breaking news
otago university
-
అవి తింటే రెండువారాల్లో ఒత్తిడి మాయం
రోజూవారీ ఆహారంలో తగినన్ని కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా రెండు వారాల్లో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చట. కాయగూరలు, పండ్లలో ఉండే ఆరోగ్యకరమైన విటమిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయని ఒటాగో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైకలాజికల్ గా ఆ వ్యక్తి చాలా ధృడంగా తయారవుతారని తమ పరిశోధనల్లో తేలినట్లు తెలిపారు. అప్పటివరకూ ఉన్న బాధలన్నీ కేవలం రెండే వారాల్లో పూర్తిగా మాయమవుతాయని వెల్లడించారు. 18 నుంచి 25 సంవత్సరాలు వయసున్న 171మందిపై పరిశోధనలు జరిపిన తర్వాత ఈ విషయంపై ఓ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. -
డ్యునెడిన్ (యూనివర్సిటీ ఓవల్)
నగరానికి పేరు తెచ్చిన ఒటాగో యూనివర్సిటీలో ఈ స్టేడియం ఉంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు దీని సొంతం. ఈ స్టేడియం అభిమానులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సుందరమైన పచ్చిక బయళ్లు, అద్భుతమైన దృశ్యాలు, నాణ్యమైన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 2000కు ముందు ఈ స్టేడియాన్ని గణనీయంగా మెరుగుపర్చారు. క్రికెట్‌ను ఆస్వాదించడానికి ఈ స్టేడియం చాలా అద్భుతంగా ఉంటుంది. సెంట్రల్ ఈస్ట్రన్ ఒటాగోలో ఈ నగరం ఉంది. ఈ నగరం చుట్టూ లోయలు, కొండలు, గుహలు ఉంటాయి. పసిఫిక్ సముద్రానికి దగ్గరగా ఉండటంతో అందమైన బీచ్‌లు ఉన్నాయి. స్కాట్లాండ్ నుంచి వలసదారులు దీన్ని గోల్డెన్ మైనింగ్ ప్రాంతంగా మార్చారు. డునెడిన్‌లో ఉన్న ఒటాగో యూనివర్సిటీ కివీస్‌లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి (1869)విశ్వవిద్యాలయం. ఈ స్టేడియం సామర్థ్యం 6 వేలు.