breaking news
Massive corruption
-
చిన్న గుడ్లు.. దండిగా దుడ్లు!
బయట మార్కెట్లో దొరికే కోడిగుడ్డు బరువు సగటున 70 నుంచి 80 గ్రాములు. అదే అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే కోడిగుడ్ల బరువు 35 నుంచి 40 గ్రాముల లోపే! అంటే బయట గుడ్డుతో పోలిస్తే సగం కూడా లేదు. రాష్ట్రంలో అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న టీడీపీ నేతలు, అనుచరగణం నాసిరకం గుడ్లను అంటగ డుతూ రూ.వంద కోట్లకుపైగా అవినీతికి తెర తీశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పోషకాహారానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో గుడ్ల నమూనాలను సేకరించి బరువు, నాణ్యతా తనిఖీలు చేపట్టాలని లబి్ధదారులు డిమాండ్ చేస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 1,626 అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 21,69,225 గుడ్లు సరఫరా అవుతున్నాయి. అవి కేవలం 3540 గ్రాములు మాత్రమే ఉంటున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు.⇒ శ్రీసత్యసాయి జిల్లాలో 2,824 అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 21.50 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. అక్కడ కూడా ఒక్కొక్కటి 3540 గ్రాములు లోపే ఉంటున్నాయి.⇒ నెలకు 25 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. తక్కువగా ఇవ్వడం, మార్కెట్లో రేటు పెరిగితే అంగన్వాడీలకు అరకొరగా సరిపెట్టడం, అన్ని చోట్లా చిన్న గుడ్లు ఇవ్వడం, పాడైనవి ఇవ్వడం పరిపాటిగా మారిందని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక గృహిణి వాపోయింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చూసినా అక్కడ అందించే కోడి గుడ్లు చిన్నబోతున్నాయి! అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పోషకాహారంలో అత్యంత కీలకమైన కోడి గుడ్ల సరఫరాలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. గుడ్ల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న టీడీపీ నేతలు నిర్దేశిత బరువు కలిగిన గుడ్లకు బదులుగా అందులో సగం కూడా లేని అతి చిన్న కోడిగుడ్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. గుడ్లు చిన్నవే కానీ వాటి పేరుతో జరుగుతున్న దోపిడీ మాత్రం రూ.వంద కోట్లకుపైనే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో ఇదే దుస్థితి నెలకొంది. అంగన్వాడీల ద్వారా 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు చొప్పున పంపిణీ చేయాలి. బాలింతలు, గర్భిణులకు ఇంటికే సరుకులతోపాటు 25 గుడ్లను అందచేయాలి. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు పాలతోపాటు గుడ్లను ఇంటికే ఇవ్వాలి. వీరందరికీ కలిపి రాష్ట్రంలో 23.10 లక్షల మందికి నెలకు ఇవ్వాల్సిన గుడ్లు 5,77,50,000. అదే ఏడాదికి చూస్తే 69.30 కోట్ల గుడ్లు సరఫరా చేయాలి. కాంట్రాక్టు పొందిన టీడీపీ నేతలు బయట విక్రయించే వాటితో పోలిస్తే పరిమాణం, బరువులో సగం కూడా లేని కోడిగుడ్లను అంగన్వాడీలకు అంటగట్టి బిల్లులు దండుకుంటున్నారు. మరోవైపు రవాణా చార్జీలను మిగుల్చుకునేందుకు నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే అంగన్వాడీలకు వీటిని పంపిణీ చేస్తుండటంతో మురిగిపోయి వృథాగా మారుతున్నాయి. వెరీ బ్యాడ్.. పోషకాహారంపై పెను ప్రభావం!కోళ్ల ఫారాల వద్ద గుడ్లను పరిమాణం బట్టి వేరు చేస్తారు (గ్రేడింగ్). సైజును బట్టి ధర నిర్ణయిస్తారు. సాధారణంగా మార్కెట్లో విక్రయించే వ్యాపారులు బరువు, పరిమాణం తక్కువగా ఉన్న వాటిని తీసుకోరు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కాంట్రాక్టర్లు మాత్రం తక్కువ ధరకు లభిస్తుండటంతో చిన్న గుడ్లను తీసుకుని అంగన్వాడీలకు అంటగడుతున్నారు. దీంతో కోడిగుడ్ల పరిమాణం తగ్గిపోయి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పోషకాహారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతా పచ్చ ముఠాలే..!రాష్ట్రంలో 26 జిల్లాలకు ఒక్కో కాంట్రాక్టర్‌కు గుడ్డు సరఫరా బాధ్యతలు అప్పగించారు. వీరిలో అత్యధికులు టీడీపీ నేతలు, వారి అనుయాయులే. కాంట్రాక్టు ప్రకారం గుడ్డు ధర బాగానే చెల్లిస్తున్నా నాసిరకం అంటగడుతున్నారు. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (నెక్) నిర్ధారించిన ధర ప్రకారం నెలవారీగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. ఉదాహరణకు గుడ్డు ధర సగటున రూ.6 ఉందనుకుంటే దానికి అదనంగా సరఫరా చేసినందుకు రవాణా చార్జీలు కింద ఒక్కో గుడ్డుకు రూ.1.10 చొప్పున కలిపి మొత్తం రూ.7.10 వరకు ఇస్తున్నారు.అయినా సరే తృప్తి చెందకుండా గ్రేడింగ్‌లో నాసిరకం చిన్న గుడ్లును ఎంపిక చేసి అంగన్వాడీలకు పంపుతున్నారు. ఈ లెక్కన నెలకు 5,77,50,000 గుడ్లకు రూ.41 కోట్లకుపైగా చెల్లింపులు జరుగుతాయి. చిన్న గుడ్లు సరఫరా చేయడం, రవాణా చార్జీలు మిగుల్చుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడటంతో ఒక్కో గుడ్డుపై రూ.2 చొప్పున నెలకు రూ.11.55 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే! దీని ప్రకారం ఏడాదికి రూ.138 కోట్లకుపైగా దుర్వినియోగం అవుతోందని అంచనా. ఒకేసారి సరఫరాతో పాడైపోతున్న గుడ్లు..మరోవైపు నిబంధనల మేరకు కాంట్రాక్టర్లు నెలలో నాలుగుసార్లు గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా ఒకటి రెండు దఫాల్లో సరిపుచ్చి రవాణా చార్జీలను నొక్కేస్తున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉంటున్న కోడి గుడ్లు పాడైపోతున్నాయి. ఈ కారణం చెబుతూ అంగన్వాడీల్లో లబ్ధిదారులకు గుడ్లు అందించడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఇక అంగన్వాడీలకు నాలుగు వారాలపాటు సరఫరా చేయాల్సిన గుడ్లకు నాలుగు వేర్వేరు రంగులు వేయాలనే నిబంధన సైతం గాలికి వదిలేశారు.ప్రభుత్వం తక్షణం ఈ చర్యలు చేపడుతుందా?⇒ రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల నమూనాల సేకరణ⇒ జిల్లాల వారీగా బరువు, నాణ్యతా తనిఖీలు⇒ టెండర్ నిబంధనలతో సరఫరా గుడ్ల పోలిక⇒ సరఫరా రిజిస్టర్లు, బిల్లుల ఆడిట్⇒ తక్కువ బరువు గుడ్లు వస్తే చెల్లింపుల పరిశీలన⇒ నాణ్యతా లోపాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు⇒ నెలవారీ సరఫరా, తిరస్కరణ వివరాల ఆన్లైన్లో వెల్లడి⇒ గుడ్ల సరఫరాపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీల బలోపేతం -
అచ్చెన్న ‘యంత్ర’ తంత్రం!
సాక్షి, అమరావతి: ఆయన వ్యవసాయశాఖ మంత్రి. విత్తనాలతోనే కాదు.. యంత్రాలతో సిరుల పంట పండించుకోవాలని రంగం సిద్ధం చేశారు. ఈ పంట పండించాలన్న ఒత్తిడి తట్టుకోలేక ఒక అధికారి ఈ బండారాన్ని బయటపెట్టారు. దీంతో మంత్రి, ఆయన ఓఎస్డీ తేలుకుట్టిన దొంగల్లా మారారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీ కేంద్రంగా అవినీతి యథేచ్చగా సాగుతోంది. మంత్రి అచ్చెన్న అవినీతికి వత్తాసు పలకలేక, వేధింపులు తట్టుకోలేక రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆగ్రోస్) జనరల్ మేనేజర్ (జీఎం) మునెల్లి చంద్రరాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కామధేనువుగా మార్చుకుని భారీ దోపిడీకి తెగబడుతున్నారని ఆయన స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. యంత్ర పరికరాల తయారీ కంపెనీతో డీల్ కుదర్చమని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారని ఆయన ఓఎస్డీ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించారని ఆయన ఆ లేఖలో వివరించారు. అచ్చెన్నాయుడి అవినీతి బాగోతంలో తాజా వ్యవహారం ఇది. రూ.240 కోట్ల కాంట్రాక్టులో అడ్డగోలు అవినీతికి స్కెచ్ ఆగ్రోస్ ఆధ్వర్యంలో గత ఏడాది రూ.60.14 కోట్ల సబ్సిడీతో 25 వేల పరికరాలు పంపిణీ చేయగా.. 2025–26లో రూ.240 కోట్ల విలువైన కిసాన్ డ్రోన్లతోపాటు యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలులో కమీషన్ల పేరిట సొమ్ము చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేశారు. ఆ బాధ్యతను తన ఓఎస్డీ పోలినాయుడుకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలినాయుడు ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను సంప్రదించారు. యంత్రపరికరాల కంపెనీలతో మాట్లాడి భారీ కమీషన్లు వసూలు చేయాలని చెప్పారు. అందుకు సమ్మతించిన కంపెనీలకే కాంట్రాక్టు కట్టబెట్టాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారని కూడా స్పష్టం చేశారు. భారీ కమీషన్ల డిమాండ్‌తో యంత్ర పరికరాల కంపెనీలు వెనుకంజ వేశాయి. దీంతో కమీషన్ల వ్యవహారం తేల్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఓఎస్డీ పోలినాయుడు రెండు, మూడుసార్లు జీఎం రాజమోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్న పేరుతో ఓఎస్డీ వేధింపుల్ని తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వెళ్లేముందు మంత్రి అచ్చెన్న, ఆయన ఓఎస్డీ తనను ఏవిధంగా వేధించింది, కమీషన్ల కోసం ఎంతగా ఒత్తిడి తెచ్చింది వివరిస్తూ ఆగ్రోస్ చైర్మన్ ఎం.సుబ్బనాయుడు, ఎండీ ఢిల్లీరావు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌లకు లేఖ రాశారు. ఆ లేఖ కాపీనీ సీఎం కార్యాలయానికి కూడా పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి బండారం బట్టబయలైంది. మీడియాలో వైరల్ అయిన ఈ లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరికరాల ధరలు పెంచి.. గత ఏడాది రూ.60.19 కోట్ల యంత్రపరికరాల కాంట్రాక్టులోనూ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకోసం యంత్ర పరికరాల ధరలను భారీగా పెంచింది. గత ప్రభుత్వం రోటోవేటర్‌ను రూ.90వేల నుంచి రూ.లక్ష మధ్య కొనుగోలు చేసింది. ప్రస్తుతం అదే రోటోవేటర్‌కు రూ.1.45 లక్షల ధర నిర్ణయించారు. ఇదొక్కటే కాదు.. 2024–25 సీజన్లో పంపిణీచేసిన యంత్రపరికరాల ధరలన్నీ మార్కెట్ ధరల కంటే ఎక్కువ రేటు కోట్‌చేసి అవినీతికి పాల్పడ్డారు. తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నెప్ట్యూన్ బ్యాటరీ స్ప్రేయర్ తయారీ సంస్థను సింగిల్ టెండర్ విధానంలోఎంపిక చేయడమే మంత్రి అచ్చెన్న దోపిడీకి నిదర్శనం. ట్రాక్టర్ల కొనుగోలులో ఎల్–1 టెండర్ ప్రక్రియను పాటించకుండా బాక్స్ టెండర్ పద్ధతిని అనుసరించడం, కేవలం రూ.10 లక్షల గ్యారంటీ ఉన్న కంపెనీలకు ఏకంగా రూ.23 కోట్ల వరకు అడ్వాన్సులు చెల్లించడం, డిస్క్వాలిఫై అయిన ఓ ట్రాక్టర్ల కంపెనీని ఎంప్యానెల్ జాబితాలో చేర్చడం వంటి వాటితో అవినీతికి రంగం సిద్ధం చేశారు. ఆ అవినీతికి వత్తాసు పలకలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆగ్రోస్ జీఎం స్థానంలో తమకు విధేయుడైన ఓ జూనియర్ అధికారిని నియమించి అవినీతి దందా సాగించేందుకు మంత్రి అచ్చెన్న సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. -
వైద్య బదిలీల్లో భారీ అవినీతి!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది బదిలీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి నిఘా విభాగం శుక్రవారం నివేదిక అందజేసింది. ఈ దందాలో ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం మొదలు పైస్థాయి వరకు అందరి హస్తం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఒక విభాగానికి చెందిన అధిపతితోపాటు ఆయన వద్ద పనిచేసే ఇద్దరు అధికారులు, సచివాలయంలోని ఇద్దరు అధికారుల పేర్లను నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ సొంత క్లినిక్‌లు, ఆసుపత్రులను నడుపుతున్న కొందరు డాక్టర్లు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడక రూ. లక్షల్లో లంచాలు సమరి్పంచినట్లు తెలిసింది. ఇలా ఒక ఉన్నతాధికారి ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా నర్సులకు సంబంధించిన సీనియారిటీ లిస్టు మాయాజాలంగా మారింది. దీనిపై నర్సులు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేయడం తెలిసిందే. దీనిపై సీఎం కూడా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 23 ఆసుపత్రుల్లోని నర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారమంతా ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ప్రభుత్వానికి చేరింది.పలు జిల్లాల డీఎంహెచ్వోలు కూడా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. యాదాద్రి భువనగిరికి చెందిన ఒక కీలకాధికారి ఐదారు రోజుల కిందటే బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లి రిపోర్టు చేసినప్పటికీ పాత కేంద్రంలో ఉంటూనే ఇప్పటికీ వర్క్ ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిసింది. -
నెల్లూరులో నెక్లెస్ రోడ్డు నిర్మాణం పేరుతో భారీ అవినీతి
-
నాగర్‌దొడ్డి అక్రమార్కులకు బిగుస్తున్న ఉచ్చు
♦ జూరాల ముంపు గ్రామంలో పరిహారం లెక్కింపులో భారీ అక్రమాలు ♦ ‘ఉమ్మడి’కాలంలో అవినీతి అధికారుల నిర్వాకం ♦ గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఏకంగా రూ.కోటి అంచనాలు ♦ రెండేళ్ల కిందటే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ♦ ఏడుగురు ఇంజనీర్లపై చర్యలకు విచారణ కమిటీ సిఫార్సు ♦ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు అంచనాలు, ఇష్టారీతి మదింపుతో జూరాల ముంపు గ్రామం నాగర్‌దొడ్డిలో లేని గృహాలను ఉన్నట్లుగా చూపి కోట్లు కొట్టేసేందుకు ప్రణాళికలు వేసిన ఇంజనీర్లకు ఉచ్చు బిగుస్తోంది. గృహాలకు పరిహార మదింపులో భారీ అక్రమాలకు పాల్పడి, తప్పుల తడకగా పరిహార అంచనాలు తయారు చేసిన ఏడుగురు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లపై ప్రభుత్వం శాఖా పరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారుల కమిటీ.. అక్రమాలు నిజమేనని తేల్చడం, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రమేయమున్న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులపైనా చర్యలకు ఆయా శాఖలు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. గుడిసె వంటి నిర్మాణాలకు రూ.20లక్షల పరిహారం.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద మొత్తంగా 11 ముంపు గ్రామాలను గుర్తించారు. ఇందులో పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా ధారూర్ మండలం నాగర్‌దొడ్డి గ్రామం ప్రాజెక్టు ముంపు పరిధిలోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ మట్టం (ఎఫ్ఆర్ఎల్) నుంచి 100 మీటర్ల పరిధిలోని భూమిని సేకరించాలని ముందుగా నిర్ణయించారు. ఈ పరిధిలోకి వచ్చే గృహాలు, చెట్లు, స్థలాలు, వ్యవసాయ బావులు ఇతర నిర్మాణాలు ఏవి ఉన్నా వాటికి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లతో పరిహారం చెల్లించాలి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్ఆర్ఎల్ నుంచి 100 మీటర్ల పరిధి అన్న నిబంధనను మార్చి మరింత ఎక్కువ పరిధితో లెక్కలు కట్టి పరిహారాన్ని పెంచారు. ఇందులో భాగంగానే నాగర్‌దొడ్డి గ్రామంలో మొత్తంగా 148 నిర్మాణాలను రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖలు ముంపు గృహాలుగా గుర్తించి వాటి పరిహార అంచనాలు సిద్ధం చేశాయి. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ నేతల ప్రోద్బలంతో ఆయా విభాగాల ఇంజనీర్లు, అధికారులు అడ్డగోలు అంచనాలు సిద్ధం చేశారు. రూ. 5 లక్షలు కూడా విలువచేయని గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఏకంగా రూ. 20 లక్షల నుంచి రూ.1.05 కోట్ల వరకు పరిహారపు అంచనాలు తయారు చేశారు. కొన్ని గృహాల్లో 2 మీటర్ల దూరానికో పిల్లర్ చొప్పున నిర్మాణాలు చేసినట్లుగా గుర్తించి ఆ మేరకు అంచనాలు రూపొందించారు. ఇక ఇళ్ల నిర్మాణంలో వాడిన కలపను 25 శాతం నుంచి 30 శాతం వరకు మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉండగా,, 60 శాతానికి మించి కలపను వాడినట్లు చూపారు. కొన్ని గృహాల్లో ఏకంగా 90 శాతం కలప వినియోగం జరిగినట్లుగా చూపి అంచనాలు వేశారు. కలపకు అటవీ శాఖ నిర్ణయించిన ధర అధికంగా ఉన్న దృష్ట్యానే అంచనాలు పెంచి చూపారు. కాగా, మనిషి కూడా పట్టనంత ఇరుకుగా సందుల నిర్మాణం, నివాసానికి యోగ్యం కాని రీతిలో.. అతుక్కున్నట్లుగా వీటిని నిర్మించడం సైతం అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. ఇలా మొత్తంగా 148 గృహాలకు రూ.20 కోట్ల మేర పరిహారాలను లెక్కించి కోట్లు కొల్లగొట్టే యత్నం చేశారు. పరిహార మదింపు అంశంలో వివిధ శాఖల అధికారులతో పాటు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలకు ప్రమేయం ఉందని రెండేళ్లకిందటే ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. దీనిపై అప్పట్లోనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. వాస్తవమేనన్న కమిటీ.. మంత్రి ఆదేశాల మేరకు ఆర్అండ్ఆర్ వ్యవహారాలు చూస్తున్న నీటి పారుదుల శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ కమిటీకి ఈ బాధ్యతలు కట్టబెట్టారు. నాగర్‌దొడ్డి గ్రామ గృహాల పరిహారం అంచనాల్లో తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఇందులో రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల అధికా రుల ప్రమేయం ఉందని ఈ కమిటీ తన నివేదికలో తేల్చినట్లుగా తెలుస్తోంది. వాస్త వంగా అక్కడ చూపిన గృహాలన్నీ ఎక్కువ పరిహారాన్ని కొట్టేసేందుకు అప్పటికప్పు డు, హడావుడిగా తాత్కాలికంగా నిర్మిం చినవని కమిటీ గుర్తించింది. ఉద్దేశపూర్వకం గానే అంచనాల్లో అవకతవకలకు పాల్పడ్డా రని, ఇందులో అటవీ, రెవెన్యూ అధికారుల తో పాటు నీటి పారుదల శాఖకు చెందిన ఎస్ఈ, ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈఈలు, మరో ఇద్దరు ఏఈలు ఉన్నట్లుగా కమిటీ తేల్చింది. పరిహారపు అంచనాల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారుల వివరణ తీసుకొని తదనుగుణ చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలిసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోనుందని సమాచారం. -
రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి


