breaking news
naidu peta
-
మధుసూదన్ సార్.. మంచి పనిచేశారు!
నాయుడుపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమానప్రయాణం చేయించి హెచ్ఎం మధుసూదన్ ఆదర్శంగా నిలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్.మధుసూదన్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమాన ప్రయాణం చేయిస్తామని హెచ్ఎం ముందుగా హామీ ఇచ్చారు.దీంతో పదో తరగతిలో అన్నమేడుకు చెందిన చెంబేటి శశి (588) మార్కులు, అన్నమేటి యమున (577), కాంపాలం భవిత (568) మార్కులు సాధించారు. దీంతో ఈ ముగ్గురు విద్యార్థినులను హెచ్ఎం సోమవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ విమానంలో రేణిగుంటకు తీసుకువచ్చారు. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేలా హెచ్ఎం ఆదర్శంగా నిలవడంతో ఎంఈఓ బాణాల మునిరత్నంతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు హెచ్ఎంకు అభినందనలు తెలిపారు.చదవండి: ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను -
చంద్రబాబు నాయుడుపేట సభ అట్టర్ ఫ్లాప్
నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడు పేట సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆ సభకు భారీగా జనం తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ శ్రేణులకు చేదు అనుభవమే ఎదురైంది. సుమారు 70 శాతం కుర్చీలు ఆ సభా ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక చంద్రబాబు మాట్లాడుతుండగా టీడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీ హంగామా చేశాయి. విపరీతమైన హడావుడి మధ్య ఈ సభ ఏర్పాటు చేసినా అది చివరకు అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. -
ప్లాస్టిక్ పైపుచుట్ట పడి వ్యక్తి మతి
మినిలారీ నుంచి పైపులు దించుతుండగా చోటుచేసుకున్న ఘటన నాయుడుపేట : మినీలారీ నుంచి ప్లాస్టిక్ పైపు చుట్ట దించుతూ అది పైనపడి ఓ వ్యక్తి మతిచెందిన ఘటన పట్టణ పరిధిలోని అగ్రహారపేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. ప్లాస్టిక్ పైపులు లోడుతో ఉన్న మినీలారీని అగ్రహారపేటలోని టెక్స్మో మోటార్స్ ఏజెన్సీ యజమాని నివాసం వద్ద అన్లోడ్ చేసేందుకు తీసుకొచ్చారు. కూలీలు పైపులు దించుతుండగా సుమారు వెయ్యి కేజీల బరువు కలిగిన పైపు చుట్ట జారి గుమస్తా మన్నారు బాలాజీ (50)పై పడింది. దీంతో అతడి శరీరంలోని అవయావాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావమైయింది. వెంటనే బాధితుడిని పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మతిచెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకున్న మతుడి భార్య రాధమ్మ, కుమారులు రాజేష్, చరణ్‌లతో పాటు బంధువులు, ఏజెన్సీ నిర్వాహకులు బోరున విలపించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న బాలాజీ చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడటై్టంది. పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. -
డెంగ్యూతో వివాహిత మృతి
నాయుడుపేట: తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. రోజురోజుకు డెంగ్యూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి కారణంగా ఓ వివాహిత మృతి చెందింది. నాయుడుపేట రజక కాలనీకి చెందిన రమణమ్మకు సోమవారం ఉదయం తీవ్రంగా జ్వరం రావడంతో నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని నెల్లూరుకు తరలించారు. అక్కడ ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని చెన్నైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమెను చెన్నైకి తరలిస్తుండగా అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది.


