breaking news
Marriage Counselor
-
పెళ్లికి మేం రెడీ! కానీ...
‘పెళ్లికి మేం రెడీ. కానీ మాకు ఈ సమస్య ఉంది’ అని ప్రీమేరిటల్ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న 25 నుంచి 40 ఏళ్ల మధ్య జంటలు అధికమయ్యారని మేరేజ్ కౌన్సెలర్లు తెలియచేస్తున్నారు. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 40 శాతం పెరిగిందని చెబుతున్నారు. పెళ్లి నిర్ణయం తల్లిదండ్రుల నుంచి పిల్లల చేతుల్లోకి మారడమే దీనికి కారణమంటున్నారు. మరి పెళ్లికి ముందు జంటలు వ్యక్తం చేస్తున్న సమస్యలు ఏమిటి?మొదట మనం కొందరిని పరిచయం చేసుకోవాలి. వారు– రిలేషన్షిప్ కౌన్సెలర్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకో థెరపిస్ట్... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రస్తుతం ఈ రంగాల్లో ఉన్న వారికి డిమాండ్ పెరిగింది. వివాహం చేసుకోవాలని భావిస్తున్న, నిర్ణయించుకున్న వారు ఎటు పోయి ఎటు వస్తుందో ముందు ఒకసారి ‘ప్రీమేరిటల్ కౌన్సిలింగ్’ తీసుకుందాం అని అనుకుంటున్నారు. ‘దీని వల్ల మంచే జరుగుతుంది. ఇది గట్టెక్కే జంటనా లేకుండా తర్వాత తిప్పలు పడే జంటనా ముందే తేల్చేయొచ్చు’ అంటున్నారు ఈ ‘వివాహ నిపుణులు’. గతంలో అబ్బాయి ఇష్టం, అమ్మాయి ఇష్టం పట్టింపు లేకుండా తల్లిదండ్రులు తాము మంచి అనుకున్నది నమ్మి పెళ్లిళ్లు జరిపించేవారు. తర్వాత పిల్లల ఇష్టాలు గట్టి పట్టు పట్టాయి. ఇప్పుడు పెద్దల ప్రమేయం దాదాపు లేని స్థితి వచ్చింది. పెళ్లి నిర్ణయం ఏకంగా అబ్బాయి, అమ్మాయి తమ నిర్ణయానుసారం తీసుకుంటున్నారు. ఆ నిర్ణయ భారం వారికి భయం కూడా కలిగిస్తోంది. అందుకే పెళ్లికి ముందు కావాల్సిన కౌన్సెలింగ్ హాజరయ్యి వివాహ నిపుణుల జేబులు నింపుతున్నారు.→ ఎవరు కౌన్సెలింగ్‌కి వస్తున్నారు?→ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నవారు→ లాంగ్‌టర్మ్ రిలేషన్లో ఉన్నవారు→ సింగిల్‌గా ఉన్నవారు→ ఎంగేజ్మెంట్ అయినవారువీరంతా కౌన్సెలింగ్ కోసం వస్తున్నారు.→ 25 నుంచి 40 మధ్య...గతంలో ప్రిమేరిటల్ కౌన్సెలింగ్‌కి అధికశాతం 25 నుంచి 35 ఏళ్ల వయసు వాళ్లు వచ్చేవారు. ఇప్పుడు 40 ఏళ్ల వరకూ అవివాహితులుగా ఉన్నవారు కూడా వస్తున్నా రు. అంటే పెళ్లి చేసుకునే వయసు చాలానే పెరిగిందన్న మాట. ‘వీరి కంటే కూడా మా దగ్గరకు వచ్చేవారిలో 70 శాతం మంది రెండో వివాహం కోసం వస్తున్నవారే’ అని అనలైజ్ చేస్తున్నారు ఈ కౌన్సెలర్లు.→ ఇవీ సందేహాలు– సమస్యలుఇష్టాలు ఏర్పడి, రిలేషన్షిప్లో ఉన్నా కూడా ‘పెళ్లి’ అనేసరికి చాలా సందేహాలు స్త్రీ, పురుషులకు వస్తున్నాయి. వాటిలో ఎక్కువ సమస్యలుగా భావిస్తున్నవి ఇవి.→ పిల్లలు కనాలా వద్దా→ ఆర్థిక వ్యవహారాల్లో ఎవరి వైఖరి ఏమిటి→ కెరీర్ విషయంలో త్యాగం ఎవరిది→ కాపురం ఎక్కడ చేయాలి→ అత్తామామలు/తల్లిదండ్రులతో కలిసి ఉండాలా వద్దాపెళ్లి చేసుకోవాలనుకున్న వారిలో ఇద్దరికీ ఏకాభిప్రాయం లేకపోతే పైన పేర్కొన్న ప్రతిదీ గుదిబండై కూచుంటుంది అంటున్నారు కౌన్సిలర్లు. ‘కొందరికి పిల్లలు కావాలి.. కొందరికి వద్దు... కొందరికి అత్తమామలతో ఉండటం ఇష్టం ఉండదు... ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, కెరీర్ మార్చడాలు కూడా సమస్యలే. ఇవన్నీ ముందు మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో ఎదురయ్యే నిస్పృహలు, కొట్లాటలు తగ్గుతాయి’ అంటున్నారు నిపుణులు.→ తాడో పేడో...కౌన్సెలర్లు దాదాపుగా జంటలను కలపాలని చూస్తున్నా కొన్ని జంటలని గమనించాక ‘మీరు చేసుకోకపోవడమే మంచిది’ అని తెగేసి చెబుతున్నారు. ‘ఒక జంటలో అబ్బాయి జాయింట్ అకౌంట్ ఉండాలని పట్టుబట్టాడు. అమ్మాయికి ఇష్టం లేదు. ఆ పెళ్లి కేన్సిల్ అయ్యింది. మరో జంటలో ఆమెకు పిల్లలు వద్దు. అతనికి కావాలి. ఆ పెళ్లి కూడా కేన్సిల్ అయ్యింది. చేసుకున్నాక విడాకుల కంటే చేసుకోక ముందు కేన్సిల్ చేసుకోవడమే మంచిది’ అంటున్నారు ఈ కౌన్సిలర్లు. ‘ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి ఎంత ఆర్భాటంగా చేయాలి... ఎంత ఖర్చు చేయాలి అనే విషయంలో మంకుపట్టు పట్టే అబ్బాయి, అమ్మాయిల పెళ్ళిళ్లు కూడా కేన్సిల్ అవుతున్నాయి. కొన్ని జంటల్లో మత ఆచారాలు ఆచరించాలా వద్దా అనే విషయం దుమారం రేపుతోంది’ అని తెలిపారు కౌన్సెలర్లు.→ రెండో వివాహంమొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకోవాలనుకునేవారు ఎక్కువగా కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. ‘వీరికి గత వివాహాల బరువు, భయం... అలాంటి భంగపాటు మళ్లీ ఎక్కడ ఎదురవుతుందోనన్న భంగపాటు ఇవి వెంటాడుతుంటాయి. ఇక పిల్లలు ఉంటే మొదటి భర్త/భార్య వాళ్లతో కాంటాక్ట్‌లో ఉంటే ఈ రెండో వివాహంలో ఆ విషయమై కూడా స్త్రీ, పురుషులకు ఎంతో అవగాహన అవసరం. కౌన్సెలింగ్ వారికి మార్గం చూపిస్తుంది’ అంటున్నారు నిపుణులు.పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. పెళ్లి సంబంధాలు కుదరడం, జంట కలవడం, పెళ్లికి సిద్ధమవడం... ఇవన్నీ ఇప్పుడు అనుకున్నంత సులువుగా లేవు. పెళ్లికి సంబంధించిన సందేహాలు, పెళ్లయ్యాక జీవన భాగస్వామితో ఆ భాగస్వామి కుటుంబంతో వ్యవహార శైలి ఎలా ఉండాలనేది కౌన్సెలింగ్ ద్వారా తెలుసుకుంటే తప్పేమీ లేదు. గతంలో ఇవన్నీ ఇంగితజ్ఞానం, అంతరజ్ఞానంతో ఆటోమేటిక్‌గా తెలిసేవి. లేదంటే పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు కౌన్సిలర్ల ద్వారా తెలుసుకోవాల్సి వస్తోంది. -
Shivani Misri Sadhoo: ‘విడిపోవడం’ అనే గాయం నుంచి బయటపడటానికి..
ప్రేమికులైనా, దంపతులైనా కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోతే.. ఆ ‘విడి’బంధం తాలూకు ప్రభావం ఎవరి మీద ఉంటుంది? దుఃఖంలో నిండా కూరుకుపోతే ముందున్న జీవితం కనపడుతుందా? చీకటి నిండిన ఒంటరితనంలో తిరిగి వెలుగులు నింపుకోవడం సాధ్యమేనా? విడిపోయే బంధాలను తిరిగి కలపడానికి ప్రయత్నించవచ్చు. కానీ, విడిపోయాక ఆ శూన్యంలో కలిసిపోకూడదు. తిరిగి నిలబడటానికి ప్రయత్నించాలి. మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పి తాజా దారులకు ఆహ్వానం పలకాలి. అందుకు ఏం చేయాలో చెబుతున్నారు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సెలర్ శివాని మిశ్రి సాధు. Marriage Counselor Shivani Misri Sadhoo: శివాని మిశ్రి సాధు ఇరవై ఏళ్ల నుంచి సైకాలజిస్ట్‌గా సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా 17,000 జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి, దేశరాజధాని ఢిల్లీలో బెస్ట్ మ్యారేజ్ కౌన్సెలర్‌గా పేరొందారు. ప్రతి నెలా వందలాది యువతకు కౌన్సెలింగ్ ఇచ్చే శివాని ఢిల్లీ ఐబిఎస్ (ఇన్స్ట్యూట్ ఆఫ్ బ్రేయిన్ అండ్ స్పైన్), ఫోర్టిస్ హాస్పిటల్స్‌లో కౌన్సెలర్‌గా ఉన్నారు. సార్ధి కౌన్సెలింగ్ పేరుతో వ్యక్తిగతంగా సేవలను అందిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ అని చెప్పే శివాని మిశ్రి సాధు పెళ్లికి ముందైనా, పెళ్లి తర్వాతైనా రిలేషన్షిప్ బ్రేక్ అయితే, ఆ డిప్రెషన్‌తో బాధపడేవారు జీవితాలను అంతం చేసుకోకుండా, గతం నుంచి ఎలా బయటపడాలో సూచనలు చేస్తున్నారు. ‘‘ప్రేమ, పెళ్లి బంధంలో వచ్చే సమస్యల గురించి ప్రతి నెలా వందలాది మంది యువతీ యువకులతో సంభాషిస్తుంటాను. వారితో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయాలేంటంటే.. బంధం నుంచి విడిపోయిన తర్వాత ప్రపంచం శూన్యమైపోయినట్టుగా ఉంటుంది. తమని తాము ఒంటరిగా చేసుకోవడం, పుచ్చుకున్న కానుకలను ముందు పెట్టుకొని గంటలు గంటలు కూర్చోవడం, కెరీర్‌పై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం.. వంటివి చేస్తున్నారు. అదే అబ్బాయిలైతే వీటితోపాటు తాగుడుకు అలవాటు పడటం, సోషల్ మీడియాలో తమ మాజీ ప్రియురాలు లేదా మాజీ భార్యతో ఉన్న పాత ఫొటోలను అప్లోడ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. కృత్రిమ జీవితానికి స్వస్తి కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోవాలనుకున్న బాధను అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అనుభవిస్తారు. ఆ బాధను వెలిబుచ్చడానికి మరొకరి ఓదార్పును కోరుకుంటారు. దీని కారణంగా వారు చాలాసార్లు పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం గమనించాను. మన నుంచి ఒకరు విడిపోతే అంతటితో జీవితం ముగియదు. జీవితాన్ని తరచి చూసుకుంటే మరో కొత్త కోణం తప్పక కనిపిస్తుంది. నచ్చని మనిషితో ఉంటూ భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ నాటకం ఆడాల్సిన అవసరం లేదు. కృత్రిమ జీవితాన్ని గడపాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ మంచి రేపటి కోసం ఈ రోజు మీ మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పండి. జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ఈ ఆరు అంశాలను అనుసరించండి. 1. మాజీ జ్ఞాపకాలలో ఓదార్పు వద్దు గతంలో గడిపిన అందమైన లేదా భయంకరమైన సమయాలు ఎన్నో ఉంటాయి. మీరు ఆ క్షణాలను పదేపదే తలచుకుంటూ వాటిలోనే ఓదార్పు కోరుకుంటూ జీవించాలనుకుంటే అది వృథా ప్రయాస అవుతుంది. అక్కడితోనే ఆగిపోతే జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు. 2. తిరిగి వచ్చి మాట్లాడటానికి సాకులు వెతకద్దు ప్రతి చిన్న, పెద్ద విషయాలను ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ‘మాజీ’తో పంచుకోవడం మీకు అలవాటు ఉండి ఉంటుంది. అందుకు పదేపదే కాల్/ మెసేజ్/ ఇ–మెయిల్ చేయడం, అతను/ఆమె ఇంటి చుట్టూ తిరగడం చేయవద్దు. ముందుగా మీ సంబంధం ముగిసి పోయిందనే వాస్తవంలోకి రండి. మీ జీవితం నుంచి మీ మాజీని పూర్తిగా తొలగించండి. 3. ఆ జ్ఞాపకాలను చెత్తబుట్టలో వేయండి దిగిన ఫోటోలు, వీడియోలు, ఫోటో ఫ్రేమ్‌లు, ఇచ్చి పుచ్చుకున్న బహుమతులు లేదా మీ మాజీని మళ్లీ మళ్లీ గుర్తుచేసే ఏదైనా వస్తువును ముందు పెట్టుకొని బాధపడుతూ కూర్చోకుండా వాటిని చెత్తబుట్టలో వేసేయండి. మీ ఇంటిలో ఫర్నిచర్ క్రమాన్ని మార్చండి. మీకు నచ్చిన రంగురంగుల పువ్వులు, లైట్లతో అలంకరించండి. మీ అందమైన ఫొటోలను గోడపై ఉంచండి, తద్వారా మీరు ఉదయం కళ్ళు తెరిచినప్పుడు, ప్రతిదీ మీదే కనిపిస్తుంది. మంచం మధ్యలో పడుకుని మీరే చెప్పుకోండి.. ‘ఇప్పుడు అంతా నాదే’ అని. 4. మీ ప్రత్యేక లక్షణాలను రాయండి ఒక డైరీ, పెన్ను తీసుకొని మీ 10 ప్రత్యేక లక్షణాలను రాయండి. ఈ జాబితా కొత్త విషయాలను ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు.. మీరు మంచి డ్యాన్సర్. గొప్ప పెయింటింగ్స్ చేస్తారు. నేను నా చేతులపై పచ్చబొట్లు ఇష్టపడతాను. ఇలాంటివి రాస్తున్నప్పుడు భవిష్యత్తు అందంగా కనిపిస్తూ ఉంటుంది. 5. ఆరు నెలల మేజిక్ పాట్ మీ ‘మాజీ’ని మరచిపోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ‘మీ మాజీ గురించి ఆలోచించడం మానేసి, చేయవలసిన పనుల జాబితా’ను రూపొందించండి. బరువు తగ్గడం, మారథాన్‌కు సిద్ధపడటం, కొత్త భాష నేర్చుకోవడం, ఇల్లు కొనడం లేదా కొత్త ఇంటికి వెళ్లడం, సెలవులో వెళ్లడం, రాఫ్టింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహసాలు చేయడం, మీరు ఆనందించే కొత్త వ్యక్తులను కలవడం వంటి వాటిని జాబితా చేయండి. వీటిలో ఎప్పుడూ ప్రయత్నించని వాటిని రాబోయే ఆరు నెలల్లో చేయండి. అప్పుడు మీ మాజీ మీ ఆలోచనలలో కూడా పలచ బడిపోతారు. 6. మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించండి ‘విడిపోవడం’ అనే గాయం నుండి బయటపడటానికి మీకు మీరే ఒక పార్టీని ఇవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించుకోవచ్చు. మీ భాగస్వామితో సంబంధంలో ఉండటం వలన మీరు దూరంగా పెట్టిన మీ స్నేహితులను ఈ పార్టీకి ఆహ్వానించండి. రెట్టింపులుగా ఆనందాన్ని వెతుక్కుంటూ కొత్త జీవితానికి ఆహ్వానం పలకండి. -
వేధించాడు.. రోడ్డెక్కాడు!
వివాహితను వేధించిన పోకిరి సామాజిక సేవ శిక్ష వేసిన కోర్టు గన్‌పార్క్ వద్ద నిర్వర్తించిన వైనం సిటీబ్యూరో: వివాహితను వేధిం చిన దూరపు బంధువుకి న్యాయస్థానం సామాజిక సేవను శిక్షగా విధించింది. దీంతో అతగాడు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గన్‌పార్క్ సిగ్నల్ వద్ద నిల్చుని ‘షీ–టీమ్’ పోస్టర్ ప్రదర్శించినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా వెల్లడించారు. మౌలాలీ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎంఏ రహీమ్ తన దూరపు బంధువును ఫోన్ ద్వారా వేధించడం మొదలెట్టాడు. ఆమె ఇంటి సమీపంలోనే సంచరిస్తూ... భర్త లేని సమయం గుర్తించి ఫోన్లు చేసేవాడు. ఎవరు ఈ పని చేస్తున్నారో తెలి యక ఆమె పలుమార్లు తన సెల్ నెంబర్ మార్చుకున్నారు. అయినప్పటికీ బంధు వు కావడంతో తేలిగ్గా కొత్త నెంబర్ సేకరించి కాల్ చేసి వేధించేవాడు. ఈ బాధ తాళలేక ఆ వివాహిత చివరకు తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీంతో ఆమె భర్త నెంబర్‌కు రహీం కాల్ చేసి ఫోన్‌ను భార్యకు ఇవ్వాల్సిందిగా చెప్పి మరీ ఆమెను వేధించేవాడు. ఈ చర్యలతో భార్యాభర్తల మధ్య స్వల్ప స్పర్థలు కూడా రేగాయి. మ్యారేజ్ కౌన్సిలర్ సలహా మేరకు ఆమె షీ–టీమ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడైన రహీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుకు వి వాహిత అంగీకరించకపోవడంతో పెట్టీ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యా యమూర్తి నిందితుడికి జరిమానాతో పాటు ఒక రోజు సామాజిక సేవ చేయాల్సిందిగా శిక్ష విధించారు. దీంతో సోమవారం గన్‌పార్క్ సిగ్నల్ వద్ద ‘విధులు నిర్వర్తించిన’ రహీమ్ షీ–టీమ్స్ పోస్టర్లు ప్రదర్శించారు.


