breaking news
Malayalam superstar Mohanlal
-
అభిరుచుల మోహనం
మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటన గురించి దక్షిణాది సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్ధాల తరబడి ఆకాశమే హద్దుగా సాగుతున్న ఆయన అభినయ ప్రయాణం గురించి తెలియని ఫిల్మ్ లవర్స్ ఉండరు. అయితే ఆయన గురించి చెప్పుకోవడానికి నటనను మించినవి కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా ఆయన ఆస్వాదిస్తున్న అభిరుచులు, తెరవెనుక పోషిస్తున్న పాత్రల్ని గమనిస్తే ఆ వ్యక్తిగత జీవితం కూడా ఆయన అత్యుత్తమ అభినయం లాగే ఆకట్టుకుంటుంది.కుస్తీ మే సవాల్...ఈ దిగ్గజ నటుడు ఒకప్పుడు రాష్ట్ర స్థాయి కుస్తీ ఛాంపియన్ అని, 1977–78లోనే టైటిల్‌ను గెలుచుకున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, మోహన్ లాల్ కుస్తీలోని మెలకువలను నేర్చుకుని, రెజ్లింగ్ ఫెడరేషన్ దృష్టిని ఆకర్షించారు. దీంతో న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కేరళకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించింది. అయితే, దాదాపు అదే సమయంలో ఒక సినిమా ఆడిషన్ అవకాశం రావడం ఓ కుస్తీ ఛాంపియన్ కావాల్సిన వ్యక్తిని టాప్ హీరోగా మార్చేసింది.మెజీషియన్...మ్యాజిక్ అంటే చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న మోహన్‌లాల్ 2008లో ప్రముఖ భారతీయ మెజీషియన్ గోపీనాథ్ ముత్తుకాడ్ దగ్గర 18 నెలల పాటు శిక్షణ కూడా పొందారు. తర్వాత తిరువనంతపురంలో ‘బర్నింగ్ ఇల్యూజన్’ పేరుతో అగ్నికీలల నుంచి తప్పించుకునే విన్యాస ప్రదర్శనకు సిద్ధమయ్యారు. అయితే, ప్రమాద భయాలతో ఆయన అభిమాన సంఘాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆ ప్రదర్శన రద్దయింది. అయినా ఆయనలోని ఇంద్రజాలికుడు వెనకడుగు వేయలేదు. ఆ తరువాత 2014లో త్రివేండ్రంలో మ్యాజిక్ ΄్లానెట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై ‘ఫ్లోటింగ్ లేడీ’ అనే ఇల్యూషన్ ను ప్రదర్శించి అబ్బురపరచారు. మంచి సినిమా కూడా ఓ ‘మ్యాజిక్’ లాంటిదేనని, ప్రేక్షకుడు మరో ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేయగలిగే మాయాజాలమని ఆయన వర్ణిస్తారు.కవితా గానం...పాటలు వినడం మాత్రమే కాదు అప్పుడప్పుడు వేదికపై పాడడం కూడా ఆయనకు ఇష్టం. ఆయనకు రచన పట్ల చక్కని అభిరుచి ఉంది, తరచుగా తన మాతృభాష అయిన మలయాళంలో చేతితో వ్రాసిన, భావోద్వేగభరితంగా తన బ్లాగులలో పంచుకుంటారు, పలు రంగస్థల నాటకాలలో కూడా మెప్పించారు. సేంద్రియ రైతు...ఆర్గానిక్ వ్యవసాయం అంటే మోహన్‌లాల్‌కు చాలా ఇష్టం. కోవిడ్ లాక్డౌన్ సమయం నుంచి తన ఇంటి పక్కనే సేంద్రియ తోటను ఏర్పాటు చేసి కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. వ్యవసాయం మనసుకు ప్రశాంతతనిస్తుందని అంటారాయన.చెఫ్‌గా...పాకశాస్త్రంలోనూ ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. ఖాళీ దొరికితే ఇంటిల్లిపాదికీ స్వయంగా వండిపెడతారు. కేరళ సంప్రదాయ వంటకాలు వండడం తనకు ఎంతో ఆనందం కలిగించే విషయమని పలు సందర్భాల్లో చె΄్పారు.కరాటే ఫైటర్...ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టే మోహన్‌లాల్‌కు మార్షల్ ఆర్ట్స్‌పై కూడా ఆసక్తి ఉంది. ఆయన కుక్కివాన్ (ప్రపంచ తైక్వాండో ప్రధాన కార్యాలయం) వద్ద శిక్షణ పొంది, తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. – సత్యబాబు -
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
మోహన్‌లాల్‌కు జంటగా గౌతమి
ఒకప్పటి ప్రముఖ బహుభాషా కథానాయకి గౌతమి. కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల కమలహాసన్‌కు జంటగా పాపనాశం చిత్రంతో రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విజయం సాధించడంతో మళ్లీ గౌతమికి అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే తనకు తగిన పాత్ర అయితేనే నటించాలని నిర్ణయించుకున్న తను తాజాగా ఒక త్రిభాషా చిత్రంలో నటించడం విశేషం. అదీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తుండడం మరో విశేషం. గౌతమి ఇంతకు ముందు మలయాళంలో మోహన్‌లాల్ సరసన హీజ్ ఐనస్ అబ్దుల్లా అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో మోహన్‌లాల్ గౌతమిలది హిట్ జంటగా పేరొందింది. తాజాగా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఒక చిత్రంలో మోహన్‌లాల్, గౌతమి జంటగా నటిస్తున్నారు. దీనికి తెలుగులో మనమంతా అనే పేరును, మలయాళంలో నమదు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో విశ్వనాథ్, హనీషా అమ్రేష్ యువ జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, ఊర్వశి, చంద్రమోహన్, గొల్లపూడి మారుతీరావు నటిస్తున్నారు. ఈ త్రిభాషా చిత్రాన్ని సాయిశివాని సమర్పణలో వారాహి చలనచిత్రం, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందు గోపీచంద్ తదితర ప్రముఖ కథానాయకులతో చిత్రాలను తెరకెక్కించిన ఏలేటి చంద్రశేఖర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు!
‘కిస్ ఆఫ్ లవ్’... ఈ వ్యవహారం ప్రస్తుతం చాపకింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది. కేరళ బీచ్‌లో నిదానంగా మొదలై ఇప్పుడో ఉద్యమంలా రూపుదాల్చుతోంది. ‘పరస్పరం ప్రేమించుకున్నప్పుడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పుకాదు..’ అనేది ‘కిస్ ఆఫ్ లవ్’ కాన్సెప్ట్. దీనిని వ్యతిరేకించేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. కేరళ రాష్ట్రంలో ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించాలనుకున్నప్పుడు ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) వాళ్లు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ‘మోరల్ పోలీసింగ్’ చేస్తూ ఈ ముద్దుల పండుగను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై ఇప్పటివరకూ సినిమా సెలబ్రిటీలెవరూ స్పందించలేదు. అయితే... మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మాత్రం సామాజిక మాధ్యమం ద్వారా ‘కిస్ ఆఫ్ లవ్’కి మద్దతు పలికారు. ‘‘నచ్చిన వారిని ముద్దు పెట్టుకునే హక్కు మనకుంది. అంతే తప్ప మన ముందు ఇతరులు ముద్దు పెట్టుకోకూడదు అని నియంత్రించే హక్కు ఎవరికీ లేదు. ‘ముద్దు’ అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. దీన్ని చట్టపరిధిలోకి తీసుకురావడం తప్పు’’ అని పేర్కొన్నారు మోహన్‌లాల్. ‘మోరల్ పోలీసింగ్’పై స్పందిస్తూ- ‘‘ప్రేమను తెలియజెప్పే గొప్ప సాధనం ముద్దు. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం. వంతెనలు కూలిపోతున్నప్పుడు, రోడ్లు గోతులుగా మారిపోతున్నప్పుడు, పసికందులు అత్యాచారాలకు గురి అవుతున్నప్పుడు, తాగే నీరు కలుషితంగా మారుతున్నప్పుడు, కన్న తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొడుతున్నప్పుడు, యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల్లో పడి ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఎవరి మానాన వాళ్ల్లు పోతున్నప్పుడు.. పట్టించుకోనివాళ్ళకు ఈ బహిరంగ చుంబనం మాత్రం ఘోరంగా కనిపించటం శోచనీయం. ఇష్టం లేకపోతే తల తిప్పుకోండి. బాహాటంగా ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు’’ అని ఘాటుగా స్పందించారు మోహన్‌లాల్.


