కుటుంబం ఆత్మాహుతికి యత్నం | family Suicide attempt in hyderabad | Sakshi
Sakshi News home page

కుటుంబం ఆత్మాహుతికి యత్నం

Jun 24 2025 7:58 AM | Updated on Jun 24 2025 7:58 AM

family Suicide attempt in hyderabad

తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని 

హోటల్‌కు నిప్పుపెట్టుకున్న వైనం 

హుస్నాబాద్‌ రూరల్‌: తండ్రి పెడుతున్న మానసిక క్షోభతో ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన హుస్నాబాద్‌ మండలం కిషన్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. జాగిరి సాయి దంపతులు కిషన్‌నగర్‌లో హోటల్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా సాయి దగ్గరే ఉంటున్నారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకొని హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. 

అప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. తమ తండ్రి తమకు తెలియకుండానే ఇంటి స్థలం మరొకరికి విక్రయించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నాడు. తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందారు. 

హోటల్‌పై పెట్రోల్‌ పోసి నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉండి నిప్పు పెట్టుకున్నారు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి వారిని కాపాడారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగి్నమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. దీనిపై ఎస్సై మహేశ్‌ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement