breaking news
mother forces
-
వ్యభిచారం చేయిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ : బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులో ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. యాకుత్‌పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె తల్లి, బావ కలిసి బలవంతంగా వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఆమె గురువారం తెల్లవారుజామున ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకుని పారిపోయి వివిధ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటూ చివరకు పీయూసీఎల్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆశ్రయం పొందింది. బాలిక బావ అక్బర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు ఫలక్‌నూమాలో అదుపులోకి తీసుకున్నారు. -
కూతురితో వ్యభిచారం చేయిస్తున్న తల్లి!
-
కూతురితో వ్యభిచారం చేయిస్తున్న తల్లి!
కన్నతల్లే బలవంతంగా కూతురితో వ్యభిచారం చేయిస్తున్న ఘోరమైన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో బయటపడింది. యాకుత్‌పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె తల్లి, బావ కలిసి బలవంతంగా వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఆమె గురువారం తెల్లవారుజామున ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకుని పారిపోయి వివిధ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటూ చివరకు పీయూసీఎల్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆశ్రయం పొందింది. తనను చాలా కాలంగా ఫాంహౌస్‌లు, హోటళ్లకు పంపుతున్నారని, పుణె, బాంబే, గోవా.. ఇలా అనేక ప్రాంతాల్లో తనతో వ్యభిచారం చేయిస్తున్నారని ఆమె వాపోపయింది. ఇంటికి వెళ్తే చంపేస్తారని కూడా ఆమె భయపడుతోంది. రెండురోజుల క్రితం గోవా పంపగా, అక్కడి నుంచి గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో పాతబస్తీకి చేరుకుంది. ఇంటి నుంచి 5 గంటల సమయంలో పారిపోయి బయటకు రాగలిగింది. దుబాయ్ షేక్‌ల వద్దకు కూడా తనను పంపుతున్నారని ఆమె వాపోయింది. కన్నతల్లే ఇలా చేయడం అత్యంత దారుణమని పీయూసీఎల్ నాయకురాలు జయ వింధ్యాల పేర్కొన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)