breaking news
Manipal Health Enterprises
-
మణిపాల్ హెల్త్ ఐపీవో.. షేరు ధర ఇలా..
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు షేరు ధరల శ్రేణిని రూ.560–590గా కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.77,600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల 29న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ 31న ముగుస్తుంది. రూ.9,275 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. ఇందులో భాగంగా రూ. 8,000 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుండగా.. సంస్థలోని ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మరో 2.16 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. మణిపాల్ హెల్త్ సమీకరించనున్న నిధుల్లో రూ.5,378 కోట్లను సబ్సిడరీ మణిపాల్ హాస్పిటల్స్‌కు చెందిన రుణ చెల్లింపుల కోసం, రూ.574 కోట్లను మరో సబ్సిడరీ సహ్యాద్రి హాస్పిటల్స్‌లో మైనారిటీ వాటా కొనుగోలు కోసం, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. దేశవ్యాప్తంగా 49 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ (13,000 బెడ్స్) కలిగిన మణిపాల్ హెల్త్.. 2025 సెపె్టంబర్ 30తో ముగిసిన ఆరు నెలలకు రూ.4,713 కోట్ల ఆదాయంపై రూ. 572 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.3–4 ఏళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి హాస్పిటల్స్ నెట్వర్క్ విస్తరణ కోసం వచ్చే 3–4 ఏళ్లలో రూ.3,560 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మణిపాల్ హెల్త్ ఎండీ, సీఈఓ దిలీప్ జోస్ చెప్పారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ప్రస్తుత హాస్పిటల్స్ విస్తరణ ద్వారా మరో మూడేళ్లలో 3000 బెడ్స్ అదనంగా జతయ్యే అవకాశం ఉందన్నారు. విస్తరణలో భాగంగా కేరళ, హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఆసుపత్రుల కొనుగోలుకు సిద్ధమేనని కూడా జోస్ వెల్లడించారు. -
ఫోర్టిస్‌కు రూ.6,322 కోట్లిస్తాం!
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మరింత మొత్తాన్ని ఆఫర్ చేసింది. కొనుగోలు విలువను రూ.6,322 కోట్లకు పెంచింది. స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఫోర్టిస్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. హాస్పిటల్ వ్యాపారం విలువ రూ.5,003 కోట్లకు అదనంగా రూ.1,319 కోట్లను ప్రీమియం రూపంలో చెల్లించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. అన్ని బిడ్డింగ్ ఆఫర్లను పరిశీలించి సిఫారసు చేసేందుకు ఫోర్టిస్ బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బోర్డు భేటీకి ముందే మణిపాల్ తన ఆఫర్‌ను సవరించడం గమనార్హం. రూ.750 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని తాజాగా ప్రతిపాదించింది. డెట్ ఫైనాన్స్ లేదా ఫోర్టిస్‌కు రుణాలిచ్చిన సంస్థలకు గ్యారంటీ, కంఫర్ట్ లేఖల రూపంలో ఈ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మణిపాల్/ టీపీజీ ఆధ్వర్యంలోని కన్సార్షియం ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు ఆఫర్‌ను సవరించడం ఇది రెండోసారి. మార్చి 27న మొదటి విడత రూ.5,003 కోట్లను చెల్లించేందుకు ముందుకు రాగా, ఈ నెల 10న రూ.6,061 కోట్లకు ఆఫర్నుపెంచింది. ఒక్కో షేరుకు రూ.155 ఇవ్వజూపింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు కేకేఆర్ ఆధ్వర్యంలోని రేడియెంట్ లైఫ్ కేర్, మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, చైనాకు చెందిన ఫోసన్ హెల్త్‌కేర్ సైతం ఆసక్తితో ఉన్న విషయం విదితమే. -
మణిపాల్ హెల్త్‌లోటీపీజీకి వాటాలు
డీల్ విలువ రూ. 900 కోట్లు న్యూఢిల్లీ: వైద్య సేవల రంగానికి చెందిన మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్‌లో అమెరికా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ టీపీజీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 900 కోట్లు. దేశీయంగానే కాకుండా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియాన్ కూటమి దేశాల్లోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు టీపీజీతో భాగస్వామ్యం తోడ్పడగలదని మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజేస్ (ఎంహెచ్పీఈఎల్) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్వామి స్వామినాథన్ తెలిపారు. మణిపాల్ గ్రూప్‌లో భాగమైన ఈ సంస్థకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే పలు ఫెర్టిలిటీ క్లినిక్స్, టీచింగ్ హాస్పిటల్స్‌ను కూడా నిర్వహిస్తోంది.


