breaking news
old stock
-
పాత స్టాక్ పైనా డిస్కౌంట్!
న్యూఢిల్లీ: తగ్గిన ధరలపై ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టేట్టు ఉంది. వచ్చే నెల ఆరంభం లేదా మధ్య నాటికి ఈ ఉత్పత్తులు మార్కెట్‌కు చేరుకుంటాయని గోద్రేజ్ కన్జ్యూమర్ సహా పలు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కానీ, ఇప్పటికే కంపెనీలు, డీలర్లు, రిటైల్ స్టోర్లలో పెద్ద ఎత్తున ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత స్టాక్‌ను ఎలా విక్రయించాలా? అన్న ఆలోచనలో పడ్డాయి. పాత ఎంఆర్పీ (గరిష్ట చిల్లర విక్రయ ధర)పై తగ్గింపు రేట్లతో ఈ నెల 22 తర్వాత కూడా వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందన్న ఆశతో ఉన్నాయి. పాత స్టాక్ ఖాళీ అయి, కొత్త స్టాక్ మార్కెట్లోకి వచ్చే వరకు కొన్ని అవాంతరాలు ఎదుర్కోక తప్పేట్టు లేదని భావిస్తున్నాయి. ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ప్రతి సంస్థ ఆలోచిస్తోందని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఎంఆర్పీలను మార్చడం దిశగా పనిచేస్తున్నట్టు తెలిపారు. దీన్ని ఎదుర్కోవడంపై ఒక ప్రణాళికతో ముందుకు వస్తామని ప్రకటించారు. జీఎస్టీలో 12, 28 శాతం రేట్లను ఎత్తివేసి, ఇందులోని వస్తువులను 5, 18% శ్లాబుల్లోకి మార్చడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. స్వల్పకాలంలో ఇబ్బందులు తప్పవు.. అధిక టారిఫ్ల్లోని ఉత్పత్తులను 5 శాతం కిందకు తీసుకురాడం వల్ల స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సు«దీర్ సీతాపతి చెప్పారు. డీలర్లు, కంపెనీల వద్ద అధిక ఎంఆర్పీలతో ఉత్పత్తుల నిల్వలు ఉన్నట్టు చెప్పారు. కనుక కొత్త ఎంఆర్పీలతో కూడిన ఉత్పత్తులు వినియోగదారులను చేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పాత స్టాక్‌పై తగ్గింపు ఇస్తే అది నేరుగా వినియోగదారులకు బదిలీ అవుతుందన్న గ్యారంటీ లేదన్నారు. స్పష్టత కోసం చూస్తున్నాం.. కొత్త జీఎస్టీ రేట్ల అమలు మార్గదర్శకాల కోసం పరిశ్రమ వేచి చూస్తున్నట్టు పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించామని, వెంటనే కొత్త రేట్లకు మారిపోవాలా లేక కొత సమయం ఇస్తారా? అన్నది తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే పాత ధరలతో ఉన్న నిల్వల విషయంలో ఒక్కో కంపెనీ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పోల్చినప్పుడు ఆహారోత్పత్తుల మన్నిక (షెల్ప్ లైఫ్/నిల్వ కాలం) తక్కువగా ఉంటుందన్నారు. ఏం చేయాలన్నది అంతా ప్రభుత్వ మార్గదర్శకాలపైనే ఆధారపడి ఉంటుందంటూ, ఇవి త్వరలో వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ముందే తగ్గిస్తాం..తమ స్టోర్లలో ఉన్న ఉత్పత్తుల ధరల లేబుళ్లను మార్చబోమని, దీనికి బదులు తుది బిల్లు మొత్తంపై తగ్గింపు ఇస్తామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్, ఎండీ లలిత్ అగర్వాల్ ప్రకటించారు. ప్రభుత్వం జీఎస్టీలో కల్పించిన ఉపశమనం మేర బిల్లులో తగ్గింపు ఉంటుందన్నారు. కంపెనీ స్టోర్లలో కస్టమర్లకు తెలిసేలా బోర్డులు పెట్టినట్టు చెప్పారు. ఏసీలు, ఇతర కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలోని బ్లూస్టార్ సైతం సెపె్టంబర్ 22 తర్వాత కస్టమర్లకు తగ్గింపులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. -
పాత స్టాక్‌పైనా జీఎస్టీ
అన్ని వస్తుసేవలపైనా నేటి నుంచి కొత్త పన్ను ► పన్నుల్లో మార్పులుంటే తర్వాత సర్దుబాట్లకు అవకాశం ► జీఎస్టీ అమలు నోటిఫికేషన్లు రాకపోవడంతో గందరగోళం ► పాత స్టాక్ వదిలించుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లతో మార్కెట్లలో సందడి సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శనివారం నుంచి విక్రయించే దాదాపు 1200 రకాల వస్తువులు, అందించే సేవలకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వర్తించనుంది. ఇప్పటికే ఉన్న పాత స్టాకును విక్రయించినా కూడా కొత్త పన్నునే వసూలు చేయాల్సి ఉంటుంది. పాత స్టాకు అయినప్పటికీ దానిని విక్రయించినప్పుడు అమల్లో ఉన్న పన్ను వసూలు చేయాల్సి ఉంటుందని.. అందువల్ల శనివారం ఉదయం నుంచి జరిగే అన్ని వ్యాపార లావాదేవీలకు జీఎస్టీ వర్తిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతమున్న స్టాకు అంతా వ్యాట్, ఇతర కేంద్ర పన్నులతో కొనుగోలు చేసినది కావడంతో ఏ పన్నుపై అమ్మకాలు జరపాలన్న వ్యాపార వర్గాల సందేహాలకు స్పష్టత ఇచ్చారు. ఏవైనా వస్తువులపై పన్ను పెరిగినా, తగ్గినా కొద్దిరోజుల తర్వాత సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని జీఎస్టీ చట్టం కల్పించిందని.. ఈ మేరకు పన్ను వ్యత్యాసాలను సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాపారులు తమ వద్ద ఇప్పటికే ఉన్న స్టాక్ వివరాలను నెలరోజుల్లోపు అందజేయాలని కూడా అధికారులు ఆదేశించారు. నోటిఫికేషన్లు ఏవి? రాష్ట్రంలో శనివారం నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. జీఎస్టీ అమలుతోపాటు ఆయా వస్తువులపై పన్ను రేటును స్పష్టంగా పేర్కొంటూ.. కచ్చితంగా ఆ రేటుకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ శుక్రవారం రాత్రి వరకు కూడా ఈ నోటిఫికేషన్లేవీ విడు దల కాలేదు. కనీసం వాణిజ్య పన్నుల శాఖ వెబ్సైట్లోనూ పెట్టకపోవడం, శాఖాపరంగా క్షేత్రస్థాయికైనా పంపకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులు, వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. నోటిఫై చేయకుండా రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రాదని, అలాంటప్పుడు తాము ఏ పన్ను ప్రకారం వ్యవహరించాలో అర్థం కావడం లేదని కొందరు అధికారులు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సాయికిషోర్ వివరణ ఇస్తూ.. జీఎస్టీ అమలుకు అవసరమైన అన్ని నోటిఫికేషన్లు సిద్ధం చేశామని, పలు ముఖ్యమైన నోటిఫికేషన్లను విడుదల చేశామని, మరికొన్నింటిని త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. బడా మార్కెట్లలో సందడి జీఎస్టీతో సరు కుల విక్రయాల్లో మార్పులు రావొ చ్చన్న అంచనాతో పెద్ద వ్యాపార, దుకాణ సముదాయాలు గురు, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చాయి. 20 నుంచి 60 శాతం వరకు ధరలు తగ్గించడంతో.. హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతా ల్లోని మార్కెట్లలో సందడి కనిపించింది. ఎలక్ట్రానిక్ వస్తువు లపై పన్ను పెరగనుండడంతో పలువురు ముందుగానే కొనుగోలు చేశారు. జీఎస్టీ అమలుకు రెండు, మూడు రోజుల ముందు రాష్ట్ర మార్కెట్లలో వందల కో ట్లలో లావాదేవీలు జరిగినట్లు అంచనా. అడ్డగోలుగా పెంచొద్దు.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన వెంటనే దాదాపు అన్ని సరుకుల (పెట్రోల్, మద్యం మినహా) ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్నింటి ధరలు తగ్గనుండగా.. మరికొన్నింటి ధరలు పెరగ నున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచేయవచ్చని పన్నుల శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో నిత్యావసరాలు, ఇతర ముఖ్య వినియోగ వస్తువుల దుకాణాలు, హోల్‌సేల్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపైనా ఓ కన్నేసి ఉంచారు. అడ్డగోలుగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే అధికలబ్ధి నియంత్రణ నిబంధనను ప్రయోగిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధన కింద జరిమానాలతో పాటు కేసులు పెట్టే అవకాశం కూడా ఉందని తెలిపారు. పన్ను చెల్లింపు పరిధిలో ఉండే వ్యాపారులు శనివారం నుంచి రూ.200 కన్నా ఎక్కువ విలువైన ప్రతి లావాదేవీకి బిల్లు ఇవ్వాల్సిందేనని.. అందులో సదరు వస్తువుపై పన్ను రేటు, పన్ను మొత్తాన్ని కూడా పేర్కొనాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఔషధాల ధరలు భారీగా
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఔషధాల ధరలు భారీగా తగ్గాయి. వివిధ రోగాలకు సంబంధించి అత్యవసర ఔషధాల ధరలకు కళ్లెం వేశారు. రోగులకు అత్యవసర మందులను చౌకగా అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గిన మందుల ధరలను నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసెన్స్ (ఎన్ఎల్ఈఎం) ప్రకటించడం తో ఈ ఆదేశాలను వెంటనే అమల్లో పెట్టాలంటూ ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు వేల్పుల విజయ శేఖర్ అన్ని ఔషధ దుకాణాలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ ధరతో ఉన్న పాత స్టాక్‌ను విక్రయించరాదని స్పష్టం చేశారు. కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని సూచించారు. మెడికల్ దుకాణాలు, పంపిణీ సంస్థల వద్ద ఉన్న పాత స్టాక్‌ను వెంటనే సంబంధిత సంస్థలకు పంపించేయాలని పాత స్టాక్‌ను విక్రయించడం చట్టరీత్యా నేరమని వెల్లడించారు. విశాఖ జిల్లాలో దాదాపు 348 రకాల మందుల ధరలు తగ్గే అవకాశముంది. నగరంలోని ఇప్పటికే కొన్ని ఔషధ దుకాణాలు కొత్త ధరలకే మందులను విక్రయించడం మొదలెట్టారు. నగర శివారు ప్రాంతాల్లోనూ, కొన్ని మారుమూల ప్రాంతాల్లోనూ, వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే మందుల దుకాణాల్లోనూ కొత్త ధరలు అమలు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వీటిపై నిఘా పెట్టి చర్యలు తీసుకునేందుకు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. 60 శాతం తగ్గొచ్చు..! విశాఖ జిల్లాలో 1800 మందుల అమ్మకాల దుకాణాలున్నాయి. వీటికి మందులను సరఫరా చేసేందుకు 300 మంది డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు వున్నారు. ప్రతి నెలా జిల్లా నుంచి రూ. 27 కోట్ల వ్యా పారం జరుగుతోంది. అందులో 68 శాతం విశాఖ మహా నగరం నుంచే జరుగుతుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారితో బాటు ఛత్తీస్‌గఢ్, ఒఢిశా రాష్ట్రాలకు చెందిన వారు కూడా వైద్యం కోసం విశాఖకే తరలి వస్తుండడంతో మందుల అమ్మకాలకు విశాఖ కేంద్రంగా మారింది. అయితే తాజాగా అమల్లోకి వచ్చిన అత్యవసర మందుల ధరలు 10 నుంచి 60 శాతం వరకూ బ్రాండెడ్ మందుల ధరలు తగ్గాయి. ఈ ప్రభావం వల్ల దుకాణాల ఆదాయం కూడా స్వల్పంగా తగ్గే ఛాన్స్‌లున్నాయని అంచనా వేస్తున్నారు.


