breaking news
onetown police station
-
ఎన్ని అడ్డంకులొచ్చినా స్టేషన్‌ను మార్చి తీరుతాం
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు వెల్లడి చిత్తూరు గిరింపేట: నగర అభివృద్ధి కోసం ఎన్ని అడ్డంకులొచ్చినా చిత్తూరు నడిబొడ్డులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను మార్చి తీరుతామని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఈ రెండున్నర సంవత్సరాల్లోనే చేశామన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా తమ శ్రీనివాస ట్రస్టు ద్వారా లక్షల రూపాయలను నగరాభివృద్ధికి ఖర్చు పెట్టామన్నారు. నగర నడిబొడ్డులోని పోలీస్‌స్టేషన్‌ను ఇతర ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతంలో గాంధీ, పూలే, ఎన్టీఆర్ విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితం సిమెంట్‌తో నిర్మించిన గాం«ధీ విగ్రహం మరమ్మతులకు గురవుతున్నా ఆ విగ్రహం అక్కడే ఉండాలని పలువురు కోరుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర నాయకుడు దొరబాబు మాట్లాడుతూ గతంలో ఉన్న శాసనసభ్యులు చిత్తూరు అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎన్నోఏళ్లుగా జరగని సంతపేట రోడ్డు విస్తరణ పనులు ఈ ఏడాది చేపట్టామన్నారు. త్వరలో కట్టమంచి నుంచి గిరింపేట లోని దుర్గమ్మ గుడి వరకు గల హైవే రోడ్డును విస్తరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కొంతమంది పనులను అడ్డుకోవడానికి కుట్ర పన్నడం అన్యాయమన్నారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి పనులను నిలిపే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ మేయర్ సుబ్రమణ్యం, టీడీపీ నాయకులు నాని, మాపాక్షి మోహన్, ప్రవీణ్, చక్రి, కార్పొరేటర్లు ఇందు, అన్నపూర్ణ, మురుగేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
మిర్యాలగూడలో లాకప్‌డెత్!
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోని బాత్రూమ్లో ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అశోక్‌వెంకట్(42) అనే వ్యక్తిని ఉదయం 8నుంచి 10 గంటల మధ్య పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. కాగా, సాయంత్రం సమయంలో అశోక్‌వెంకట్ బాత్రూమ్లోకి వెళ్లి చొక్కాతో ఉరి వేసుకున్నాడు. కాగా చాలా బరువుగా ఉన్న అశోక్‌వెంకట్ షర్టుతోనే చనిపోయాడా..? లేక విచారణలో పోలీసులు ఏమైన తీవ్రంగా కొట్టిచంపారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని ఏదైనా కేసు నిమిత్తం తీసుకువచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, ఎలాంటి కేసులు కూడా లేవని చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్, డీఎస్పీ సందీప్ గోనే సందర్శించారు. అనంతరం సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ ఇది కస్టోడియల్ డెత్‌గా భావిస్తున్నామని, సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. కాగా, గతంలో ఓ దొంగతనం కేసులో చక్రధర్‌రావు అనే వ్యక్తి ఇదే పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందాడు.