breaking news
Mumbai suburban trains
-
ఇక్కడే చిక్కాడు
నేరేడ్మెట్లో నవీద్ నివాసం 2006 సెప్టెంబర్ 29న అరెస్టు శిక్ష విధించిన మోకా కోర్టు ముంబై రైలు పేలుళ్లకు హైదరాబాద్‌తో లింకు సిటీబ్యూరో: ముంబై సబర్బన్ రైళ్లలో 2006లో చోటు చేసుకున్న వరుస పేలుళ్ల (7/11 ఎటాక్స్) కేసుతో సిటీకి లింకు ఉంది. ఈ కేసును విచారించిన అక్కడి మోకా కోర్టు 12 మందిని దోషులుగా నిర్థాంచి, శిక్ష విధించింది. ఈ నిందితుల్లో ఒకడు.. బుధవారం మరణ శిక్ష పడిన నవీద్ హుస్సేన్ పట్టుబడింది నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలోనే. 2006 సెప్టెంబర్ 29న ముంబై నుంచి వచ్చిన యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక బృందం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాయంతో అరెస్టు చేసింది. పుట్టింది దుబాయ్... పెరిగింది మిరా రోడ్.. నవీద్ హుస్సేన్ ఖాన్ రషీద్ తండ్రి హుస్సేన్ ముంబైకి చెందిన వ్యక్తి. వృత్తిరీత్యా కువైట్‌కు వెళ్లిన ఆయన అక్కడే పాకిస్థాన్‌కు చెందిన మహిళను వివాహం చేసుకున్నట్లు ఏటీఎస్ చెప్తోంది. నవీద్ కువైట్‌లోనే పుట్టినప్పటికీ తల్లి మరణానంతరం ముంబైలోని మీరా రోడ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. హుస్సేన్ ఇప్పటికీ కువైట్‌లోనే పని చేస్తున్నాడు. మీరా రోడ్‌లోని తన ఫ్లాట్‌కు సమీపంలో ఉండే ఫైజల్ షేక్ ద్వారా నవీద్ పేలుళ్ల కుట్రలో భాగస్వామిగా మారాడు. ముంబై లోకల్ రైళ్లలో పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సహకారం ఫైజల్ అందించాడు. వృత్తి రీత్యా కాల్ సెంటర్ ఉద్యోగి అయిన నవీద్ హైదరాబాద్‌కు వచ్చి కొన్నాళ్లు నివసించాడు. అమీర్‌పేట్‌లో ఉద్యోగం... 2004 నుంచి నగర శివార్లలో ఉన్న నేరేడ్మెట్లో నివాసం ఏర్పాటు చేసుకున్న నవీద్ అమీర్‌పేట్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేశాడు. ఇక్కడ ఉంటూనే ముష్కరులతో సంబంధాలు కొనసాగించడంతో పాటు ముంబై ైరె లు పేలుళ్లకు కుట్ర పన్నుతూ అక్కడ ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనూ పాల్గొన్నాడని ఏటీఎస్ నిర్థారించింది. పేలుళ్లకు వినియోగించిన ప్రెషర్ కుక్కర్ బాంబులను ఇదే కేసులో నిందితుడైన ముంబై వాసి మహ్మద్ అలీ ఇంట్లోనే తయారు చేశారు. దీనిలోనూ నవీద్ కీలక పాత్ర పోషించాడని అధికారులు తేల్చారు. కుట్రకు నాంది పడిన నాటి నుంచి పేలుళ్లు జరిగే వరకు అనేకసార్లు హైదరాబాద్ నుంచి ముంబైకి వె ళ్లి వచ్చాడని ఏటీఎస్ నిర్థారించింది. 2006 జూలై 11న వరుస పేలుళ్లలో భాగంగా బాంద్రా రైల్వే స్టేషన్‌లోని రైల్లో పేలిన బాంబును నవీదే పెట్టినట్టు తేల్చారు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబా (ఎల్ఈటీ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)తోనూ నవీద్‌కు సంబంధాలు ఉన్నాయని ఏటీఎస్ అభియోగాలు మోపింది. లేక్ షోర్ టవర్స్‌లో అరెస్టు... 2006 జూలై 11న జరిగిన ఈ పేలుళ్లకు సంబంధించి ముంబై ఏటీఎస్ అధికారులు ఆ ఏడాది సెప్టెంబర్ 28న తొలిసారిగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి విచారణలో నవీద్ పాత్ర, అప్పటి నివాసం తదితరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం టాస్క్‌ఫోర్స్ అధికారుల సాయంతో అదే నెల 29న నేరేడ్మెట్లో నవీద్ నివసిస్తున్న లేక్ షోర్ టవర్స్ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫ్లాట్‌పై దాడి చేశారు. నవీద్‌తో పాటు అతడి సహోద్యోగి తమిళనాడుకు చెందిన స్వస్తిక్ చంద్రశేఖర్, మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మిగిలిన ఇద్దరినీ వదిలేసిన ఏటీఎస్ అధికారులు నవీద్‌ను ముంబై తరలించారు. తన ఉనికి బయట పడకుండా ఉండేందుకు నవీద్ పేలుళ్ల తరవాత తన సెల్‌ఫోన్‌ను పూర్తిగా స్విచ్ఛాఫ్‌లో ఉంచినట్లు వెల్లడైంది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ముంబైలోని మోకా కోర్టు నవీద్ సహా 12 మందికి బుధవారం శిక్ష విధించింది. అతడితో సహా ఐదుగురికి ఉరిశిక్ష పడగా... మిగిలిన ఏడుగురికీ యావజ్జీవ శిక్ష పడింది. -
ముంబై సబర్బన్ రైలు చార్జీల తగ్గింపు?
రైల్వే మంత్రి హామీ ఇచ్చారన్న శివసేన, బీజేపీ ఎంపీలు న్యూఢిల్లీ: ముంబై సబర్బన్ రైళ్లలో పెరిగిన చార్జీలను తగ్గించే అంశంపై రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ, శివసేన ఎంపీలు వెల్లడించారు. రెండు పార్టీలకు చెందిన 10 మంది ఎంపీలు సోమవారం రైల్వే మంత్రి సదానందను కలిసి ముంబై సబర్బన్ రైళ్లలో పెంచిన చార్జీలను ఉపసంహరించాలని కోరారు. దీనిపై సదానంద నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య తెలిపారు. తగ్గింపుపై త్వరలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. రైల్వే బోర్డు అధికారులతో చర్చించి ఊరట కల్పించే నిర్ణయాన్ని తీసుకుంటామని సదానంద గౌడ హామీ ఇచ్చినట్లు బీజేపీకి చెందిన మరో ఎంపీ కపిల్ పాటిల్ వెల్లడించారు. సబ్ అర్బన్ రైళ్లలో భద్రతను పెంచి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా రైల్వే మంత్రి హామీ ఇచ్చినట్లు సోమయ్య తెలిపారు. చార్జీల మోతను ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారన్న తమ వాదనతో రైల్వే మంత్రి ఏకీభవించినట్లు ఎంపీలు పేర్కొన్నారు. రైలు చార్జీల పెంపు నెలవారీ పాస్‌లు తీసుకునే ముంబైకర్లకు భారంగా మారింది. మహారాష్ట్ర శాసనసభకు ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైలు చార్జీల పెంపును శివసేన, బీజేపీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇది కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే బహిరంగంగానే పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు.