breaking news
no future
-
‘పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇక కాలం చెల్లింది’
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు భవిష్యత్తు లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఇకనైనా మేల్కొని స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన 'బస్వరల్డ్ ఇండియా కాన్క్లేవ్ 2025'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.శిలాజ ఇంధనాల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం దేశం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ "తీవ్రమైన సమస్యల" నుండి బయటపడాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాలే మార్గమని ఆయన పేర్కొన్నారు.‘డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఇక భవిష్యత్తు లేదు. తయారీదారులు జీవ ఇంధనాలు (Bio-fuels), సీఎన్జీ (CNG), ఎల్ఎన్జీ (LNG), ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేయాలి’ అని నితిన్ గడ్కరీ అన్నారు.భవిష్యత్తు ఇంధనం 'హైడ్రోజన్'భారతదేశం ఇప్పటికే ప్రయోగాత్మకంగా 10 ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్సులను నడుపుతోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో హైడ్రోజన్ అత్యంత కీలకమైన ఇంధనంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇథనాల్ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్ల అభివృద్ధిపై పరిశ్రమ ఇప్పటికే దృష్టి సారించిందని, ప్రస్తుతం వాహనాలు E20 (20% ఇథనాల్ మిశ్రమం) ఇంధనంతో విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.ప్రజా రవాణాలో భద్రతే ముఖ్యంప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేసింది. బస్సు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం భౌతిక, వీడియో అనుమతులతో పాటు వివరాలను 'వాహన్' పోర్టల్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. తయారీదారులు కేవలం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంపైనే కాకుండా.. నాణ్యత, భద్రత,ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేయాలని ఆయన సూచించారు.ఎలక్ట్రిక్ బస్సులకు భారీ డిమాండ్రాబోయే మూడేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ సుమారు 1,50,000 యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, ప్రస్తుత తయారీ సామర్థ్యం ఏడాదికి 70,000 బస్సులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డ్ సృష్టించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ అనంతరం దేశం ఒకవైపు డిజిటల్ సేవల వైపు పరుగులు పెరుగుతోంటే ఆదిత్య దీనికి భిన్నంగా స్పందించారు. ఇ-వాలెట్స్కు భవిష్యత్తు లేదని అభిప్రాయపడ్డారు. డిజిటల్ వాలెట్ బిజినెస్ మోడల్ "లాభదాయకం" కాదని చెప్పారు. నాస్కాం ఇండియా లీడర్షిప్ ఫోరంలోమాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఈ వాలెట్ కంపెనీపై పేటిఎం పై విమర్శలు గుప్పించారు. వేలకోట్ల నష్టంలో వున్న పేటీఎం రూ. 500 బిల్లుపై రూ. 250 క్యాష్ బ్యాక ఆఫర్ ను ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. చైనా లోవిజయం సాధించిన అలీబాబాలా కంపెనీని భారతదేంలో కాపీ కొట్టడం సాధ్యంకాదన్నారు. భారతీయ రెగ్యులేటరీ అధికారుల కఠినమైన నిబంధనల నేపథ్యంలో పేటీఎం లాంటి సంస్థల విజయం సాధ్యం కాదని ఆదిత్య అభిప్రాయపడ్డారు. బ్యాంకులవద్ద కూడా డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేసిన ఆదిత్య, స్వతంత్ర వాలెట్ కంపెనీలు బ్యాంకులపై ఆధాపడాలన్నారు. నిధులకోసం మధ్యవర్తిగా బ్యాంకులపై ఆధారపడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పడం విశేషం. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకున్న పరిమితులను తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొనడంతో శుక్రవారం ఈ కంపెనీ షేరు ధర రూ. 1450 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని నమోదుచేసింది. రూ. 3.64 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధిగమించింది. కాగా మార్కెట్ క్యాప్ రీత్యా టాప్ లో టీసీఎస్ లో ఉండగా, రెండవ స్థానంలో హెచ్డీఎఫ్సీ, మూడవ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచిన సంగతి తెలిసిందే.


