breaking news
national census
-
జనగణన మనందరి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం 133వ ’మన్ కీ బాత్’కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న జాతీయ జనగణన కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. ఇది అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఇందులో భాగస్వాములు కావాలి. తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించాం. మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతాం. వివరాలు పూర్తి సురక్షితంగా ఉంటాయి’’ అని ప్రధాని హామీ ఇచ్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో తమిళనాడులోని కల్పకంలో నిర్మించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ‘క్రిటికాలిటీ’ దశను దాటడం దేశ అణు ఇంధన ప్రయాణంలో చారిత్రక మైలురాయి’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణపై స్ఫూర్తిదాయక చర్యలు జరుగుతున్నాయని ప్రధాని హర్హం వ్యక్తం చేశారు. కచ్ రాణ్ ప్రాంతంలో జరుగుతున్న ప్రకృతి పరిరక్షణ యత్నాలను ప్రత్యేకంగా అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచించే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని ‘వేవ్స్’ ఓటీటీ వేదికగా అందుబాటులోకి తెచ్చామన్నారు. -
జనగణనకు అధికారగణం సన్నాహాలు
65,522 మంది ఎన్యూమరేటర్లు.. రూ.5.97 కోట్ల ఖర్చు హైదరాబాద్: వచ్చే నెలలో చేపట్టే జాతీయ జనాభా లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గతంలో జనగణన చేపట్టిన తరహాలోనే ఇంటింటి సర్వే నిర్వహించనుంది. జాతీయ జనాభా గణనను అప్డేట్ చేయటంతోపాటు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నందున ఈ సర్వేను సమర్థవంతంగా చేపట్టాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే మార్గదర్శకాలను వివరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేయాలని, ప్రైవేటు ఉద్యోగులను తీసుకోవద్దని ఆదేశించారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15లోగా సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75,776 ఎన్యూమరేషన్ బ్లాకులను గుర్తించి ంది. మొత్తం 65,522 మంది ఎన్యూమరేటర్లను ఈ సర్వేకు వినియోగించనుంది. సర్వే నిర్వహణకు పది జిల్లాల పరిధిలో మొత్తం రూ.5.97 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. పంట కోత ప్రయోగాలు: కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రతి మండలంలో పంట కోత ప్రయోగాలను సక్రమంగా నిర్వహించాలని ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు బీపీ ఆచార్య సూచించారు. జిల్లాకు 30 ఫిల్మ్‌లు: నవంబర్ 14 నుంచి 20 వరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని బీపీ ఆచార్య కలెక్టర్లను కోరారు. ప్రతి జిల్లాకు 30 ఫిల్మ్‌లు పంపిస్తున్నామని, వీటిని జిల్లా కేంద్రంలో ఉచితం గా ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు.


