breaking news
Pakistan cricket bord
-
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్!
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్ వేసిన ఘనతను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. పాకిస్థాన్ దేశవాలీ టీ20 క్రికెట్ పోటీల సందర్భంగా పెషావర్ వేదికగా కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ అక్తర్ అతిపెద్ద నోబాల్ వేశాడు. క్రీజు లైన్ దాటిన అసద్ తన కాలిని చాలా ముందుకు పెట్టి బంతిని విసిరాడు. కావాలని విసిరాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ ఈ వింత నోబాల్ మాత్రం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అంతేకాదు ఇదే ఓవర్లో అసద్ రెండు నోబాల్స్, రెండు వైడ్స్ కలిపి మొత్తం 21 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. అయితే చాలా మంది అసద్ అక్తర్ వేసిన నోబాల్‌ను 2010లో ఇంగ్లండ్‌పై పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ వేసిన నోబాల్‌తో పోల్చుతున్నారు. అయితే అది స్పాట్ ఫిక్సింగ్‌లో భాగమని తర్వాత తేలడంతో ఆమిర్ సహా అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్‌లపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ముగ్గురికీ తర్వాత జైలుశిక్ష కూడా పడింది. తాజాగా అసద్ అక్తర్ వేసిన నోబాల్‌తో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది. A 25 year old Pakistani pacer, Asad Akhtar, bowled a shocking no ball in their ongoing premium domestic T20 tournament and it looked ridiculously suspicious. Spot fixing again. pic.twitter.com/zFRzScLFLx— Kakarot (@MidOffMind) March 15, 2026ఈ ఘటన నేపథ్యంలో 2010 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి అబ్దుల్ రజాక్ ఓ పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఆ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర ఒక మొబైల్ ఫోన్ రిపేర్ వల్ల యాదృచ్ఛికంగా ఎలా తెలిసిందో ఆయన వివరించాడు."లండన్‌లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు పార్ట్‌టైమ్‌గా మొబైల్ ఫోన్లు రిపేర్ చేసేవాడు. స్పాట్ ఫిక్సింగ్ సూత్రధారి మజార్ మజీద్ తన ఫోన్‌ను రిపేర్ కోసం నా స్నేహితుడికి ఇచ్చాడు. ఆ ఫోన్‌ను బాగు చేసిన తర్వాత అందులో మజార్‌కు, ముగ్గురు పాక్ ఆటగాళ్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను నా స్నేహితుడు చూశాడు. మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మెసేజ్‌లలో ఉన్నాయి" అని రజాక్ తెలిపాడు.చదవండి: ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్‌ను నాశనం చేస్తోంది! -
66 పరుగులకే ఆలౌట్.. పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025ను పాకిస్తాన్ ఓటమితో ఆరంభించింది. జోహోర్ బహ్రు వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 18.5 ఓవర్లలో కేవలం 66 పరుగులకే కుప్పకూలింది.పాక్ బ్యాటర్లలో కెప్టెన్ కోమాల్ ఖాన్(12), అయాజ్(15), ఆసిన్(10) డబుల్ ఫిగర్ మార్క్ అందుకోగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో అము సురేంకుమా 3 వికెట్లతో సత్తాచాటగా.. ఒలివా బ్రిన్స్డన్, ఓనీల్, కోల్మన్ తలా రెండు వికెట్లు సాధించారు.ఊదిపడేసిన ఇంగ్లండ్..అనంతరం 65 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 9.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కేటీ జోన్స్(20) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో మనహర్ జెబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆసిన్, ఫాతిమా ఖాన్ తలా వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం. జనవరి 18న ఐర్లాండ్‌తో జరగాల్సిన ఇంగ్లండ్ మొదటి మ్యాచ్ రద్దు అయింది. అదే విధంగా పాక్ మొదటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది.కాగా దక్షిణాఫ్రికా అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 22న అమెరికాతో తలపడనుంది. పాకిస్తాన్ కూడా అదే రోజున ఐర్లాండ్ మహిళలతో ఆడనుంది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీని అద్బుతమైన విజయంతో ఆరంభించింది.ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్ధి విండీస్ కేవలం 44 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 21న మలేషియాతో ఆడనుంది.చదవండి: Ranji Trophy: ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే? -
పాక్ ఆరోపణలు సరైనవి కావు
కరాచీ: ఇటీవల ముగిసిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డుప్లెసిస్‌కు శిక్ష విధించడంలో అలసత్వం చూపారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. క్రికెటర్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తీసుకున్న చర్యను ఐసీసీ సమర్థించుకుందని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ట్యాంపరింగ్‌కు సంబంధించి సవరించిన నిబంధనలను సాకుగా చూపెడుతోందని విమర్శించారు. ‘ఈ మొత్తం ఉదంతంలో బూన్... డుప్లెసిస్పై దయ చూపారు. 2010లో పెర్త్ వన్డేలో ఆఫ్రిది ట్యాంపరింగ్‌కు పాల్పడితే రెండు టి20 మ్యాచ్‌ల నిషేధం విధించారు. అప్పటి సంఘటన, ఇప్పటిది రెండు ఒకేలా ఉన్నప్పుడు శిక్షలో మాత్రం తేడా ఎందుకు అని మేం ప్రశ్నిస్తున్నాం. రెండో టెస్టులో మరికొంత మంది ప్రొటీస్ ఆటగాళ్లూ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై ఐసీసీ స్పందించిన తీరూ ఏమాత్రం బాగాలేదు. మ్యాచ్ రిఫరీ తీర్పును సమర్థించడమే పనిగా పెట్టుకుంది’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ చేస్తారు: ముస్తాక్ మహ్మద్ కరాచీ: ప్రతి జట్టు, ప్రతి బౌలర్ ఏదో ఓ సమయంలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడతారని పాక్ మాజీ కెప్టెన్, కోచ్ ముస్తాక్ మహ్మద్ అన్నారు. దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘బంతిపై మంచి గ్రిప్ లభించేందుకు స్పిన్నర్లు కూడా సీమ్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు నేను కూడా అలా చేశా. ఇది కూడా ఓ రకమైన ట్యాంపరింగే. ఏ జట్టయినా ఇలా చేయడం సర్వసాధారణం. అయితే ట్యాంపరింగ్ చేసిన ప్రతిసారి వికెట్లు పడతాయనుకోవడం పొరపాటు. రివర్స్ స్వింగ్ నైపుణ్యం ఉంటే బౌలర్లకు బాగుంటుంది’ అని ముస్తాక్ వివరించారు.


