breaking news
NTR died with abasement
-
సీఎం జగన్కు గీత కార్మికుల క్షీరాభిషేకం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇస్తున్న ఎక్స్గ్రేషియాను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి విజయవాడ గొల్లపూడిలో గీత కార్మికులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. చదవండి: Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా? -
అవమానభారంతోనే ఎన్టీఆర్ చనిపోయారు: నాయని
మెదక్: టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు అవమానభారంతోనే చనిపోయారని టిఆర్ఎస్ సీనియర్ నేత నాయని నరసింహా రెడ్డి చెప్పారు. సీఎం పదవి కోసం వైశ్రాయి హోటల్లో భేరసారాలు చేసుకున్నారని ఆయన తెలిపారు. దాంతో ఎన్టీఆర్ తీవ్ర అవమానానికి గురయ్యారన్నారు. తెలంగాణ కోసం ఒక్క రోజు కూడా పోలీసు దెబ్బలు తీనని, అసెంబ్లీలో నోరు మెదపని, రాజీనామా చేయకుండా పారిపోయిన వారే ఈరోజు తెలంగాణ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. 1969 ఉద్యమం తర్వాత ఉద్యమంలో పాల్గొన్నవారు తెలంగాణ రాలేదనే బెంగతోనే నక్సలైట్లగా మారారని చెప్పారు. పోట్టీ శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ కోసం చనిపోలేదని నాయని అన్నారు.