన పాక్ మూడో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధించలేకపోయింది. అర్జెంటీనా తరఫున బాటిస్టా (10వ ని.లో), నార్డోలిలో (20వ ని.లో), ఫ్రాన్సిస్కో (30వ ని.లో), ఇబార (47వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాక్ ఆటగాళ్లు రాణా అబ్దుల్ (17వ నిమిషంలో), రిజ్వాన్ అలీ (28వ నిమిషంలో), అహ్మద్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... -
పాక్ హాకీ సెక్రటరీగా షెహజాద్ అహ్మద్
కరాచీ : పాకిస్తాన్ హాకీ సమాఖ్య సెక్రటరీగా పాక్ దిగ్గజ ఆటగాడు షెహజాద్ అహ్మద్ ను నియమించారు. హాకీ వరల్డ్ కప్ గెలిచిన పాక్ జట్టు కెప్టెన్ గానూ ఆయన ప్రసిద్ధి. అయితే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక, అతడు పాక్ హాకీకి చాలా దూరంగా ఉన్నాడు. హాకీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు ఖాలీద్ ఈజాజ్ చౌదరి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించాడు. అతడు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడించాడు. ఇప్పటివరకు సెక్రటరీగా ఉన్న రాణా ముజాహిద్ 2013 డిసెంబర్ నుంచి జట్టుకు సేవలందిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం కోల్కర్ హాకీ అధ్యక్షుడిగా కొనసాగతున్నారు.


