mirchi farmers protest
-
మిర్చి రైతుల ఆందోళన!
-
గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
రోడ్డెక్కిన మిర్చి రైతులు
సాక్షి, ప్రతినిధి గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుతో కడుపు మండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. ‘తేజ’ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి చస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరీ ఇంత దారుణమా?గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం ఉదయం తేజ రకం మిర్చి క్వింటా ధర కేవలం రూ.8 వేలు పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం 9.30 ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు మెయిన్ గేట్ ఎదుట ఉన్న మెయిన్ రోడ్డుపైకి చేరుకొని ధర్నాకు దిగారు. మరీ ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మిర్చి యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి.. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం.. రైతుల వద్దకు వచ్చారు. ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిందని.. అంతకన్నా తగ్గితే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని భార్గవ తేజ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించాక.. ధరలు మరింత పతనం.. జేసీతో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది తేజతో పాటు మిగిలిన రకాలకు క్వింటా ధర రూ.23 వేలు నుంచి రూ.27 వేల వరకు పలికిందని చెప్పారు. తాలు కాయలకు కూడా రూ.15 వేలు నుంచి రూ.18 వేలు వరకు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించకముందు.. తేజ రకం రూ.13 వేలు నుంచి 15 వేలు వరకు పలికిందని తెలిపారు. ప్రభుత్వం ధర ప్రకటించాక.. నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు మండిపడ్డారు. ఉదయం క్వింటా ధర రూ.9 వేలు పలికిందని చెబుతున్నారని.. మరో గంట తర్వాత రూ.8 వేలేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు 2 శాతం బదులు.. 6 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కూలీలకు డబ్బులెలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. జేసీ భార్గవ తేజ స్పందిస్తూ.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.. యార్డు నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరోసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి ఇక్కడే చస్తామని హెచ్చరించారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కూలీలకు ఇచ్చేందుకూ సరిపోవు..నాలుగు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గతేడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల వరకు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా. ఇప్పుడు గుంటూరు యార్డుకు తేజ రకం మిర్చి 20 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలుకు అడుగుతున్నారు. ఈ డబ్బులు కూలీలకు కూడా సరిపోవు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లాధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు..గత 15 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నా. ఈసారి రెండు ఎకరాల్లో తేజ రకం వేశా. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశా. తెగుళ్ల వల్ల దిగుబడి 15 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు యార్డుకు 40 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలకే అడుగుతున్నారు. మిర్చి ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. మా ఇంటిల్లిపాది నెలలు పాటు సేద్యం చేసినా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాగైతే సాగు చేయలేం. – గొల్ల చిరంజీవి, పరమాదొడ్డి గ్రామం, కర్నూలు జిల్లా -
ఎకరానికి రూ.70వేలు నష్టపరిహారం ఇవ్వాలి మిర్చి రైతులు
-
‘ఐపీ’ పెట్టిన వ్యాపారి ఇంటి ఎదుట రైతుల వంటావార్పు
తల్లాడ ఖమ్మం : ఐపీ పెట్టి, తమ నోట్లో మన్ను కొట్టాడంటూ మిర్చి వ్యాపారి జలంధర్ ఇంటి ఎదుట బాధిత రైతులు ఆందోళనకు దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. తల్లాడకు చెందిన జలంధర్, 114 మంది రైతుల నుంచి మిర్చిని కొన్నాడు. వారికి దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సుంది. డబ్బు చెల్లించేందుకు వాయిదాలు పెట్టాడు. నెలలతరబడి ఆ రైతులు తన చుట్టూ తిప్పించుకున్నాడు. చివరికి, రెండున్నరకోట్ల రూపాయలకు కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న డిమాండుతో బాధిత రైతు లంతా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ వ్యాపారి ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు. వర్షం వస్తున్నప్పటికీ లెక్కచేయలేదు. రైతు సం«ఘం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, సూరంపల్లి గోపాల్‌రావు, నల్లమోతు మోహన్‌రావు, ఐనాల రామలింగేశ్వర్రావు, తమ్మిశెట్టి శ్రీను పాల్గొన్నారు. బాధిత రైతు తల్లి హఠాన్మరణం తల్లాడ : మిర్చి వ్యాపారి జలంధర్ బాధితుడైన ఓ రైతు తల్లి, సోమవారం గుండెపోటుతో మృతిచెందింది. మిర్చి రైతు గొడుగునూరి లక్ష్మీరెడ్డి తల్లి వెంకట్రావమ్మ(65), తన కుమారుడికి జరిగిన మోసాని తల్చుకుని కొన్నాళ్లుగా కుమిలిపోతోంది. ఇతడికి ఆ వ్యాపారి దాదాపుగా నాలుగులక్షల రూపాయలు ఇవ్వాల్సుంది. ఆ వ్యాపారి ఐపీ పెట్టాడన్న వార్త విన్నప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో బాధపడుతోంది. సోమవారం తెల్లవారుజామున గుండె పోటుతో తన ఇంటిలోనే కన్నుమూసింది. మృతదేహాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. -
గుంటూరు మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన
గుంటూరు: గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో కొనుగోలుదారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేయడంతో మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. వేలాది మంది రైతులు రోడ్డెక్కి రాస్తారోకోకు దిగారు. కొంతకాలంగా అధిక దిగుబడులతో మిర్చియార్డు కిక్కిరిసిపోతుండగా.. కొనుగోళ్లు మాత్రం మందగించి ధరలు పడిపోయాయి. క్వింటారు ధర రూ. 4 నుంచి రూ.5 వేలు వరకూ మాత్రమే పలికేది. ఈ ధరతో తమకు కూలీరేట్లు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ధరలో ప్రస్తుతం సగం కూడా లేకపోవడం రైతుల ఆందోళనకు కారణమైంది. రైతుల రాస్తారోకోతో యార్డ్ రహదారితో పాటు జాతీయ రహదారిపైనా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.