విద్యార్థులతో విమానం వద్ద హెచ్‌ఎం మధుసూదన్
టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను విమాన ప్రయాణం చేయించిన హెచ్‌ఎం
నాయుడుపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమానప్రయాణం చేయించి హెచ్‌ఎం మధుసూదన్ ఆదర్శంగా నిలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్.మధుసూదన్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమాన ప్రయాణం చేయిస్తామని హెచ్‌ఎం ముందుగా హామీ ఇచ్చారు.
దీంతో పదో తరగతిలో అన్నమేడుకు చెందిన చెంబేటి శశి (588) మార్కులు, అన్నమేటి యమున (577), కాంపాలం భవిత (568) మార్కులు సాధించారు. దీంతో ఈ ముగ్గురు విద్యార్థినులను హెచ్‌ఎం సోమవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ విమానంలో రేణిగుంటకు తీసుకువచ్చారు. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేలా హెచ్‌ఎం ఆదర్శంగా నిలవడంతో ఎంఈఓ బాణాల మునిరత్నంతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు హెచ్‌ఎంకు అభినందనలు తెలిపారు.
చదవండి: ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను


