breaking news
new forms
-
70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్ విమానం ఇదేనా?
ఆకాశంలో ఎగిరే విమానం ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచం ఒకటే సమాధానం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ సమాధానాన్నే మార్చేయాలనే ఓ స్టార్టప్ చేస్తున్న సాహసోపేత ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన విమానాల రూపమే గతం కావొచ్చనే చర్చా.. ఇటు విమానయాన రంగంలో మొదలైంది. ప్రపంచంలోని రెండు దిగ్గజ కంపెనీలు కూడా ఈ కొత్త ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!..దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్‌ను రెండు దిగ్గజ సంస్థలు.. బోయింగ్, ఎయిర్‌బస్ శాసిస్తూ వస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న బడా విమానాలన్నీ దాదాపుగా ఇవి రూపొందించినవే. అయితే ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ జెట్‌జీరో (JetZero) ఈ ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. సంప్రదాయ విమానాల కంటే పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో, ఇంధన వినియోగాన్ని సగానికి తగ్గిస్తామని చెబుతున్న కొత్త తరహా విమానాన్ని అభివృద్ధి చేస్తోంది.రెక్కలు–శరీరం ఒకటే..అమెరికాలోని మొహావే ఎడారిలో జెట్‌జీరో పూర్తి పరిమాణంలో ప్రదర్శన (డెమోన్స్ట్రేటర్) విమానాన్ని నిర్మిస్తోంది. సాధారణ విమానాల్లో శరీరం (ఫ్యూజలేజ్), రెక్కలు వేర్వేరుగా ఉంటాయి. కానీ జెట్‌జీరో ఆ డిజైన్‌కు పుల్‌స్టాప్ పెట్టే పని చేపట్టింది. ఆ కంపెనీ రూపొందిస్తున్న విమానంలో రెండూ కలిసిపోయి ఒకే నిర్మాణంగా ఉంటాయి. దీనినే ‘‘బ్లెండెడ్ వింగ్ బాడీ’’ (Blended Wing Body) డిజైన్ అంటారు. ఈ ఆకారం మంతా రే (Manta Ray) చేపను పోలి ఉంటుంది.50 శాతం ఇంధనం ఆదా!ప్రస్తుతం విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు ఇంధనమే. జెట్‌జీరో విమానం సాధారణ జెట్లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని సంస్థ పేర్కొంటోంది. దీని ఆకారం కారణంగా.. గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు తక్కువ నిరోధం (డ్రాగ్) ఏర్పడటం వల్ల ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. విమానం వెనుక భాగంపై ఇంజిన్లను అమర్చడం వల్ల నేలపై శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని కంపెనీ చెబుతోంది.మరింత సుఖవంతమైన జర్నీ..ఈ విమానం లోపలి నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉండే సన్నని గొట్టం ఆకారంలోని కేబిన్‌కు బదులుగా విశాలమైన, చదునైన ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీంతో.. పెద్ద కిటికీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సీట్ల అమరికను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. వంటగదులు (గ్యాలీలు), మరుగుదొడ్లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.జెట్‌జీరో అభివృద్ధి చేస్తున్న Z4 విమానం ఒకేసారి 200 నుంచి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని జెట్‌జీరో అడుగులు వేస్తోంది.నాసా పరిశోధనలకు కొనసాగింపుబ్లెండెడ్ వింగ్ బాడీ ఆలోచన కొత్తది కాదు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ఈ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు పూర్తి పరిమాణంలో వాణిజ్య విమానాన్ని నిర్మించే స్థాయికి ఏ సంస్థా రాలేదు. ‘‘కొత్త టెక్నాలజీని కనిపెట్టడం కాదు... ఇప్పటికే నిరూపితమైన సాంకేతికతను ఉపయోగించి వాణిజ్య విమానంగా మార్చడమే మా లక్ష్యం’’ అని జెట్‌జీరో సీఈఓ టామ్ ఓ'లీరీ చెబుతున్నారు.అమెరికా వైమానిక దళం అండజెట్జీరో ఆషామాషీ కంపెనీ ఏం కాదు. 2023లో అమెరికా వైమానిక దళం ఈ ప్రాజెక్టు కోసం 235 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే యునైటెడ్ ఎయిర్‌లైన్స్(United Airlines), అలస్కా ఎయిర్‌లైన్స్ (Alaska Airlines) వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా జెట్జీరోలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై విమానయాన రంగంలో ఆసక్తి మరింత పెరిగింది.2030 నాటికి..జెట్‌జీరో లక్ష్యం ప్రకారం డెమోన్స్ట్రేటర్ విమానం వచ్చే ఏడాది(2027) నాటికి తొలి పరీక్ష పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత చేపట్టే వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులు సమీకరించాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2030కల్లా వాణిజ్య విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో ఈ డిజైన్‌ను సైనిక రవాణా, గగనతల ఇంధన నింపే (Aerial Refueling) విమానాలుగా కూడా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.సవాళ్లు భారీగానే.. ఈ ప్రయాణం అంత సులభం కాదు. కొత్త డిజైన్ నిజంగానే ప్రకటించిన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేస్తుందా? భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయి? ప్రపంచ విమానయాన నియంత్రణ సంస్థల నుంచి ధ్రువీకరణ పొందడానికి సంవత్సరాల సమయం, బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ‘‘ఈ ప్రాజెక్టు ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేం. కానీ అసాధ్యమని కూడా చెప్పలేం’’ అని విమానయాన రంగపు విశ్లేషకుడు రిచర్డ్ అబౌలాఫియా అభిప్రాయపడుతున్నారు.విమానాల రూపకల్పనలో దాదాపు 70 ఏళ్లుగా పెద్దగా మార్పులు రాలేదు. జెట్‌జీరో ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో మనం ప్రయాణించే విమానాల ఆకారంతో పాటు ఇంధన వినియోగం, ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతిక, ఆర్థిక, నియంత్రణ పరమైన అనేక పరీక్షలను ఈ స్టార్టప్ విజయవంతంగా దాటాల్సి ఉంటుంది.:::వెబ్ స్పెషల్నోట్: కథనంలో చూపించిన విమానం తాలుకా ఫొటోలు ఏఐ జనరేటెడ్‌వి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా పాఠకుడికి చూపించాం.. -
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్‌తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్‌కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్‌లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్‌లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్‌తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్‌లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి. -
ఎన్ఆర్ఐ, ఓసీఐల కోసం కొత్త ఫామ్స్.. సులభమైన ఆధార్ ఎన్రోల్మెంట్
ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్‌ని పొందటానికి భారత ప్రభుత్వం కొత్త ఆధార్ నిబంధనలను తీసుకువచ్చింది. దీని కోసం UIDAI ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారు ఆధార్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐగా మీకు లేదా మీ మైనర్ పిల్లలకు ఆధార్‌ను కావాలనుకునే.. స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్‌ను ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి. ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అవసరం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఆర్ఐలు మాత్రమే కాకూండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ.. చిరునామాను డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. దీన్ని ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ / అప్డేట్ ఫామ్‌లు యూఐడీఏఐ ఇప్పుడు విదేశీ భారతీయుల కోసం ఫామ్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశం చిరునామాగా ఉన్నవారికి, చిరునామా భారతదేశం వెలుపల ఉన్న వారికి, వయసును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి ఫామ్స్ ఉన్నాయి. ఫారమ్ 1 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 3 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. భారతదేశం వెలుపల చిరునామా కలిగిన వారి కోసం ఫామ్ 2, ఫామ్ 4 ప్రత్యేకంగా పరిచయం చేసారు. ఫారమ్ 2 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 4 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నమోదు చేసుకోవాలనుంటే.. ఫామ్ 5 (చిరునామా భారతదేశంలో ఉంటే), ఫామ్ 6 (చిరునామా భారతదేశం వెలుపల ఉంటే) ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ల కోసం ఆధార్ ఫామ్‌లు నిజానికి ఇంతకుముందు భారతదేశంలోని విదేశీ పౌరులు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు కాదు. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించదని ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత, ఆధార్‌కు అర్హులైన విదేశీ భారతీయుల వర్గాలకు OCIలను యాడ్ చేశారు. వీరు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యాలెండర్ ఇయర్లో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండడం తప్పనిసరి. 18 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఫామ్ 7ని ఉపయోగించాలి. 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి ఉంటుంది. ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వారు సరైన ఇమెయిల్ అందించాలి. చెల్లుబాటు కానీ ఇమెయిల్ పేర్కొంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. UIDAI అంతర్జాతీయ నంబర్లను అనుమతివ్వదు, కాబట్టి భారతీయేతర ఫోన్ నంబర్‌ను అందించినట్లయితే మీ ఆధార్‌కు సంబంధించి SMS/టెక్స్ట్ నోటిఫికేషన్‌ను అందుకోలేరు. ఇవన్నీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ గమనించాలి. -
చరిత్రకు మూలాధారం
భాష మానవ అస్తిత్వానికి మూలం. భావ వ్యక్తీకరణకే కాదు, బుద్ధి వికాసానికీ ఆలంబనగా నిలిచేది భాష మాత్రమే. చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటుంది. భాష లిపిబద్ధమయ్యాక, ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తూ వచ్చింది. చరిత్రకు ఆధారంగా నిలుస్తున్న శాసనాలే అందుకు నిదర్శనాలు. శాసనాల చదువరులు ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నేటితరంలో అరుదైన శాసనాల చదువరి గండవరం వెంకటరత్నం. పురావస్తు సహాయక సంచాలకుడిగా శాసనాలపై పరిశోధన సాగించిన ఆయన, అత్యంత ప్రాచీనమైన లిపిని సైతం చదవగల నేర్పరి ఆయన. చరిత్రకు మూలాధారమైన శాసనాలపై ‘సిటీప్లస్’తో పలు విషయాలను ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే.. ‘సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు.. ఈ ధర్మాన్ని నిర్వర్తించగలరు’.. శాసనాల్లో లిఖితమైన తొలి పదం ఇదే. ఆనాడే ధర్మాన్ని గురించిన ప్రస్తావన శాసనాల్లో ఉంది. తెలుగునాట కనిపించే మొట్టమొదటి శాసనం క్రీస్తుశకం 200 నాటిది. బ్రహ్మీలిపిలో ఉన్న ఆ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం బౌద్ధమత ప్రచారం కోసం అశోకుడు తన దూతలను ఆంధ్ర దేశానికి పంపాడు. అశోకుడి నాటి శాసనాల ద్వారా ఈ విషయం తెలుస్తోంది. పూర్తిగా తెలుగులో రాసిన శాసనాలు మనకు క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. భాషలో, లిపిలో ప్రతి మూడు శతాబ్దాలకు మార్పు సహజం. చరిత్రకు మూలాధారాలు శాసనాలే. భారతదేశంలో అశోకుడి ముందు లిపి అంటే సింధు నాగరికత నాటి పిక్టోగ్రఫీ మాత్రమే. దీనినే పిట్టల లిపి లేదా బొమ్మల లిపిగా వ్యవహరిస్తారు. తర్వాత రాజరాజ నరేంద్రుడి తామ్రశాసనం పశ్చిమగోదావరి జిల్లా పాతగండిగూడెంలో లభించింది. దక్షిణ భారతదేశంలో దొరికిన తొలి తామ్రశాసనం ఇదే. హైదరాబాద్‌లో శాసనాలు.. శాసనాల్లో హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నగరానికి 30 కి.మీ దూరంలోని కీసరగుట్ట గుండురాతిపై పెద్ద అక్షరాలు తొలచబడి ఉన్నాయి. అది క్రీ.శ. 4వ శతాబ్దంలో పాలించిన విష్ణుకండినుల నాటిది. అక్కడ క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటివిగా గుర్తించిన బొమ్మల లిపికి సంబంధించి 400 ముద్రలు లభ్యమయ్యాయి. వాటిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మూసీ ఒడ్డున చైతన్యపురి కాలనీలో పెద్దకొండరాతిపై క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటి శిలాశాసనం బయటపడింది. తొలిసారి 1986లో ఆ శాసనాన్ని కాపీ చేయించాను. అనుభవంతోనే సాధ్యం.. శాసనాలు చదవడం అనుభవంతోనే సాధ్యం. వేద పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి వరకు సంస్కృతం చదువుకున్నాను. ఎస్వీయూలో సాహిత్య శిరోమణి, సంస్కృతంలోనే బీఈడీకి సమానమైన ‘శిక్షా శాస్త్రి’ పూర్తి చేశాను. తర్వాత కేంద్రీయ విద్యాపీఠంలో ఆచార్య కోర్సు, ఎంఏ సంస్కృతం, ఎంఏ ఆర్కియాలజీ చదువుకున్నాను. పురావస్తు శాఖలో 1985లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి శాసనాల పరిశోధన మొదలైంది. శాసనాల పరిశోధనకు నేటితరం యువత ముందుకు రావాలి. చరిత్ర పరిశోధనలపై అభిలాష పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. లేకుంటే, భవిష్యత్తులో శాసనాలు చదివేవారే కరువైపోతారు. ‘ఎపిగ్రఫీ’ పూర్తిగా భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన అంశం. ఇదివరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పనిచేసిన చెల్లప్ప ఈ అంశంలో కొంతవరకు దీని అభివృద్ధి కోసం కృషి చేశారు. తర్వాత పట్టించుకున్న వారే లేరు. తెలుగు వర్సిటీ, భాషా సాంస్కృతిక శాఖలు ముందుకొచ్చి కృషిచేస్తే, శాసనాలను చదవగలవారు తయారవుతారు. సుధాకర్ ఫొటోలు: కె. రమేష్ బాబు


