breaking news
Govt school teacher
-
ఒక్క విద్యార్థి కోసం 5 కి.మీ.ల ట్రెక్కింగ్
కొల్హాపూర్: రోజూ ఉదయం ప్రభుత్వపాఠశాలలో బోధించేందుకు వెళ్లాలంటే ప్రతి టీచర్ సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొదలెడతారు. కానీ 55 ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ వసంతరావ్ మిథారీ మాత్రం రోజూ రానుపోను 5 కిలోమీటర్లు కొండప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ పాఠశాలకు వెళ్లివస్తున్నారు. దట్టమైన అడవి, ఎడతెరపి వానలు, వన్యప్రాణుల నుంచి ప్రాణహాని ఉన్నా వాటిని తట్టుకుంటూ ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు గత 13 ఏళ్లగా తన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అంకితభావంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సహ్యాద్రి పర్వతశ్రేణిలో కొల్హాపూర్ జిల్లాలోని గగన్బవాడ తాలూకాలో కొండ మీద కవాల్టెక్ ధంగర్వాడా అనే మారుమూల గ్రామం ఉంది. అక్కడ పాతికేళ్ల క్రితం దాదాపు 100 కుటుంబాలు ఉండేవి. తర్వాత జీవనోపాధి కోసం దాదాపు కుటుంబాలన్నీ కొల్హాపూర్ నగరానికి వలసవచ్చాయి. ఒకటీ రెండు కుటుంబాలే అక్కడ ఉన్నాయి. వారిలో మూడో తరగతి చదవే స్వర బొడాకే ఒక్కతే అక్కడి జిల్లాపరిషత్ స్కూల్‌కు వస్తోంది. ఈమెకు చదువు చెప్పేందుకే టీచర్ మిథారీ రోజూ 2.5 కిలోమీటర్లు పైకి ట్రెక్కింగ్చేసి స్కూల్ అయ్యాక మళ్లీ 2.5 కి.మీ.లు కిందకు దిగొస్తున్నారు. ‘‘కొల్హాపూర్ జిల్లా ప్రైమరీ స్కూల్ టీచర్స్ సహకార బ్యాంక్‌కు గతంలో చైర్మన్‌గా ఉన్నా. అప్పుడు నాలాంటి ప్రతిభావంతులైన టీచర్లకు పట్టణాల్లో పోస్టింగ్‌లు ఇచ్చి ఇతరులకు కుగ్రామాల్లో పోస్టింగ్‌లు ఇస్తారని ఒకరు నాతో అన్నారు. అది తప్పు అని నిరూపించేందుకే ఈ పాఠశాలను నేనే ఎంచుకున్నా. సాయంత్రం ఆలస్యమైతే అడవి దున్నల వంటి వన్య ప్రాణాలతో ముప్పు ఎక్కువ. అందుకే ఉదయం చాలా త్వరగా స్కూల్‌కు ఆరోజు సిలబస్ మొత్తం చెప్పి త్వరగా వెనుతిరుగుతా. స్వర చెల్లెలు అంగన్వాడీ లేకపోవడంతో ఆ పాప కూడా బడికొస్తోంది. వచ్చే ఏడాది ఆమె ఒకటో తరగతిలో చేరబోతోంది’’అని టీచర్ నవ్వుతూ చెప్పారు. కవాల్టెక్ ధంగర్వాడా గ్రామానికి విద్యుత్ సౌకర్యంలేదు. -
మధుసూదన్ సార్.. మంచి పనిచేశారు!
నాయుడుపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమానప్రయాణం చేయించి హెచ్ఎం మధుసూదన్ ఆదర్శంగా నిలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్.మధుసూదన్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమాన ప్రయాణం చేయిస్తామని హెచ్ఎం ముందుగా హామీ ఇచ్చారు.దీంతో పదో తరగతిలో అన్నమేడుకు చెందిన చెంబేటి శశి (588) మార్కులు, అన్నమేటి యమున (577), కాంపాలం భవిత (568) మార్కులు సాధించారు. దీంతో ఈ ముగ్గురు విద్యార్థినులను హెచ్ఎం సోమవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ విమానంలో రేణిగుంటకు తీసుకువచ్చారు. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేలా హెచ్ఎం ఆదర్శంగా నిలవడంతో ఎంఈఓ బాణాల మునిరత్నంతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు హెచ్ఎంకు అభినందనలు తెలిపారు.చదవండి: ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను -
ఇలాంటి టీచర్.. స్కూల్‌కి ఒక్కరుంటే చాలు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బడి ముగిశాక ఏ ఉపాధ్యాయుడైనా ఇంటికి వెళ్తారు.. కానీ ఒక ప్రధానోపాధ్యాయుడు పాఠశాల తనది.. పిల్లలను కుటుంబసభ్యుల్లా భావిస్తున్నారు. పాఠశాలలోనే ఉంటూ.. విద్యార్థుల ఇళ్లకు రోజూ వెళ్తూ.. చదువును పర్యవేక్షిస్తూ.. అనుక్షణం వారి ఉన్నతికి కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే కామారెడ్డి జిల్లా (Kamareddy District) బీబీపేట టీఎస్‌ఎన్‌ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ మూల రవీంద్రారెడ్డి. 2023 సెప్టెంబర్ 25న వరంగల్ జిల్లా (Warangal District) నుంచి బదిలీపై రవీంద్రారెడ్డి వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదే బడిలో నివసిస్తున్నారు. రెండు రోజుల సెలవులు (Holidays) వచ్చినప్పుడే.. సొంతూరు వరంగల్‌కు వెళ్తారు. స్కూళ్లో మొత్తం 610 మంది విద్యార్థులు ఉన్నారు. బడిలోనే ఉంటూ..పాఠశాల నిర్మించిన సమయంలోనే ఉపాధ్యాయుల కోసం పై అంతస్తులో గదులు నిర్మించారు. హెడ్మాస్టర్ (Head Master) రవీంద్రారెడ్డి అందులోనే ఉంటున్నారు. ఆయన రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్తారు. వారేం చదువుతున్నారో పరిశీలించి.. తల్లిదండ్రులతో మాట్లాడి వస్తారు. పిల్లలు పాఠశాలకు గైర్హాజరైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులను పిలిచి మాట్లాడతారు.విద్యార్థులను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంకార్పొరేట్ విద్యాసంస్థలో లేని సౌకర్యాలన్నీ మా పాఠశాలలో ఉన్నాయి. మంచి ఉపాధ్యాయుల బృందం ఉంది. ఆధునిక పద్ధతుల్లో బోధన సాగిస్తున్నాం. పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇంకా మెరుగవ్వాలి. విద్యార్థులను తీర్చిదిద్దడానికి మరింతగా ప్రయత్నిస్తాం. – మూల రవీంద్రారెడ్డి, హెడ్మాస్టర్, బీబీపేట, కామారెడ్డి జిల్లాచదవండి: జగిత్యాలకు ఐకాన్ ఈ ఖిల్లా -
ఏక్ నిరంజన్.. ఓ ఉపాధ్యాయుడి నిరీక్షణ
చిలుకూరు: ఆ పాఠశాలలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగినా ఎవరూ తమ పిల్లలను పాఠశాలకు పంపలేదు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొమ్మబండ తండా ప్రాథమిక పాఠశాల ప్రారంభంలో విద్యార్థులతో కళకళలాడింది. పదేళ్లుగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత విద్యాసంవత్సరం ఈ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ ముగ్గురు విద్యార్థులు కూడా ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్ బాటపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరని, ఇంగ్లిష్ మీడియంలో చెప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజూ ఉపాధ్యాయుడు రావడం.. పాఠశాల తాళాలు తీయడం.. విద్యార్థుల కోసం ఎదురుచూస్తుండటం సాధారణమైంది. గ్రామంలో మొత్తం 103 ఇళ్లు, 700 జనాభా ఉంది. ఈ గ్రామం నుంచి ఆటోలో ప్రైవేట్ పాఠశాలకు సుమారు 10మంది వరకు వెళ్తారు. మిగిలిన కొందరు విద్యార్థులు జెర్రిపోతులగూడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్ ఫోకస్.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు! -
ప్రభుత్వ పాఠశాల టీచర్ కు అరుదైన గౌరవం
-
ఆలోచనాత్మకం సర్కార్ బడి విద్యార్థుల ‘జాగో’ షార్ట్ ఫిల్మ్
కామారెడ్డి క్రైం: స్వచ్ఛత ఫిల్మోంకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు అఖిల్ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యం తెలుపుతూ ‘జాగో’ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారని జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. చిన్నారులు నటించిన ‘జాగో’ ఈ లఘు చిత్రాన్ని పోటీలకు పంపించినట్లు చెప్పారు. పరిసరాల అపరిశుభ్రంతో తన స్నేహితుడు పాఠశాలకు రాకపోవడం అనే కథాంశంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించారు. డైలాగ్‌లు లేకున్నా ఎంతో అర్థం వచ్చేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది. కేఎన్ఆర్ స్టూడియోస్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఆలోచింపజేస్తోంది. గ్రామస్తుల సహకారంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. మీరు ఈ షార్ట్‌ఫిల్మ్ చూసేందుకు క్లిక్ చేయండి చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు! -
విద్యార్థులతో టీచర్ మసాజ్...
రాయపూర్ః విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం విస్మయం కలిగించింది. ఛత్తీస్ గఢ్ జాష్ పూర్ జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థులతో బాడీ మసాజ్ చేయించుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా వ్యాపించింది. స్థానిక తుమ్లా హై స్కూల్ లో పనిచేస్తున్న అనుప్ మింజ్.. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులను మసాజ్ చేయమనడం వీడియోలో వినియోగదారులను విస్మయపరుస్తోంది. తుమ్లా హైస్కూల్లో ఇంగ్లీష్ బోధించే మింజ్ తీరుపై చిత్రించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. వీడియో చూసిన తల్లిదండ్రులు మాస్టారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి, వారిలో జ్ఞానాన్ని పెంచాల్సిన ఉపాధ్యాయుడే.. వారు చదువుకునే సమయాన్ని చాకిరీ చేయించుకోడానికి వినియోగించడంపై మండి పడుతున్నారు. అంతేకాదు విషయంపై జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. వీడియోను ప్రత్యక్షంగా చూసిన అధికారులు సైతం మాస్టారి తీరును చూసి విస్తు పోయారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అయితే ఉపాధ్యాయుడు మాత్రం తాను జ్వరం, ఒళ్ళునొప్పులతో బాధపడటం చూడలేక.. విద్యార్థులే స్వయంగా తనకు మసాజ్ చేశారని, తనంతట తాను విద్యార్థులను మసాజ్ చేయమని కోరలేదని చెప్తున్నాడు. -
ఔటర్‌పై డీసీఎం ఢీకొని మహిళ మృతి
ఔటర్ రింగు రోడ్డుపై పెద్ద అంబర్‌పేటవద్ద ఆగి ఉన్న బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మహిళ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


