breaking news
mandlem
-
మా స్కూల్ మాకే ఉంచాలి
జూపాడు బంగ్లా: ‘మా కాలనీలోని స్కూల్‌ను మాకే ఉంచాలి... మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు...’ అంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండ్లెం గ్రామ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండ్లెం గ్రామ దళితకాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలో కేజీ రోడ్డు పక్కన ఉన్న మెయిన్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. దీన్ని రద్దు చేయాలని గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పిల్లలను ఆ బడికి ఎలా పంపాలి? రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
మండ్లెం చెరువుకు గండి
జూపాడుబంగ్ల(కర్నూలు): జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. సోమవారం ఉదయం జూపాడుబంగ్ల మండలంలోని మండ్లెం చెరువుకు గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతోంది. ఇది గుర్తించిన రైతులు గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతోపాటు గండి అలుగు సమీపంలో పడటంతో.. రైతుల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.