ముంబయి వీధుల్లో అడుక్కుంటోన్న నటి.. అసలేమైంది?
సినీ రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగంలో క్రేజ్‌తో కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది. అయితే ఈ రంగం అందరికీ కలిసిరావడం అనేది చాలా తక్కువే. కొందరు తక్కువ టైమ్‌లో స్టార్‌గా ఎదిగితే.. మరికొందరికీ కొన్ని ఏళ్లు పడుతుంది. కానీ సినిమా వాళ్ల లైఫ్ కూడా పూలపాన్పు అనుకుంటే పొరపాటే అవుతుంది. సినిమా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కనుమరుగైన వారు కూడా ఉన్నారు. మరికొందరేతే దారుణ పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ముంబయిలో జరిగింది.ప్రముఖ భోజ్‌పురి నటి మితాలీ శర్మ.. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. నటిగా ఎదిగింది. కట్ చేస్తే.. ఆమె ప్రస్తుతం ముంబయి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో చేసేదేమి లేక జీవన పోరాటం మొదలెట్టింది. ముంబయిలోని లోఖండ్వాలా వీధుల్లో అత్యంత దీనస్థితిలో భిక్షాటన చేస్తూ మిథాలీ కనిపించింది.ఒకప్పుడు తెరపై మెప్పించిన నటిని వీధిలో అలాంటి స్థితిలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మితాలీకి తన కుటుంబంతో సంబంధాలు క్రమంగా తెగిపోయాయి. పనిలేకపోవడం, మరోవైపు కుటుంబ మద్దతు లేకపోవడంతో ఆమె ఒంటరితనానికి గురైంది. నిరంతర వైఫల్యాలు, తిరస్కరణలు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. అత్యంత దీనస్థితిలో ఉన్న మితాలీని గుర్తించిన పోలీసులు ఆమెను సంరక్షించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తర్వాత మిథాలీకి ఆహారం అందించారు. ఆమెకు వెంటనే అవసరమైన వైద్య చికిత్స అందించారు. ఆమె మానసిక పరిస్థితి క్షీణించండ వల్ల.. ప్రస్తుతం ఆమెను ఒక మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిథాలీ చూస్తుంటే చిత్ర పరిశ్రమలో నటీనటుల పరిస్థితికి అద్దం పడుతోంది. గ్లామర్ ప్రపంచం అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు.. వెండితెర వెనక జీవితం కూడా చూడాలని అంటున్నారు. This is Bhojpuri actress Mitali Sharma.Now, she was found begging on the streets of Mumbai. She asked the police for food and was later admitted to a mental healthcare centre.Mitali had reportedly left her home and moved to Mumbai to follow her dream of becoming an actress.… pic.twitter.com/ZPkyVAfiEk— Nalini Unagar (@NalinisKitchen) May 31, 2026