breaking news
mental distress
-
కుటుంబం ఆత్మాహుతికి యత్నం
హుస్నాబాద్ రూరల్: తండ్రి పెడుతున్న మానసిక క్షోభతో ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన హుస్నాబాద్ మండలం కిషన్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. జాగిరి సాయి దంపతులు కిషన్‌నగర్‌లో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా సాయి దగ్గరే ఉంటున్నారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకొని హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. తమ తండ్రి తమకు తెలియకుండానే ఇంటి స్థలం మరొకరికి విక్రయించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నాడు. తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందారు. హోటల్‌పై పెట్రోల్ పోసి నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉండి నిప్పు పెట్టుకున్నారు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి వారిని కాపాడారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగి్నమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. దీనిపై ఎస్సై మహేశ్‌ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. -
సారొస్తే మటన్ బిర్యానీ తినిపించాల్సిందే..!
నారాయణపేట: సెర్ప్ మహిళా ఉద్యోగులు అడిషనల్ డీఆర్డీఓ అంటేనే హడలెత్తిపోతున్నారు. లైంగికంగా వేధిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నారాయణపేట జిల్లా అడిషనల్ డీఆర్డీఓపై చట్ట, శాఖాపరమైన చర్యలు చేపట్టాలని బుధవారం సెర్ప్ ఉద్యోగులు డీఆర్డీఓ మొగులప్పకు విన్నవించడంతో జిల్లా అంతటా చర్చానీయాంశంగా మారింది. జిల్లాలో సెర్ప్ సంస్థకు, సిబ్బందికి చెడ్డపేరు తెస్తూ సంస్థ పరువు తీస్తున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వామ్మో ఇంత మాట అన్నాడా..సెర్ప్ ఉద్యోగుల గ్రీవెన్స్ సరిచేయుటకు సీఈఓ సెర్ప్ సైట్లో తప్పులుగా ఉన్న ఉద్యోగుల సమా చారాన్ని సరిచేయుటకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటుచేసి అట్టి తప్పులను ఒరిజినల్ సర్టిఫికెట్స్ తనిఖీ చేసి మార్చి15 నాటికి కలెక్టర్ అప్రూవల్ తీసుకొని సెర్ప్ పంపాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫైల్‌ను సంబంధిత అధికారులు మార్చి 29వ తేదీ మధ్యాహ్నం అడిషనల్ డీఆర్డీఓ దగ్గరకు తీసుకుపోగా( మూడు రోజులు వరుస సెలవులు రావడంతో) వారిని అసభ్య పదజాలంతో దూషించడంతో డీఆర్డీఓ ముందు డీపీఎంలు చెప్పారు. సదరు అధికారి వామ్మో అంత మాట అన్నాడా అంటూ ఆరా తీశారు. అందుకు అవమానంగా భావించిన సంబంధిత అధికారులు ఏమి మాట్లాడలేక వెనుదిరిగినట్లు వివరించారు. ఇలాంటి మాట్లాడరాదు.. కానీ ఇలా మాట్లాడితే చర్యలు తప్పవని డీఆర్డీఓ చెప్పుకొచ్చారు.నారాయణపేట జిల్లాకు రాకముందు..అడిషనల్ డీఆర్డీఓ నారాయణపేట జిల్లాకు రాకముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేశారు. ఆ సమయంలో జిల్లాలోని మహిళా ఉద్యోగులను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అక్కడి ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి వ్యక్తి సెర్ప్ సంస్థలోనే ఉండకూడదని విధుల నుంచి తొలగిద్దామని నిర్ణయం తీసుకోగా, భార్యాబిడ్డలను అడ్డు పెట్టుకొని ఒకటిన్నర సంవత్సరం పాటు సస్పెన్షన్‌లో ఉన్నాడు. తర్వాత నారాయణ పేట జిల్లాకి బదిలీ అయ్యాడు. ఇక్కడ కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నాడు.దినదిన గండంగా..జిల్లాలోని స్వశక్తి మహిళలు, మహిళా ఉద్యోగులు మానసికంగా ఇబ్బందులకు గురవుతూ దినదిన గండంగా కాలం వెల్లదీస్తున్నారు. సార్ మండలా నికి వస్తే చికెన్, మటన్ బిర్యానీ తినిపించాల్సిందే. లేదంటే వేధింపులు తప్పవు. సారూ టార్చర్ తట్టుకోలేక ఓ ఉద్యోగి సైతం అనారోగ్యంతో మానసిక క్షోభతో చనిపోయాడు. జిల్లాకు వచ్చిననాటి నుంచి వెహికిల్ వాడకుండా డీపీఎంల వెహి కల్ వాడుతూ అక్రమంగా నెలకు రూ.33 వేలు డబ్బులు కాజేస్తున్నట్లు పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉద్యోగుల్ని లైంగికం గా, మానసికంగా వేధిస్తున్న అతడిపై చట్టరీత్యాచర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు వేడు కుంటున్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని క్యాడర్ల ఉద్యోగులు, డీపీఎంఈలు మాసన్న, ఆనందం, జయన్నలతో పాటు జాక్ నాయకులు నారాయణ, ఎల్1, ఎల్2 యూనియన్ నాయకులు సందప్ప, గంగాధర్, సుమతి, శ్రీనివాస్ తోపాటుగా ఇతర సిబ్బంది హాజరయ్యారు. -
లైంగిక సుఖానికి దూరమయ్యా... రూ.10,006 కోట్లివ్వండి
రత్లాం: గ్యాంగ్ రేప్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన ఓ వ్యక్తి తనకు ప్రభుత్వం నష్ట పరిహారంగా రూ.10,006.2 కోట్ల చెల్లించాల్సిందేనంటూ కోర్టుకెక్కాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గిరిజనుడైన కాంతూ ఆలియాస్ కాంతీలాల్ భీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో 2020 డిసెంబర్ 23న పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు. స్థానిక కోర్టు 2022 అక్టోబర్ 20న అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతరం కాంతీలాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లో ఉన్నప్పుడు భార్యతో లైంగిక సుఖానికి దూరమయ్యానని, దేవుడిచ్చిన వరం వృథా అయ్యిందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రూ.10,006.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో రూ.10,000 కోట్లు మానసిక క్షోభ అనుభవించినందుకు మిగతా రూ.6.02 కోట్ల ఇతర ఖర్చుల కోసమని విన్నవించాడు. -
మానసిక ఒత్తిడిలో కశ్మీర్!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. కశ్మీర్ వయోజనుల్లో సుమారు సగం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్(ఎమ్ఎస్ఎఫ్) నిర్వహించిన ఈ సర్వేలో అక్కడ ప్రతి ఇద్దరు వయోజనుల్లో ఒకరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని తేలింది. రోజు వందలాది మంది ప్రజలు మానసిక సమస్యలతో కశ్మీర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కశ్మీర్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్తో కలిసి ఎమ్ఎస్ఎఫ్ నిర్వహించిన ఈ సర్వే నివేదికలో వెల్లడించారు. 1.8 మిలియన్ల కశ్మీర్ వయోజనులు మానసిక ఒత్తిడిలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని ఘర్షణ పూరితమైన వాతావరణం వీరిలో మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా తెలిపారు. యువతలో సైతం జ్ఞాపక శక్తిని కోల్పోవటం, తలనొప్పి, ఒంటరిగా ఉండాలనే కోరిక లాంటి లక్షణాలు మానసిక ఒత్తిడి మూలంగా కలుగుతున్నాయని సైకియాట్రిస్ట్ అర్షిద్ హుస్సేన్ తెలిపారు.