breaking news
mogali kuduru
-
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం
తూర్పుగోదావరి జిల్లా : మామిడికుదురు (మం) మొగలికుదురులో దారుణం చోటుచేసుకుంది. మొగలికుదురు గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికపై పొదలాడ గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్ (21) మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. మైనర్ బాలిక తల్లి తాగే టీలో మత్తు బిళ్ళలు కలిపి ఆమె నిద్రపోయిన తర్వాత బాలికపై అత్యాచారం చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
హంపీ గాయత్రీ పీఠాధిపతి కన్నుమూత
మామిడికుదురు: కర్ణాటకలో హంపీ ముదునూరు గాయత్రీ పీఠానికి చెందిన పీఠాధిపతి, దేవాంగుల కులగురువు కారుపర్తి వెంకటనాగలింగమూర్తి (92) బుధవారం సాయంత్రం పరమపదించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగిలికుదురు గ్రామంలో ఉన్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం ఆయన దేవాంగుల కుల గురువుగా వ్యవహరిస్తున్నారు. అలాగే హంపీ ముదునూరు గాయత్రీ పీఠాధిపతిగా కూడా ఉన్నారు. రాష్ట్రం నలుమూలలా ఆయనకు పెద్ద సంఖ్యలో శిష్యులు ఉన్నారు.