గుంటూరు మార్కెట్‌ యార్డులో రైతుల ఆందోళన | mirchi farmers protest at guntur mirchi yard | Sakshi
Sakshi News home page

గుంటూరు మార్కెట్‌ యార్డులో రైతుల ఆందోళన

Mar 7 2017 10:42 AM | Updated on Oct 9 2018 2:17 PM

గుంటూరు మిర్చి మార్కెట్‌ యార్డులో కొనుగోలుదారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేయడంతో మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు.

గుంటూరు: గుంటూరు మిర్చి మార్కెట్‌ యార్డులో కొనుగోలుదారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేయడంతో మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. వేలాది మంది రైతులు రోడ్డెక్కి రాస్తారోకోకు దిగారు. కొంతకాలంగా అధిక దిగుబడులతో మిర్చియార్డు కిక్కిరిసిపోతుండగా.. కొనుగోళ్లు మాత్రం మందగించి ధరలు పడిపోయాయి. క్వింటారు ధర రూ. 4 నుంచి రూ.5 వేలు వరకూ మాత్రమే పలికేది.
 
ఈ ధరతో తమకు కూలీరేట్లు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ధరలో ప్రస్తుతం సగం కూడా లేకపోవడం రైతుల ఆందోళనకు కారణమైంది.  రైతుల రాస్తారోకోతో యార్డ్‌ రహదారితో పాటు జాతీయ రహదారిపైనా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement