breaking news
Mylavaram Dam
-
మంత్రి ఆదికి చేదు అనుభవం
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా : ఫిరాయింపు మంత్రి ఆదినారాయణకి చేదు అనుభవం ఎదురైంది. మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రిపై కందిరీగలు దాడికి పాల్పడ్డాయి. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే.. శుక్రవారం వైఎస్సార్ జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, మండలి విప్ రామసుబ్బారెడ్డి, పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ లింగారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలతో పాటు పలువురు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారు. శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో మంత్రి ఆది గేట్లు ఎత్తారు. అయితే చాలా రోజుల నుంచి గేట్లకు ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా ప్రజలపై దాడి చేశాయి. దీంతో అక్కడ ఉన్న నాయకులు, అధికారులు తలోదిక్కు పరుగు తీశారు. ఉత్తర కాలువ వైపు కొందరు, దక్షిణ కాలువ వైపు కొందరు పరుగెత్తారు. తేనెటీగల దాడిలో మైలవరం మండల తహసీల్దారు షేక్ మొహిద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మైలవరం జలాశయంలో పెనువిషాదం
-
మైలవరం జలాశయంలో మృతదేహాల కలకలం
-
మైలవరం జలాశయంలో మృతదేహాల కలకలం
కడప: వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మైలవరం జలాశయంలో ఐదు మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు. అందులో ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. అదేవిధంగా జలాశయం వద్ద 5 ఆధార్ కార్డులను కనుగొన్నారు. మరో రెండు మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన షేక్ వాహెద్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మైలవరానికి కృష్ణా జలాలు
జమ్మలమడుగు,న్యూస్‌లైన్: మైలవరం జలాశయానికి మరో రెండు రోజుల్లో రెండు టీఎంసీల కృష్ణ జలాలు రానున్నాయి. మైలవరం, పెద్దముడియం, జమ్మల మడుగు, రాజుపాళెం మండలాలకు చెందిన రైతులు పత్తి, మిరప, పొద్దుతిరుగుడు,శనగ తదితర పంటలు వేశారు. రెండు నెలల నుంచి సరైన వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. నీటి కోసం అధికారుల చుట్టూ తిరిగి.. మైలవరం జలాశయంలో ఉన్న ఒక్క టీఎంసీ నీటిని మైలవరం ఉత్తర కాలువ ద్వారా టంగుటూరు, నొస్సం బ్రాంచ్, దేవగుడిబ్రాంచ్ కాలువకు విడుదల చేయాలని రైతులు అధికారులను కోరారు. దీంతోపాటు దక్షిణ కాలువకు కూడ నీటిని విడుదల చేయిస్తే పంటలకు కాస్త ఊరట కలుగుతుందని అధికారులు చుట్టూ తిరిగారు. జలాశయంలో ఉన్న టీఎంసీ నీటిని రైతుల కోసం విడుదల చేస్తే వచ్చే వేసవిలో ప్రజలు తా గునీటి కోసం ఇబ్బందులు పడతారని భావించిన కలెక్టర్ కోన శశిధర్ రైతులకోసం రెండు టీఎంసీల కృష్ణ జలాలు విడుదల కోరు తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒత్తిడితో.. మరో వారం రోజుల్లో పంటపొలాలకు నీటిని వదలకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వెంటనే రెండు టీఎంసీల నీటిని విడుదలచేయాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇరిగేషన్ మంత్రి సుదర్శన్‌రెడ్డిని కోరారు. నీటి విడుదల ఫైల్‌పై మంత్రి సంతకం చేయించడం తోపాటు ఫైల్ తొందరగా కదిలేటట్లు చర్యలు తీసుకున్నా రు. దీంతో రెండు టీఎంసీలనీరు ఆవుకు నుంచి గాలేరు-నగరి కాలువ ద్వారా విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు మండలాల రైతులకు ఊరట.. వర్షాలు పడక పంటలు దెబ్బతింటున్న రైతులకుృకష్ణ జలాలు విడుదలైతే కాస్త ఊరట కలుగుతుంది. మైలవరం, పెద్దముడియం జమ్మలమడుగు మండలాలకు చెందిన రైతులకే కాకుండ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాళెం రైతులకు కూడ ఈ నీరు ఉపయోగకరం. నాలుగు మండలాల్లో దాదాపు 15వేలకు పైగా పంట వివిధరకాల పంటలను వేశారు. రెండుటీఎంసీలనీటిని ఆవుకు నుంచి విడుదల అయితే వెంటనే ఉత్తరకాలువతోపాటు ఉపకాలువలకు కూడ నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.