breaking news
Microsoft chief
-
సత్య నాదెళ్లకు ఒబామా సత్కారం
త్వరలో ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ అవార్డు ప్రదానం వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ అవార్డుతో సత్కరించనున్నారు. కంపెనీలో మార్పు తీసుకురావడం, ఉద్యోగులకు ఉపయుక్తమైన పలు చర్యలను చేపట్టడం, ఉద్యోగులందరికీ సమాన వేతన చెల్లింపు, ఉద్యోగుల మధ్య వివక్ష లేకుండా అందరికీ సమాన గుర్తింపు ఇవ్వటం వంటి తదితర అంశాలకు కృషిచేసిన వారికి ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ అవార్డును ప్రదానం చేస్తారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరిన సత్య నాదెళ్ల గతేడాది కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగారు. ఆయన మంగళూరు యూనివ ర్సిటీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీని, విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీని, షికాగో యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేశారు. -
సత్య నాదెళ్ల జీతం.. రూ. 525 కోట్లు!
న్యూయార్క్: అమెరికాలో అత్యధిక వేతన ప్యాకేజ్ తీసుకుంటున్న సీఈఓలలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన వార్షిక జీతం ప్రసుత్తం 84.3 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు). ద ఈక్విలర్ సర్వే ప్రకారం.. భారీ వేతనాలు తీసుకుంటున్న 100 అమెరికా కంపెనీల సీఈఓల జాబితాలో సత్య టాప్ ర్యాంక్‌లో నిలిచారు. గతేడాది అగ్రస్థానంలో ఉన్న ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్ ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచారు. టాప్-10 జాబితాలో రాబర్ట్ ఇగర్(వాల్ట్ డిస్నీ), లారీ మెర్లో(సీవీఎస్ హెల్త్), రూపెర్ట్ ముర్దోక్ (21 సెంచరీ ఫాక్స్), జేమ్స్ మెక్నార్నీ(బోయింగ్), జేమ్స్ గోర్మన్(మో ర్గాన్ స్టాన్లీ), డేవిడ్ కోట్ (హనీవెల్ ఇంటర్నేషనల్), కెన్నెత్ కెనౌల్ట్(అమెరికన్ ఎక్స్‌ప్రెస్)లు ఉన్నారు. సీఈఓ ర్యాంక్ వేతన ప్యాకేజ్ (మిలియన్ డాలర్లు) సత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) 1 84.3 ఎల్లిసన్(ఒరాకిల్ ) 2 67.3 స్టీవెన్ మెల్లెన్కోఫ్(క్వాల్కామ్) 3 60.7 ఇంద్ర నూయి(పెప్సికో) 19 19.08 వారెన్ బఫెట్( బెర్క్‌షైర్ హాత్వే) 100 4.64