breaking news
Non-Agricultural Land Conversion
-
జెన్ ఏఐ కోత.. చేయూత
సాక్షి, హైదరాబాద్: మనదేశంలోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం మేర జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సేవారంగం, విద్య, మీడియా, ఆర్థిక సేవలు, క్లరికల్ పనులపై అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. శారీరక శ్రమతో కూడిన పనులు, నిర్మాణం వంటి రంగాలు ఏఐ ప్రభావం నుంచి సురక్షితంగా ఉంటాయని, రాబోయే దశాబ్దకాలంలో వార్షిక కార్మిక ఉత్పాదకత 0.4 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో 42–48 శాతం శ్రామిక శక్తికి ఇది సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా గోల్డ్‌మన్ సాక్స్ విడుదల చేసిన ’జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ)–భారత లేబర్ మార్కెట్‌పై ప్రభావం’ పై విడుదల చేసిన నివేదికలో ఆయా అంశాలను పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం ఏఐ ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు, ఇది చాలా అసమానంగా ఉంటుందని తేలింది. ఇది పూర్తిగా ఉపాధి, ఉద్యోగాలు పోవడానికి దారితీయదని, దీని ద్వారా పనుల పునరి్వభజన జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నివేదిక ప్రకారం, ఏఐ వల్ల దేశంలో భారీగా ఉద్యోగాల నష్టం జరగదు. మరింత నాణ్యమైన, సృజనాత్మకమైన పనులపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుంది.ఏఐ వల్ల లబ్ధి పొందే రంగాలు... ⇒ ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌ల బేసిక్ మోడలింగ్ పనులను ఏఐ వేగవంతం చేస్తుంది, తద్వారా వారు మరింత విలువైన విశ్లేషణలపై దృష్టి పెట్టవచ్చు ⇒ ఆరోగ్యం, విద్య... ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ , డేటా అనలిటిక్స్, నాలెడ్జ్–బేస్డ్ పనుల ద్వారా ఈ రంగాలు భారీగా లాభపడతాయి ⇒ మీడియా,ఎంటర్టైన్మెంట్... క్రియేటివ్ పనులలో ఉత్పాదకత పెరుగుతుందిఏఐ ప్రభావం లేని రంగాలు... ⇒ శారీరక శ్రమతో కూడిన రంగాలు... నిర్మాణం, వస్త్ర పరిశ్రమ, మాన్యుఫ్యాక్చరింగ్, ప్లాంట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు. ఇక్కడ ఏఐ కంటే మానవ శ్రమకే డిమాండ్ పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ⇒ కొత్త ఉద్యోగాల సృష్టి... గత సాంకేతిక విప్లవాలలాగే, ఏఐ కూడా కాలక్రమేణా సరికొత్త ఉద్యోగ విభాగాలు (ఉదాహరణకు: ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ కంప్లయన్స్ అధికారులు) సృష్టిస్తుంది. నివేదికలోని ముఖ్యాంశాలు⇒ భారత్‌లోని వ్యవసాయేతర శ్రామిక శక్తి చేసే పనులలో 9% నుండి 17% పనులను జెనరేటివ్ ఏఐ సులభంగా ఆటోమేట్ చేయగలదు⇒ 8–12% ఉద్యోగాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఏఐ ద్వారా భర్తీ అయ్యే ప్రమాదం ఉంది⇒ 42–48% ఉద్యోగాలకు ఏఐ ఒక అద్భుతమైన ఉత్పాదక సాధనంగా సహాయపడుతోంది⇒ మిగిలిన 40–50% శ్రామిక శక్తిపై ఏఐ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందిఅత్యధిక రిస్క్ ఉన్న ఉద్యోగాలు ⇒ ఆఫీసుల్లో జరిగే రొటీన్, డేటా ఎంట్రీ, అడ్మిని్రస్టేటివ్ సపోర్ట్, క్లరికల్ పనులకు అత్యధికంగా 3% రిస్క్ ఉంది ⇒ కోడింగ్, బేసిక్ కంప్లయన్స్ చెక్స్ వంటి పునరావృతమయ్యే పనుల స్థానంలో ఏఐ వచ్చే అవకాశం ఉంది ⇒ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్... బేసిక్ కస్టమర్ సర్వీస్ బాధ్యతలను ఏఐ చాట్బాట్లు భర్తీ చేయవచ్చు -
రిజిస్ట్రేషన్లు యథాతథం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎప్ప టిలాగానే జరుగుతున్నాయని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. వాస్తవంగా కూడా భూ ముల విలువల సవరణకు ముందు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే పెద్దగా మార్పు ఏమీ లేదని అర్థమవుతోంది. సవరణకు ముందు రోజుకు సగటున ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగేవో, సవరణ తర్వాత కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో భూముల విలువలు సవరించిన తర్వాతి పరిస్థితులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. విలువల సవరణ జరిగి పదిరోజులు పూర్తవుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ కార్యకలాపాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఆరా తీసింది.ఈ మేరకు నాలుగైదు రోజుల క్రితమే జిల్లా రిజిస్ట్రార్లకు సచివాలయం నుంచి సమాచారం వెళ్లింది. విలువల సవరణ అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్న దానిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా వివరాలు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కోరారు. ఈ నేపథ్యంలో విలువల సవరణ అనంతరం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్య కలాపాలు గాడిలో పడ్డాయని, సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించామని అధికారులు తెలిపారు. తగ్గేదే లేదు..!స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం జూన్ నెలలో ఇప్పటివరకు 50 వేల లావాదేవీలు జరిగాయి. అయితే ఇందులో దాదాపు 24 వేల వరకు తొలి 4 రోజుల్లోనే జరిగాయి. భూముల విలువలు పెరుగుతాయన్న కారణంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపడంతో ఆ నాలుగు రోజులు భారీగా లావాదేవీలు జరిగాయి. భూముల విలువలు సవరించిన 10 రోజుల కాలంలో మరో 26 వేల లావాదేవీలు జరగడం గమనార్హం. సెలవు రోజులను మినహాయిస్తే రోజుకు సగటున 2,700 వరకు లావాదేవీలు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ సంఖ్య గతంలో ప్రతిరోజూ జరిగే సగటు లావాదేవీలతో సమానంగా ఉందని, ఈ నేపథ్యంలో కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో పెద్దగా మార్పులేదని అర్థమవుతోంది. వ్యవసాయ భూముల విషయానికి వస్తే కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 18 వేల లావాదేవీలు జరిగాయి. అయితే మే నెలలో తొలి పదిరోజుల్లో కేవలం 13,500 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
‘నాలా’ నిబంధనతో అసలుకే మోసం!
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా వినియోగ మార్పిడి చేసినందుకు రెవిన్యూ శాఖకు ‘నాలా’ చార్జీలు చెల్లించాలనే నిబంధన ఇప్పుడు హెచ్ఎండీఏ ఆదాయానికి గండికొడుతోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టబోయే రియల్టర్లు హెచ్ఎండీఏ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే..తప్పకుండా ‘నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్)’ చార్జీలు చెల్లించాలని నిబంధన విధించడంతో వారు వెనక్కు తగ్గుతున్నారు. ఫలితంగా హెచ్ఎండీఏ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే దాదాపు రూ.100 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. సిటీబ్యూరో: కొత్త లే అవుట్స్‌కు పర్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ‘నాలా’ (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్-ఎన్‌ఏఎల్‌ఏ-కన్వర్షన్) చార్జీలు చెల్లించాలన్న నిబంధనే హెచ్ఎండీఏ కొంప ముంచింది. ఈ నిబంధన వల్లే సుమారు రూ.100 కోట్ల ఆదాయం సంస్థకు అందకుండా పోయిందని ఉద్యోగులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త లేఅవుట్‌కు అనుమతివ్వాలంటే వ్యవసాయ భూమిని నివాస వినియోగ భూమిగా మార్చడానికి ఎకరానికి 10 శాతం చార్జీ చెల్లించాలని గతంలో ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే... దీన్ని హెచ్ఎండీఏలో పక్కాగా అమలు చేయలేదు. ఈ కారణంగా ఇప్పటివరకు రెవిన్యూ శాఖకు రూ.1000 కోట్ల వరకు ఆదాయం అందకుండా పోయిందన్న విషయం తేలడంతో హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రా లోతుగా దీనిపై అధ్యయనం చేసి ఇకపై కొత్త లే అవుట్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. నాలా యాక్టు- 2006 ప్రకారం రెవెన్యూ శాఖకు ఎకరానికి 10 శాతం ‘నాలా చార్జీ’ చెల్లించి ఆర్డీఓ నుంచి ఎన్ఓసీ తీసుకువచ్చాకే కొత్త లే అవుట్స్‌కు పర్మిషన్లు ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ తాజా నిర్ణయం ఇటు ప్లానింగ్ విభాగం అధికారులకు, అటు రియల్టర్లకు మింగుడుపడడం లేదు. ఇప్పటికే 100 ఫైళ్లకు (దరఖాస్తులకు) అప్రూవల్ ఇస్తూ హెచ్ఎండీఏ డీసీ (డెవలప్మెంట్ చార్జెస్) లెటర్లు జారీ చేసింది. అయితే... దరఖాస్తుదారులు ఫీజును చెల్లించేందుకు ముందుకు రాగా నాలా చార్జి చెల్లించాల్సిందేనని మెలికపెట్టడంతో వారంతా వెనుదిరిగారు. ఇదే అదనుగా భావించి ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో ఉన్న మరో 100 ఫైళ్లను కూడా సిబ్బంది పరిష్కరించకుండా పక్కకు పడేశారు. దీంతో దాదాపు200 ఫైళ్ల వరకు పెండింగ్‌లో పడిపోయాయి. ఫలితంగా గడచిన 2 నెలల వ్యవధిలో హెచ్ఎండీఏ ఖజానాకు జమ కావాల్సిన సుమారు రూ.100 కోట్లు అందకుండా పోయాయని సిబ్బంది పేర్కొంటున్నారు. సంస్థకే నష్టం ఇప్పటివరకు పట్టించుకోని నాలా చార్జీల నిబంధనను ఇప్పుడు తెరపైకి తేవడం వల్ల హెచ్ఎండీఏకే నష్టం వాటిల్లుతోంది తప్ప ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని ప్లానింగ్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు మొదట టెక్నికల్ అప్రూవల్ ఇస్తూ, భవన నిర్మాణ సమయంలో మాత్రం నాలా చార్జీలు స్థానిక సంస్థలకు చెల్లించి ఎన్ఓసీ తెచ్చుకోవాలని సూచించేవారు. ఇప్పుడు కొత్త కమిషనర్ ఆదేశాల వల్ల రెవిన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకురాని వారికి పర్మిషన్లు నిలిపేశామంటున్నారు. కాగా రియల్టర్లు మాత్రం కోర్టు నుంచి అనుమతి తీసుకువచ్చి పర్మిషన్లు పొందుతున్నారు. మా వల్ల కాదు: రియల్టర్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం భూ వినియోగ మార్పిడి కింద తాము ఇప్పటికే చార్జీలు చెల్లించామని, మళ్లీ నాలా పేరుతో అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమని రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. అసలే రియల్ మాంద్యం, పెరిగిన ఖర్చులతో సతమతమవుతుండగా నాలా చార్జీలు మరింత భారం అవుతున్నాయని వాపోతున్నారు.


