breaking news
new ambassador to US
-
పాక్స్ సిలికా... గేమ్ చేంజర్!
అమెరికా కొత్త రాయబారి సెర్గియో గార్ ఇటీవల బాధ్యతల స్వీకరణ సందర్భంగా భారత్‌కు అందజేసిన ఆహ్వానం ప్రపంచ దేశాల దృష్టినీ ఆకర్షించింది. ‘అరుదైన ఖనిజ, ఏఐ’ కూటమి ‘పాక్స్ సిలికా’లో భారత్ చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిమతం కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. దాంతో ఈ కూటమి ఒక్కసారిగా చర్చనీయంగా మారిపోయింది... అరుదైన ఖనిజాలు. ప్రస్తుతం ప్రపంచమంతా కలవరిస్తున్న అత్యంత విలువైన సంపద ఇది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు మొదలుకుని కృత్రిమ మేధ (ఏఐ)కు ప్రాణావసరాలైన పలు అత్యాధునిక పరికరాల దాకా అన్నింట్లోనూ అతి కీలక పాత్ర ఈ అరుదైన ఖనిజాలదే. దాంతో వాటిపై ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా దృష్టి సారిస్తున్నాయి. కానీ సిలికాన్, లిథియం వంటి ఈ అరుదైన ఖనిజ నిల్వలు ప్రస్తుతం చాలా తక్కువ దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో ఇవి విస్తారంగా చైనా ఖనిజ శుద్ధి కర్మాగారాలు, చైనా మార్కెట్ ఆధిపత్యం ఉన్న దేశాల్లో ఉన్నాయి. దాంతో కొంతకాలంగా ఆ దేశం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. దీనికి చెక్ చెప్పడమే లక్ష్యంగా అమెరికా ఏర్పాటు చేసిన కూటమే పాక్స్ సిలికా. ఇందులో పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక అన్నది అమెరికా చెబుతున్న అర్థం. ఇక సిలికా అన్నది సిలికాన్‌కు ముడి ఖనిజమన్నది తెలిసిందే. కంప్యూటర్ చిప్స్ మొదలుకుని ఏఐ రంగం దాకా అన్నింట్లోనూ ఇప్పుడు సిలికాన్ కు ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా కూటమికి ఆ పేరు పెట్టారు. ఈ కూటమి ఏర్పాటులో అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్ కీలక పాత్ర పోషించారు. ‘20వ శతాబ్ది మొత్తం చమురు, స్టీల్ రాజ్యం చేస్తే 21వ శతాబ్ది అంతా అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు, వాటి కీలక విడిభాగాల తయారీకి ఆయువుపట్లయిన అరుదైన ఖనిజాలదే’ అన్నది ఆయన అభిప్రాయం. ‘రానున్న ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయి’ అని హెల్బర్గ్ అన్నారు. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంతో పాటు ఆర్థికంగా భవిష్యత్తును సురక్షితం చేసుకునేందుకు ఇది తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. లక్ష్యమేమిటి? సభ్య దేశాలన్నీ కలిసి అరుదైన ఖనిజాలకు సంబంధించి ఒక ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నది పాక్స్ సిలికా ఏర్పాటు తాలూకు ఉద్దేశం. ఈ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా మొదలుకుని సాఫ్ట్వేర్ తదితర అప్లికేషన్లలో వాటి వినియోగం దాకా అన్ని స్థాయిల్లోనూ కూటమి దేశాలన్నీ సమన్వయంతో పని చేయాలన్నది అమెరికా ఆకాంక్ష. సభ్య దేశాలెవరు? పాక్స్ సిలికా కూటమి తొలి శిఖరాగ్ర భేటీ గత డిసెంబర్లో జరిగింది. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్ ఇందులో సభ్యులుగా చేరాయి. తాజాగా సోమవారం ఖతర్ ఈ కూటమి సభ్యత్వం స్వీకరించింది. అదే రోజు భారత్‌ను కూడా అమెరికా ఇందులో చేరాల్సిందిగా ఆహ్వానించింది. ‘‘సిలికా కూటమిలో భారత్ చేరాలన్నది మా ఆకాంక్ష. భారత్–అమెరికా సంబంధాల్లో ఇది మైలురాయి అవుతుంది’’ అని అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి హెల్బర్గ్ తాజాగా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. చైనాదే హవా! ఈ అరుదైన ఖనిజాల వెలికితీతలో ప్రస్తుతానికి చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఆ దేశం ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో 57 వేల టన్నుల దాకా అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకోవాల్సి వచి్చంది. అందులో 97 శాతం ఒక్క చైనా వచ్చాయి. ఈ విషయంలో చైనాపై అతిగా ఆధారపడటం భద్రతతో సహా ఏ కోణం నుంచి చూసినా మన ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే అమెరికా మితిమీరిన టారిఫ్‌లపై ఆగ్రహించి గతేడాది చైనా ఆర్నెల్ల పాటు ఈ ఖనిజాల ఎగుమతులను పూర్తిగా నిలిపేసింది. దాంతో మన దేశ ఆటోమొబైల్ తదితర పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాటరీల్లో కీలకమైన లిథియం, సిలికాన్ తదితర ఖనిజాల లభ్యత లేక పలు కార్ల తయారీ సంస్థలు అనివార్యంగా ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచి్చంది. దాంతో ఈ సమస్యకు విరుగుడుగా భారత్ యుద్ధ ప్రాతిపదికన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. పాక్స్ సిలికాను ఒకరకంగా దీనికి అంతర్జాతీయ రూపంగా భావించవచ్చు. కీలక అరుదైన ఖనిజాల విషయంలో చైనా ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా భావసారూప్య దేశాలన్నింటితో కలిసి ఈ కూటమి ఏర్పాటుకు అమెరికా నడుం బిగించింది.మనవద్ద అపార నిల్వలున్నా...! సెమీ కండక్టర్లు మొదలుకుని కంప్యూటర్ చిప్స్ దాకా అన్నింట్లోనూ అతి కీలకంగా మారిన అరుదైన ఖనిజ నిల్వలు నిజానికి భారత్‌లో అపారంగా ఉన్నట్టు తేలింది. ఏకంగా 85.2 లక్షల టన్నుల నిక్షేపాలు భారత్‌లో ఉన్నట్టు అంచనా. కానీ ఇప్పటిదాకా మనం వెలికితీయగలిగింది మాత్రం కేవలం 2,900 టన్నులే. దాంతో ఈ అరుదైన ఖనిజాల కోసం ఇతర దేశాలపై, ముఖ్యంగా ఎప్పటికీ నమ్మలేని చైనాపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారతే ముఖ్యం
న్యూఢిల్లీ: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగంలోని పలువురు సలహాదారుల నోటి దురుసు కారణంగా భారత్‌తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా గట్టిగా దృష్టి సారించింది. భారత్‌లో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ ఈ దిశగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కోణంలో చూసినా అమెరికాకు భారత్ అంతటి ముఖ్యమైన దేశం మరొకటి లేదని స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది, మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయన్నది నిజం కాదని గోర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇరు దేశాల ప్రతినిధుల నడుమ మంగళవారమే తర్వాతి దశ చర్చలు జరగనున్నట్టు వెల్లడించారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధకు సంబంధించి అమెరికా సారథ్యంలో రూపొందుతున్న వ్యూహాత్మక కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అభిలషించారు. ఈ మేరకు ట్రంప్ తరఫున భారత్‌ను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ‘‘భారత్ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దేశం. భారత్, అమెరికా నడుమ ఉన్నది కేవలం సారూప్య ప్రయోజనాలు మాత్రమే కాదు. విడదీయలేని దృఢమైన బంధం కూడా’’ అని అన్నారు. ‘‘భారత్ ఓ అద్భుత దేశం. దౌత్యాన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయ రీతిలో పునర్ నిర్వచించే సువర్ణావకాశం ప్రస్తుతం ఇరుదేశాల ముందుంది. భారత్, అమెరికా మైత్రి ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత ప్రభావశీల భాగస్వామ్యంగా రూపుదిద్దుకోగలదు’’ అని 38 ఏళ్ల గోర్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ కంటే ఆవశ్యకమైన భాగస్వామి అమెరికాకు ఇంకెవరూ లేరు. రాయబారిగా భారత్‌తో బంధం విషయంలో వచ్చే కొన్నేళ్లకు సంబంధించి ఓ భారీ ఎజెండాయే నా ముందుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం, శక్తి సామర్థ్యాలతో పాటు పరస్పర గౌరవాదరాలు, నాయకత్వ పటిమే పునాదులుగా అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య నిజమైన, దృఢమైన స్నేహముందని గోర్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత రెండు దశాబ్దాల్లోకెల్లా అత్యల్ప స్థాయికి చేరేందుకు కారణమైన విభేదాల పరిష్కారానికి వారి స్నేహబంధం కచ్చితంగా తోడ్పడుతుందని అభిప్రాయç ³డ్డారు. ‘‘నిజమైన మిత్రులు పరస్పరం విభేదించవచ్చేమో. కానీ అంతిమంగా తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారు’’ అని అమెరికా–భారత్ నడుమ బంధానికి బీటలు పడ్డట్టు గోర్ పరోక్షంగా అంగీకరించారు. ‘‘ఇరు దేశాల బంధం విషయంలో వాణిజ్యం చాలా ముఖ్యమైన అంశమే. దానితో పాటు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంధనం, టెక్నాలజీ, విద్య, వైద్యం వంటి పలు కీలక రంగాల అంశాల్లో ఇరు దేశాలూ అత్యంత సన్నిహితంగా కలిసి పని చేయనున్నాయి’’ అని గోర్ వివరించారు.బంధానికి బీటలు..ఇటీవలి కాలంలో భారత్, అమెరికా బంధం ఒడిదుడుకుల్లో పడటం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై తాను సంతోషంగా లేనని ట్రంప్ అనడం, టారిఫ్‌లను భారీగా పెంచుతానని హెచ్చరించడం, అందుకు తగ్గట్టే భారత్, చైనాలపై ఏకంగా 500 శాతం టారిఫ్‌ల విధింపుకు అమెరికా బిల్లు సిద్ధం చేస్తుండటం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొంతకాలంగా నేలచూపులు చూస్తూ వస్తున్నాయి. పైగా మోదీ స్వయంగా ట్రంప్‌కు ఫోన్ చేసి మాట్లాడని కారణంగానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. వీటికి తోడు భారతీ యులను ప్రధా నంగా లక్ష్యంగా చేసుకుని హెచ్– 1బీ వీసాలపై అమెరికా నానాటికీ ఆంక్షల చట్రాన్ని బిగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సన్నిహిత బృందంలో కీలక సభ్యుడైన గోర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ తో సంబంధాలను తిరిగి మెరుగు పరు చుకునే ప్రయత్నాల్లో అవి భాగమేనని భావిస్తున్నారు. గోర్ ప్రస్తావించిన పిక్స్ సిలికా కూటమిలో జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఇజ్రాయెల్ ఇప్పటికే చేరాయి.మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు‘‘భారత్ బయల్దేరే ముందే ట్రంప్‌తో మాట్లాడా. ఈ అద్భుత దేశం పౌరులకు, ముఖ్యంగా ప్రియ మిత్రుడు మోదీకి శుభాకాంక్షలు అందించాల్సిందిగా ఆయన నాకు చెప్పారు’’ అని గోర్ తెలిపారు. ‘‘రెండు వారాల క్రితం ట్రంప్‌తో మాట్లాడా. ఆయన భారత్ సందర్శన తాలూకు అద్భుత అనుభవాలను నాతో పంచుకున్నారు. ఒకట్రెండేళ్లలో మరోసారి భారత్‌లో పర్యటించాలని కూడా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు’’ అని వివరించారు. ‘‘రాయబారిగా మొట్టమొదటే భారత్ వంటి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద, అతిపురాతన దేశంలో పని చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన రెండు అతి గొప్ప దేశాల బాగస్వామ్యాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం’’ అని గోర్ ప్రకటించారు. -
యూఎస్‌లో పాక్ నూతన రాయబారిగా జిలానీ
అమెరికాలో పాకిస్థాన్ నూతన రాయబారిగా జలీల్ అబ్బాస్ జిలానీని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గత రాత్రి పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జలీల్ అబ్బాస్ జిలానీ పాక్ విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కావున డిసెంబర్ మాసంలో జిలానీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. గతంలో జిలానీ పాక్ రాయబారిగా బెల్జియం, లక్సింబర్గ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో పని చేశారని ఈ సందర్భంగా తెలిపింది. అలాగే 1990 -1992 మధ్య కాలంలో పాక్ ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారని వెల్లడించింది.


