breaking news
Mohenjo-Daro
-
4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్ ఎందుకంటే..
పాఠ్యపుస్తకాల్లో ఆ విగ్రహం మార్పుతో మరోసారి 4,500 ఏళ్ల నాటి మోహంజోదారో డ్యాన్సింగ్ క్వీన్ విగ్రహం తెరపైకి వచ్చింది. ఎన్సీఆర్టీ తొమ్మిదో తరగతి ఎడ్యుకేషన్ పాఠపుస్తకం 'మధురిమ'లో, మోహెంజో-దారోకు చెందిన ప్రసిద్ధ 'నాట్యకారిణి' విగ్రహం మార్పు చేయడంతోనే వివాదం చెలరేగింది. ఈ పాఠ్యపుస్తకంలో కంచు విగ్రహం మొండెంపై నీడను వేసి, ఆ విగ్రహం దుస్తులు ధరించినట్లుగా కనిపించేలా చేశారు. ఈ మార్పుపై చరిత్రకారులు, విద్యావేత్తల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత సుపరిచితమైన కళాఖండాలలో ఒకటైన ఈ విగ్రహాన్ని ఎందుకు మార్చారంటూ ప్రశ్నించారు. దీంతో పాత చిత్రాన్నే యథాతథంగా ముద్రిస్తామని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ తెలిపారు. అసలు చరిత్రకారులు, కళా ప్రేమికులు అంతలా ఆరాధించే ఆ నాట్యాకారిని విగ్రహం ఎవరిది..ఎందుకు ఇంత క్రేజ్ అంటే..ఈ నాట్యకారిణి" విగ్రహం, క్రీ.పూ. 2500 ప్రాంతంలో ప్రపంచంలోని తొలి పట్టణ సంస్కృతులలో ఒకటైన సింధు లోయ నాగరికత అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. ఈ కంచు విగ్రహాన్ని 1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మెకే, మొహెంజో-దారో (ప్రస్తుత పాకిస్తాన్) నుంచి తవ్వకాలలో వెలికితీశారు. ఆ ప్రాచీన నగరంలోని 'తొమ్మిదవ సందు'గా పిలిచే మార్గంలో ఒక సాదాసీదా ఇంటి శిథిలాలలో పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కేవలం 10.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ఆశ్చర్యకరంగా చాలా చిన్నది. అయినప్పటికీ, దాని ప్రభావం మాత్రం అసాధారణమైనది.అత్యంత ఆధునిక పద్ధతిలో..హరప్పా స్థలాల నుంచి లభించిన వేలాది టెర్రకోట విగ్రహాల వలె కాకుండా, 'నాట్యకారిణి' విగ్రహాన్ని అత్యంత అధునాతనమైన 'లాస్ట్-వ్యాక్స్ కాస్టింగ్' పద్ధతిని ఉపయోగించి కంచుతో తయారుచేశారు. ఈ పద్ధతి ఎంత ఆధునికమైనదంటే, అది నేటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ విగ్రహం తయారీలో భాగంగా, మైనంతో ఒక నమూనాను చెక్కి, దానికి బంకమట్టి పూత పూసి, ఆ మైనాన్ని కరిగించివేసి, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలో కరిగిన లోహాన్ని పోస్తారు.కట్టిపడేసే రూపకల్పన..ఇంత సున్నితంగా చెక్కబడిన కంచు వస్తువు ఉనికి, నాలుగు వేల సంవత్సరాల క్రితమే సింధు లోయ ప్రజలకు లోహశాస్త్రం, పోత, కళాత్మక రూపకల్పనలో అత్యంత అభివృద్ధి చెందిన జ్ఞానం ఉండేదని నిరూపిస్తుంది. ఇప్పటికీ ఆధునికంగా అనిపించే ఆ భంగిమ. ఆ డ్యాన్సింగ్ క్వీన్ విగ్రహంలో ప్రధాన ఆకర్షణ అంతా ఆ భంగిమలోనే ఉంది.ఆమె ఒక హారం, అనేక గాజులు ధరించి ఉంది; ఒక చేతికి 24 లేదా 25 గాజులు, మరో చేతికి కేవలం నాలుగు గాజులు ఉన్నాయి. ఆమె జుట్టును ఒక పెద్ద కొప్పులా ముడివేసి, అది ఆమె భుజంపై ఆనించి ఉంది.ఈ విగ్రహాన్ని అధ్యయనం చేసిన బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త సర్ జాన్ మార్షల్ ఇలా పేర్కొన్నారు. "ఒక యువతి, నడుముపై చేయి పెట్టి, కొంటె భంగిమలో ఉంది" అని వర్ణించారు. అంతేగాదు ఆ క్షణానికి, తనపైనా, ప్రపంచంపైనా సంపూర్ణ విశ్వాసంతో ఉన్న ఒక అమ్మాయిగా పేర్కొన్నారు.ఆమె నిజంగా "నాట్యం" చేసిందా?విచిత్రమేమిటంటే, ఆమె అసలు నర్తకి అవునా కాదా అనే విషయంపై చరిత్రకారులు ఏకీభవించలేకపోతున్నారు. ఈ సాంప్రదాయక వ్యాఖ్యానం చాలావరకు మార్షల్ వర్ణన నుంచి ఉద్భవించింది. ఆమె భంగిమ, వంగిన కాలు, నడుముపై చేయి పెట్టిన నిలకడ కదలిక వంటివి కనిపించడంతో చరిత్రకారులు దీన్ని "నాట్యకారిణి" గా పిలిచారు. అంతేగాదు ఆమె ఒక పూజారిణి లేదా పవిత్ర స్త్రీ అయి ఉండవచ్చని కొందరు వాదిస్తారు. మరికొందరు ఆమె ఒక రాణి లేదా సమాజంలోని ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తికి, సంతాన దేవతకు లేదా ఒక యోధురాలికి ప్రతీకగా నమ్ముతారు. ఆమె మెడలోని గాజులు అసాధారణంగా అసమానంగా అమరి ఉండటం, అలాగే ఆ గంభీరమైన భంగిమ తదితరాల్ని ఔను అని అంగీకరించేలా ఉండటం విశేషం. కానీ నిజంగానే ఆమె నర్తకీనేనా అనేది మిస్టరీనే..ఎందుకంటే అందుకు సంబంధించిన ఆధారాలు, నిర్థారణలు కానరాలేదు. పైగా సింధు లిపీ కూడా ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టతను ఇవ్వలేకపోయింది. దీని కథ తవ్వకంతో ముగిసిపోలేదు..ఆ విగ్రహాన్ని గుర్తించిన తర్వాత లాహోరల్లో ఉంచారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాలలో న్యూఢిల్లీలోని సంస్థలకు తరలించారు. 1947లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు, ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రదేశాల నుంచి తవ్వకాలలో లభించిన కళాఖండాల యాజమాన్యంపై వివాదాలు తలెత్తాయి. చివరికి, ప్రసిద్ధ పూజారి-రాజు శిల్పం పాకిస్తాన్ వద్దే ఉండిపోగా, నాట్యకారిణి విగ్రహం భారతదేశం వద్దే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ విగ్రహం న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో భద్రంగా ఉంది. View this post on Instagram A post shared by itihāsology | Indian History & Art (@itihasology) (చదవండి: పసుపు కొమ్ము గణపతి రహస్యం..! గురుగ్రహం దోషాలకు పరిష్కారంగా..) -
సినిమా చరిత్ర - ‘మొహెంజొ దారో’
నాగరికథ సినిమా చరిత్ర - ‘మొహెంజొ దారో’ మొహెంజొ-దారో... వేల ఏళ్ళ క్రితం విలసిల్లిన ప్రాచీన భారతీయ పట్టణం. క్రీ.పూ. 2600 ఏళ్ళ క్రితం నాటి అఖండ భారతదేశానికి అగ్రపీఠం... ప్రపంచానికి మన సంస్కృతీ మూలాల్ని సగర్వంగా చాటే ‘సింధులోయ నాగరికత’కు కేంద్రం. ఇప్పటి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉన్న ఈ నగరంలో అన్ని వేల సంవత్సరాల క్రితమే భారీ స్నానఘట్టాలు, విశాలమైన వీధులు, పద్ధతి ప్రకారం సాగిన నగర నిర్మాణం, అన్ని వేల ఏళ్ళ క్రితమే అద్భుతమైన మురుగునీటి పారుదల వసతులు.... అన్నీ ఉండేవట! 1920లలో తవ్వకాల్లో బయటపడిన ఆధారాలే అందుకు సాక్ష్యం. మరి అంత నాగరికత వెలసిన ఆ నగరమెందుకు భూస్థాపితమైపోయింది? ఉన్నట్టుండి అంత సంస్కృతి అదృశ్యమై, అస్తిపంజరాల గుట్టలే మిగిలాయంటే ఏమై ఉంటుంది? అద్భుతమైన ప్రాచీన నాగరికత విలసిల్లిన ఆ నగరం నేపథ్యంలో అందమైన కల్పిత ప్రేమకథను బ్రహ్మాండస్థాయిలో వెండితెరపై చూపిస్తే? ‘లగాన్’, ‘జోధా అక్బర్’ చిత్రాల ఫేవ్‌ు దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ఇప్పుడు ఆ పనే చేశారు. హృతిక్ రోషన్, పూజా హెగ్డేలతో ‘మొహెంజొదారో’ పేరిట 115 కోట్లతో ‘‘ఎపిక్ ఎడ్వంచర్ -రొమాన్స్ ఫిల్మ్’’ తీశారు. చరిత్రలో... ‘మొహెంజొ దారో’ ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ఒకటైన మన సింధులోయ నాగరికతలోవే హరప్పా, మొహంజొ దారో నగరాలు. ఈ నగరాల్ని క్రీ.పూ. 2500 ప్రాంతంలో కట్టారని లెక్క. నిజానికి, ఈ చారిత్రక నగరం అసలు పేరు ‘మొహెంజొ దారో’ కాదు. అప్పటి హరప్పా లిపి ఇప్పటికీ సరిగ్గా చదివి, అర్థం చెప్పి, గుట్టు విప్పలేకపోవడంతో అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. ‘మొహెంజొ దారో’ అనే పదానికి ముక్కకు ముక్కగా అర్థం - ‘మృతుల దిబ్బ’ అని! 1922లో తవ్వకాల్లో బయటపడ్డ ఈ నగర నిర్మాణ ప్రణాళిక, రహదారులు అబ్బురం. ‘పశుపతి ముద్ర’ని బట్టి ‘పశుపతి’ని దైవంగా పూజించేవారని అర్థమవుతోంది. ఇంత వైభవోపేతంగా వెలిగిన నాగరికత ఎలా విధ్వంసమైందో కారణం తెలియదు. ఆర్యుల దాడి, కరవు, జలప్రళయం- ఇలా ఎన్నో ఊహించినా, కారణం ఇంకా పజిలే. కల్పిత ప్రేమపురాణం క్రీ.పూ. 2016లో జరిగినట్లుగా తెరకెక్కిస్తున్న కాల్పనికకథ ఇది. శర్మన్ (హృతిక్ రోషన్) అనే యువ నీలిమందు రైతు మొహెంజొదారో వెళతాడు. సరికొత్త సమాజానికి మూల మవుతుందని జోస్యులు చెప్పిన చాని (పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. అప్పటికే ఆమెకి మరొకరితో పెళ్ళి నిశ్చయమైంది. నగరిపై పెత్తనం చేసే దుష్టుడితో పోరులో హీరో త్యాగం తెరపై చూడాలి. వెండితెర హిస్టారియన్ సమకాలీన హిందీసీమలో ఏళ్ళ తరబడి ఒక అంశాన్ని శోధించి, నెలల తరబడి శ్రమించి, కోట్ల ఖర్చుతో భారీ కలల్ని వెండితెరపై వడ్డించే దర్శకుడంటే గుర్తొచ్చేపేరు - ఆశుతోష్ గోవారీకర్. ఇరవయ్యేళ్ళకే నటుడైన ఆయన మూడు పదులు రాక ముందే దర్శకుడిగా మారారు. గత 23 ఏళ్ళలో తీసిన సినిమాలు ఎనిమిదే! ‘లగాన్’కు వెళ్ళినప్పుడే... బ్రిటీష్ పాలనా కాలంలో సామాన్య గ్రామీణులకూ, వారికీ మధ్య క్రికెట్ నేపథ్యంలోని పోరాటంగా ఆశుతోష్ తీసిన చిత్రం ‘లగాన్’ (2001). ఆ చిత్ర షూటింగ్‌కి లొకేషన్లు వెతుకుతూ, గుజరాత్‌లోని భుజ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడే ఆశుతోష్లో ఈ ‘మొహెంజొదారో’ ఆలోచనకి బీజం పడింది. పదహారేళ్ళ తరువాత ఆ కల నెరవేర్చుకుంటున్నారు. 3 ఏళ్ళు శ్రమించి, తెరపై ప్రాణం పోశారు. ఆశుతోష్ కాపీ కొట్టారా? చరిత్రను సరిగ్గా చూపించడం లేదన్న వివాదాలు చాలదన్నట్లు... ఈ సినిమా కథ తనదనీ, ఆశుతోష్ కాపీ కొట్టారనీ ముంబయ్‌లోని అసిస్టెంట్ డెరైక్టర్ కమ్ రైటర్ ఆకాశాదిత్య లామా రచ్చ చేశారు. బాంబే హైకోర్టుకెళ్ళారు. 1995లో ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో పనిచేస్తున్నప్పుడే ‘మొహెంజొ దారో’ స్క్రిప్ట్ రాసుకున్నాననీ, 2002లో స్క్రిప్టును ఆశుతోష్‌కు పంపితే, ‘పీరియడ్ ఫిల్మ్ తీసే ఆలోచన లేదు’ అంటూ వెనక్కి ఇచ్చేశారనీ, తీరా ఇప్పుడు ‘మొహెంజొ దారో’ తీశారనీ ఆరోపించారు. మీడియాలో సంచలనమైన ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. లామాకు లక్షన్నర జరిమానా వేసింది. లొకేషన్లో 3 వేల మంది భుజ్‌లో మండే ఎండల్లో 100 రోజులకు పైగా జరిగిన షెడ్యూల్లో పని సజావుగా జరగడానికి రోజూ 300మంది తెర వెనక కష్టపడేవారు. భారీ నగర దృశ్యాల్లో వేల కొద్దీ జనం కావాలి. స్థానిక భుజ్ వాసులకు ఆడిషన్ పెట్టి ఎంపిక చేశారు. లొకేషన్లో ఒక్కోసారి 3 వేలమంది దాకా ఉండేవారట! ‘లగాన్’ షూటింగ్ టైవ్‌ులో భుజ్‌లోని నివాసగృహాల్లోనే యూనిట్ మొత్తం బస చేసేది. ఇప్పుడు ఆ ప్రాంతం కొద్దిగా అభివృద్ధి చెందింది. ఔట్‌డోర్ జరిగినంతకాలం హృతిక్ అక్కడే మొబైల్‌జిమ్ పెట్టారు. మనకు తెలిసినవాళ్ళూ ఉన్నారు! చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, వరుణ్‌తేజ్ ‘ముకుంద’ల నాయికే.విలన్ కబీర్‌బేడీ మన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో విలనే. ‘రుద్రమదేవి’, ‘గౌతమిపుత్ర...’ల కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లాయే దీనికీ డిజైనర్. గతంలో ఆశుతోష్ ‘లగాన్, స్వదేశ్, జోధా అక్బర్’ చిత్రాలకు పనిచేసిన ఎ.ఆర్. రహమాన్ ఈ సినిమాకూ సంగీతం సమకూర్చారు. ఇండియన్ స్క్రీన్‌పై... హాలీవుడ్ యాక్షన్ తల పెకైత్తి చూడాల్సినంత భారీ నగరం నేపథ్యంలో అప్పటి కాలానికి తగ్గట్లు ఆయుధాల్లేకుండా గాలిలోకి ఎగిరి కురిపించే ముష్టిఘాతాలు, 20 అడుగుల భారీ మొసళ్ళు, క్రూరమైన పులులు, దున్నపోతులతో ఫైట్స్ ‘మొహెంజొ దారో’లో పుష్కలం. ‘టైటానిక్’, ‘ది మ్యాట్రిక్స్’, ‘ది హాబిట్’ చిత్రాల హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ గ్లెన్ బోస్వెల్ను ఏరికోరి పెట్టుకున్నారు ఆశుతోష్. 42 ఏళ్ళ హృతిక్ డూప్ లేకుండా ఫైట్స్ చేసి, గాయాల పాలయ్యారు. గ్రాఫిక్స్‌కి హాలీవుడ్ నిపుణుడు కరేన్ గౌలేకస్ వర్క చేశారు. సెన్సార్... కట్ చేయని మూడు ముద్దులు బ్రిటీషు పాలకుల కన్నా, మెఘలుల కన్నా, బౌద్ధం కన్నా, క్రీస్తు కన్నా మునుపటి కాలానికి, ఇప్పటి దాకా మనం చూడని ఇండియాకు సంబంధించిన కాలానికి చెందిన కథ అని దర్శక, నిర్మాతలు సగర్వంగా ప్రకటించారు. కాలం ఏదైనా ప్రేమ, ప్రణయం తప్పవుగా! ఈ బాక్సాఫీస్ ప్రేమకథలో ఏకంగా మూడు ముద్దు సీన్లున్నాయి. హృతిక్, పూజా హెగ్డేల మధ్య సినిమాలో ‘అధర బంధన చుంబనాలు’ (లిప్ లాక్) గురించి మీడియా కోడై కూస్తోంది. సెన్సార్ బోర్డ్ కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. రిలీజ్ రోజునే... లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో... ప్రపంచం నలుమూలల్లో గొప్ప చిత్రాలను గుర్తించేది ‘లోకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’. ఎటా జరిగే ఈ ఫెస్టివల్లో ఈసారి ముగింపు చిత్రం ‘మొహెంజొ దారో’. వివిధదేశాల నుంచి 8 వేలమంది హాజరయ్యే ఈ 69వ ఫెస్టివల్లో ఆరుబైట ప్రపంచ భారీ తెరల్లో ఒకదానిపై ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రదర్శిస్తున్నారు. గతంలో ‘లగాన్’ని ఇక్కడే వేశారు. పదిహేనేళ్ళ తర్వాత మరోసారి ఆ అనుభూతి ఆశుతోష్కి దక్కుతోంది. -
హృతిక్‌తో జతకట్టనున్న సోనాక్షి


