Masterstroke
-
రష్యా మాస్టర్ ప్లాన్.. ఇదే అదను!
పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం మండిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రిఫైనరీలు, ఆయిల్ స్టోరేజ్ డిపోలు ధ్వంసమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు తీవ్రంగా తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటింది.. కొన్ని సమయాల్లో 119 డాలర్ల వరకు చేరింది.ఈ సంక్షోభానికి సద్వినియోగం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. "ఇదే అదను! చమురు ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలో మన సరఫరాలను సద్వినియోగం చేసుకోవాలి!" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులకు స్పష్టం చేశారు. రష్యా ఇప్పటికే యూరప్‌కు సరఫరా చేస్తున్న గ్యాస్‌ను తగ్గించి.. లేదా పూర్తిగా ఆపేసి.. ఆ సరఫరాలను ఇతర మార్కెట్లకు (ఆసియా దేశాలు, భారత్ వంటివి) మళ్లించాలని సూచించారు."మనం ఇప్పుడే ఎక్కువ సరఫరాలు అవసరమయ్యే మార్కెట్లకు మా దృష్టిని మళ్లిస్తే.. అక్కడ అడుగు పెట్టవచ్చు" అని పుతిన్ చెప్పారు. యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై ఆంక్షలు విధించాలని, 2027 నాటికి పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడే ఆ సరఫరాలను ఆపి.. ధరలు ఎక్కువగా ఇచ్చే కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకోవచ్చనేది ఆయన వ్యూహం.రష్యా ఆయిల్ (ఉరల్స్ క్రూడ్) ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో 40 డాలర్లకి పడిపోయిన ధర.. ఇప్పుడు 60 డాలర్లు పైగా ఉంది. కొన్ని మార్కెట్లలో బ్రెంట్ కంటే కూడా ప్రీమియంతో అమ్ముడవుతోంది! ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎల్ఎన్జీ ఉత్పత్తి పునరుద్ధరణకు నెలల తరబడి సమయం పడుతుందని పుతిన్ చెప్పారు. దీంతో రష్యా ఎనర్జీ ఎగుమతుల నుంచి భారీ ఆదాయం వస్తుంది.. అది ఉక్రెయిన్ యుద్ధ ఖర్చులకు కూడా సహాయపడుతుంది.ఈ 'మాస్టర్ ప్లాన్'తో రష్యా ఆర్థికంగా బలపడుతుందా.. లేక యూరప్ ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.Putin says Russia should take advantage of the sky-high oil prices after US-Israeli attacks on Iran.Russia should redirect supplies to Europe elsewhere, he adds. “If we shift our focus right now to the markets that need more supplies, we might get a foothold there.” pic.twitter.com/FZAHksP2p6— max seddon (@maxseddon) March 9, 2026 -
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
దావూద్‌కు మోదీ మాస్టర్ స్ట్రోక్!!
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వలర్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను యూఏఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలపై అధికార బీజేపీ స్పందించింది. యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో దావూద్‌కు చెందిన రూ. 15వేల కోట్ల ఆస్తులు సీజ్ చేయడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద దౌత్య విజయమని, ఇది ప్రధాని నరేంద్రమోదీ మాస్టర్ స్ట్రోక్ అని అభివర్ణించింది. భారత ప్రభుత్వం పంపిన దౌత్య పత్రాల వల్లే దావూద్‌కు వ్యతిరేకంగా ఈ చర్యలు తీసుకున్నట్టు బీజేపీ అధికార పేజీ ట్వీట్ చేసింది. ‘ప్రధాని మోదీ గొప్ప దౌత్య విజయం. యూఏఈలో భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులు సీజ్ చేశారు’ అని బీజేపీ పేర్కొంది. ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్‌కు వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద అణచివేత చర్య ఇదేని పేర్కొంది. 2015లో తన యూఏఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. దావూద్ ఆస్తుల చిట్టాను ఆ దేశ ప్రభుత్వానికి అందజేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపింది. ఈ దౌత్యపత్రాల ఆధారంగా విచారణ జరిపిన యూఏఈ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తన ఫొటో కామెంట్లో వివరించింది. 59 ఏళ్ల దావూద్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరుమోసిన దావూద్ యూఏఈలో ఆస్తులు సీజ్ చేయడం అతిపెద్ద చర్యగా భావిస్తున్నప్పటికీ, ఈ కథనాలను భారత నిఘావర్గాలు ఇంకా ధ్రువీకరించడం లేదు. Major diplomatic success of PM Modi: One of India's most wanted criminals, Dawood Ibrahim's properties worth Rs. 15,000 crore seized in UAE. pic.twitter.com/MMERwLoPO1 — BJP (@BJP4India) January 4, 2017


