ఓటీటీలోకి లేటెస్ట్ ఎమోషనల్ లవ్ సినిమా
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. తెరపై భావం పలికితే చాలు ఏ భాషా ప్రేక్షకులకైనా సరే నచ్చేస్తుంది. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుని మెప్పించిన సినిమా 'మై వావస్ ఆవుంగా'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఇప్పటికీ అలరిస్తున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, జబ్ ఉయ్ మెట్ లాంటి ప్రేమకథా సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.దేశ విభజన జరిగిన టైంలో విడిపోయిన ఇద్దరు ప్రేమికుల కథని ఈ సినిమాలో చూపించారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు కాస్త వృద్ధుడు అవుతాడు. ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ. తాత పాత్రలో నసీరుద్దీన్ షా చేయగా.. ఇతడి యుక్త వయసు పాత్రని వేదాంగ్ రైనా, ప్రియురాలి పాత్రని శార్వరి పోషించారు. మనవడి పాత్రలో దిల్జీత్ దోసాంజే కనిపించారు. ఈ మూవీ ఆగస్టు 07 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ తేదీనే ఫైనల్!