breaking news
Malacca Straits
-
అదే జరిగితే.. భారత్‌కు ఫ్లస్, చైనాకు చుక్కలే!
పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్‌లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్‌ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.చైనాకు..మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్‌లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.మలక్కా డైలమాచైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.చైనాకు చుక్కలేఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.భారత్‌కు ఫ్లస్భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్‌బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్‌లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్‌కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. అంత వీజీ కాదుమలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్‌కు చైనా మద్దతు.. ఇరాన్‌కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్‌కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే. -
ఆపరేషన్ చైనా
హిందూ మహాసముద్రం మీద చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి డ్రోన్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డ భారత్.. పూర్తిగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో నేవీ బలగాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీ : హిందూ మహాసముద్రంపై నౌకా వాణిజ్యానికి చాలా కీలకం. భారత్-చైనాలు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యంకోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి. తాజాగా భారత్.. ఇండియన్ ఓషియన్ రీజియన్‌లో తన నేవీ బలగాలను మరింత శక్తివంతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి మలాకా జలసంధి వరకూ.. 24 గంటలు పహారా కాసేలా.. యుద్ధనౌకలను ఏర్పాటు చేస్తోంది. సముద్ర జలాల నుంచి ఉగ్రవాదులు ఎక్కడైనా.. ఎప్పుడైనా విరుచుకుపడొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతోనే నేవీని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది. 24 X 7.. పహారా హిందూ మహాసముద్రంలో ప్రతిక్షణం కాపు కాసేందుకు 12 నుంచి 15 డెస్ట్రాయర్లు, భారీ, చిన్నపాటి యుద్ధనౌకలు, గస్తీ నౌకలను ఏర్పటు చేశారు. అంతేకాక నావల్ శాటిలైట్ అయిన జీశాట్-7తో అంతరిక్షణం నుంచి ప్రతిక్షణం పరిశీలన చేయనున్నారు. మిషన్ రెడీ వార్‌షిప్స్ పేరుతో ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రాన్ని దాదాపు తన అదుపులోకి తీసుకున్నట్లేనని సీనియర్ నేవీ అధికారులు చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఏడెన్, మలాకా జలసంధి వరకూ.. 24 గంటలే ఇండియన్ నేవీ గస్తీ కాస్తుందని.. ఏ చిన్న సహాయం, ఇతర అవసరాలు ఏర్పడ్డా నేవీ అధికారులు వేగంగా స్పందిస్తారని అధికారులు చెబుతున్నారు. అన్ని వైపులా..! శివాలిక్ తరగతికి చెందిన యుద్ధవిమానం బంగాళాఖాతంలో.. బంగ్లాదేశ్, మయన్మార్‌లవైపు గస్తీ కాస్తోంది. అలాగే టెగ్ తరగతికి చెందిన మరో యుద్ధ విమానం మడగాస్కర్, మారిషస్ చుట్టూ పహారా కాస్తోంది. ఐఎన్ఎస్ త్రిషూల్.. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, కోరో యుద్ధ నౌక అండమాన్ సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. చైనాకు అడ్డుకట్ట చైనా యుద్ధ నౌకలు, సభమెరైన్స్ కొన్నేళ్లనుంచీ తరుచుగా హిందూమహాసముద్ర జలాల్లోకి వచ్చి వెళుతున్నాయి. ఈ మధ్యే న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ సైతం ఈ జలాల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత నేవీ దళాలు.. పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్రంపై గస్తీ తిరుగుతంటే.. చైనా నౌకలు ఇటు వచ్చే అవకాశం ఉండదు. మరింత బలొపేతం! ప్రస్తుతం ఇండియన్ నేవీ వద్ద 138 యుద్ధనౌకలు, 235 ఎయిర్‌క్రాఫ్ట్ , హెలీకాప్టర్లు ఉన్నాయి. 2027 నాటికి వీటి సంఖ్యను భారీగా పెంచేందుకు నేవీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యుద్ధ నౌకలను 212కు, హెలీకాప్టర్లను 458 పెంచుకోవాలని.. నేవీ అధికారులు భావిస్తున్నారు. -
పడవ బోల్తా : 24కి పెరిగిన మృతులు
కౌలాలంపూర్ : మలేషియా పశ్చిమ తీరంలోని మలక్కా జలసంధి వద్ద గురువారం పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 24కి చేరింది. ఈ మేరకు మీడియా వెల్లడించింది. గల్లంతు అయన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిపింది. తొమ్మిది బోటులు, రెండు ఎయిర్ క్రాఫ్టులు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు. గల్లంతైన వారినందరిని రక్షిస్తామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండోనేషియా వెళ్తు పడవ గురువారం బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ పడవలో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. కేవలం 20 మందిని మాత్రం రక్షించారు.


