breaking news
Lung Health
-
అది అంత ప్రమాదమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!
మా ఏడేళ్ల బాబుకు తరచు దగ్గు వస్తోంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. పిల్లికూతలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇన్ హేలర్ వాడమన్నారు. కానీ ఇంట్లో వాళ్లు ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం అదే వాడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. నిజంగానే ఇన్ హేలర్ అంత ప్రమాదకరమా? అది అలవాటు అవుతుందా?– సుమలత, విజయవాడ.ఇది మీ ఒక్కరి సందేహం కాదు. పిల్లలకు దగ్గు, వీజింగ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ప్రతి పేరెంట్ అడిగే మొదటి ప్రశ్న ఇదే. నిజానికి ఇన్ హేలర్ వల్ల పిల్లలకు ప్రమాదం ఉండదు. కాని, సరైన సమయంలో ఇన్హేలర్ను ఆలస్యం చేయడమే అసలు ప్రమాదం. సమయానికి సరైన చికిత్స అందకపోతే ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి, శ్వాస సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. భయంతో చికిత్సను వాయిదా వేయడం కంటే, సరైన నిర్ధారణ చేయించుకుని వైద్యుడి సూచన మేరకు చికిత్స ప్రారంభించడం మంచిది. అందుకే ఇప్పుడు ఇన్ హేలర్, ఉబ్బసం, అలాగే ఆధునిక లంగ్ ఆసిలోమెట్రీ పరీక్షల గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం.ఇన్ హేలర్ అంటే స్టెరాయిడ్స్ మందా? అది ప్రమాదకరమా?కాదు. ఇది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. ఇన్ హేలర్లోని మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. అందుకే చాలా తక్కువ మోతాదులోనే మంచి ఫలితం ఇస్తుంది. శ్వాసనాళాల్లోని వాపు తగ్గి, పిల్లికూతలు, రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతాయి. పిల్లలు మళ్లీ హాయిగా పరుగులు తీస్తూ ఆటలు ఆడగలుగుతారు. వైద్యుడి సూచన మేరకు వాడితే ఇన్ హేలర్ పూర్తిగా సురక్షితమైన చికిత్స.ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం వాడాలా?అసలు కాదు. ఇన్ హేలర్ అలవాటు చేసే మందు కాదు. అవసరమైనంత కాలం మాత్రమే వాడాల్సిన చికిత్స. పిల్లల ఆరోగ్యం మెరుగైతే వైద్యుడు మోతాదును క్రమంగా తగ్గిస్తారు. చాలామంది పిల్లల్లో పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి, చికిత్స వ్యవధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది.వీజింగ్ ఉన్న ప్రతి చిన్నారికీ ఇన్ హేలర్ అవసరమా?అన్ని వీజింగ్లూ ఆస్తమా కావు. వైరస్ ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర శ్వాస సమస్యల వల్ల కూడా వీజింగ్ రావచ్చు. అందుకే కారణం తెలుసుకోకుండా ఇన్ హేలర్ ప్రారంభించకూడదు. ముందుగా సరైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించడం చాలా ముఖ్యం.లంగ్ ఆసిలోమెట్రీ పరీక్ష అంటే ఏమిటి?పిల్లల ఊపిరితిత్తుల పనితీరును సులభంగా అంచనా వేసే ఆధునిక పరీక్షే లంగ్ ఆసిలోమెట్రీ. ఇందులో సూదులు ఉండవు, నొప్పి ఉండదు, బలంగా ఊదాల్సిన అవసరమూ లేదు. మూడేళ్ల నుంచి చిన్నారులకు కూడా ఈ పరీక్ష చేయవచ్చు. కొద్ది నిమిషాల్లో పూర్తయ్యే ఈ పరీక్ష ద్వారా ఉబ్బసం ఉందా, చిన్న శ్వాసనాళాల్లో వాపు ఉందా, ఇన్ హేలర్ అవసరమా, ఇస్తున్న చికిత్స సరిగా పనిచేస్తోందా వంటి విషయాలను వైద్యుడు కచ్చితంగా గుర్తించగలుగుతారు. దీంతో అవసరమైన పిల్లలకు మాత్రమే సరైన చికిత్స అందించి, అనవసరంగా ఇన్ హేలర్ వాడాల్సిన పరిస్థితిని నివారించవచ్చు.ప్రతి దగ్గుకూ ఇన్ హేలర్ అవసరమా?లేదు. దగ్గు రావడానికి వైరస్ ఇన్ఫెక్షన్లు, ముక్కు అలర్జీ, సైనస్ సమస్యలు, కడుపులోని ఆమ్లం పైకి రావడం, అడినాయిడ్ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు ఉంటాయి. పిల్లవాడు బాగున్నాక కూడా పరీక్ష అవసరమా?అవసరం ఉండొచ్చు. బయటకు దగ్గు, దమ్ము తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో స్వల్ప వాపు కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఈ పరీక్ష ద్వారా గుర్తించి చికిత్స కొనసాగించాలా, తగ్గించాలా లేదా పూర్తిగా ఆపాలా అనే విషయాన్ని వైద్యుడు నిర్ణయిస్తారు.వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తే, పెదాలు లేదా గోళ్లు నీలిరంగులోకి మారితే, పిల్లలు మాట్లాడలేకపోయినా, తినలేకపోయినా, ఇన్ హేలర్ వాడిన తర్వాత కూడా ఉపశమనం లేకపోయినా, తరచు వీజింగ్ వస్తున్నా లేదా రాత్రిపూట దగ్గు వల్ల నిద్రపట్టకపోయినా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇన్ హేలర్ అనేది భయపడాల్సిన చికిత్స కాదు. సరైన సమయంలో ప్రారంభిస్తే అది పిల్లల ఊపిరితిత్తులను రక్షించే నమ్మకమైన మిత్రుడు. అవసరం లేనప్పుడు వాడకూడదు. అవసరమైనప్పుడు మాత్రం ఆలస్యం చేయకూడదు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్మేనిమాట..నమలడానికి పని ఇస్తే మెదడు మేల్కొంటుంది! గట్టిగా ఉండే పండ్లు, కూరగాయలు నమలడం వల్ల దవడలకే కాదు, మెదడుకూ మేలు జరుగుతుంది. నమిలే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, అప్రమత్తత మెరుగుపడుతుంది. అంటే... ఒక యాపిల్ తినడం కూడా మెదడుకు చిన్న మేల్కొలుపే! -
పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?
స్నానం చేస్తూ పాటలు పాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నట్టే! పాటలు పాడేటప్పుడు ఊపిరిని లోతుగా తీసి వదలాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అంటే... మీ బాత్రూమ్ కచేరీ కూడా ఒక చిన్న వ్యాయామమే!. అదెలాగో సవివరంగా తెలసుకుందామా..!పాటలు పాడటం అనేది కేవలం కళ మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన వ్యాయామం. క్రమం తప్పకుండా పాటలు పాడటం వల్ల డయాఫ్రాగమ్, ఇంటర్‌కోస్టల్ కండరాలు బలపడి, ఊపిరితిత్తుల సామర్థ్యం (lung capacity), శ్వాస నియంత్రణ మెరుగుపడతాయిశ్వాసకోశ కండరాల బలోపేతం: దీర్ఘమైన శ్వాస దశలు, నియంత్రిత శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా శ్వాస వదలడం అనేవి డయాఫ్రమ్, ఇంటర్‌కోస్టల్ సహాయక కండరాలను ఉత్తేజపరిచి, ఓర్పును, సామర్థ్యాన్ని పెంచుతాయి.మెరుగైన శ్వాస నియంత్రణ సామర్థ్యం: సంగీత శిక్షణ సౌకర్యవంతమైన ఉచ్ఛ్వాస సమయాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల అసలు పరిమాణం మారకపోయినా, ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల పరిమాణాన్ని మెరుగ్గా ఉపయోగించడం ద్వారా క్రియాత్మక కీలక సామర్థ్యాన్ని పెంచుతుంది.మెరుగైన శ్వాస సామర్థ్యం: పాడటం నెమ్మదిగా, నియంత్రితంగా శ్వాస తీసుకునే విధానాలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల అనవసరమైన వేగవంతమైన, నిస్సారమైన శ్వాసలు తగ్గి, వాయు మార్పిడి ప్రక్రియ మెరుగుపడుతుంది.వాయుమార్గం తెరుచుకోవడం, శ్లేష్మం తొలగిపోవడం: ఫిజియోథెరపీ పద్ధతులతో కలిపి ఉపయోగించినప్పుడు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో స్వర వ్యాయామాలు సున్నితమైన ఉచ్చారణ శ్లేష్మాన్ని కదిలించి, వాయుమార్గం శుభ్రపరచడాన్ని మెరుగుపరుస్తాయి.అంతేగాదు పాడటం శ్వాస, మింగడం మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది న్యూరోజెనిక్ డిస్ఫేజియా, కొన్ని నాడీకండర రుగ్మతలకు ఉపయోగపడుతుంది.సమూహ గానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ఆయాసం అనే భావనను తొలగిస్తుంది. టానమిక్ సమతుల్యతను (సింపథెటిక్ టోన్‌ను తగ్గించడం) అనుకూలంగా మార్చవచ్చు, తద్వారా పరోక్షంగా శ్వాస సరళకి ప్రయోజనం చేకూరుస్తుంది.(చదవండి: దెయ్యంపై కేసు..! జడ్జీ వేసిన ఆ ఒక్క ప్రశ్నతో..) -
యువ శ్వాసపై హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో యువత ఊపిరితిత్తుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఏడాదికి 81,700 చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతకు అద్దం పెట్టే గణాంకాలివి. ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన ఈ సమస్య ఇప్పుడే మొదలుకావడమన్నదే ఆందోళన కలిగించే విషయం. ట్రాఫిక్ రద్దీలో ఎక్కువ దూరం వెళ్లే నిపుణులు, కాలుష్య వాతావరణమున్న క్లాస్‌రూముల్లో ఎక్కువ సేపు కూర్చునే విద్యార్థులు విష పూరిత వాయువులను నిత్యం పీలుస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు నిపుణులు తేల్చారు. అయితే, ఈ సమస్య వారు ఎక్కువగా పనిచేసి, సమాజానికి ఉత్పాదకతను అందించే సమయానికి బయటపడుతోందని చెబుతున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెస్పికాన్ సదస్సులో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ వత్సలా అగర్వాల్ ఈ వివరాలను వెల్లడించారు. శ్వాసకోశ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు. ‘స్వచ్ఛమైన గాలి నేడు విలాస వస్తువు కాదు. ఇదో ప్రాథమిక హక్కు. దీనినే మనం ప్రధాన అజెండాగా తీసుకోవాలి. యువత ఊపిరితిత్తులను రక్షించుకోవడమంటే దేశ ఆర్థిక, సామాజిక నిర్మాణాన్ని కాపాడుకోవడమే. దేశ వర్తమాన, భవిష్యత్తును ఈ కాలుష్యం చిదిమేకుండా చూసుకోవాలి’అని డాక్టర్ వత్సల పేర్కొన్నారు. ‘గతంలో ఊపిరితిత్తుల కేన్సర్, సీఓపీడీ, టీబీ వంటి వ్యాధులు వృద్ధుల్లోనే కనిపిస్తాయనే అనుకునేవాళ్లం. ప్రస్తుతం యువతలో ఇవి వేగంగా పెరుగుతున్నాయి’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రాణనష్టంతోపాటు ఆర్థిక విపత్తు భయాలను పెంచుతోందన్నారు. → ఉదయాన్నే పొగలో పరుగెత్తే యువత, ట్రాఫిక్‌లో అత్యధిక సమయం ప్రయాణించే ఉద్యోగులు, కలుíÙత తరగతి గదుల్లో కూర్చునే విద్యార్థుల ఊపిరితిత్తుల ఆరోగ్యం నిత్యం క్షీణిస్తోంది. కంటికి కనిపించని ఉత్పాతం దీర్ఘకాలంలో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. → వంటగదిలో వచ్చే పొగ కూడా మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచుతోంది. చిన్నారులపైనా కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా కేసుల సంఖ్య 14 శాతంగా ఉంది. → భారత్‌లో క్షయ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రతి లక్ష మందికి 195 కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. → సూక్ష్మ రేణువులు, కాలుష్యం బారినపడకుండా తగ్గించడంతోపాటు సీఓపీడీ, ఆస్తమా, క్షయ వంటి కేసుల్లో నిబంధనలు పాటించినట్లయితే ఏటా వేల మంది ఆస్పత్రి చేరికలను తగ్గించుకోవచ్చని రెస్పికాన్ 2025 ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె.చావ్లా వెల్లడించారు. → నేటి యువత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేకపోతే.. దేశ భవిష్యత్తు ఇబ్బందికంగా మారుతుందని రెస్పికాన్ 2025 నిర్వహణ కార్యదర్శి ఆదిత్య కె. చావ్లా పేర్కొన్నారు. శ్వాసకోశ ఆరోగ్య రక్షణపై ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సీనియర్ శ్వాసకోశ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు, అంతర్జాతీయ నిపుణులు సహా దాదాపు 1,200 మంది పాలు పంచుకున్నారు. → స్వచ్ఛమైన గాలి అందించడం, టీబీ బాధితుల సంరక్షణ, వ్యాక్సినేషన్‌ను పెంచడం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వంటి చర్యలపై నిపుణులు ఈ సమావేశంలో చర్చించారు. విషపూరిత గాలి సగటు భారతీయుల ఆయుర్దాయాన్ని వెయ్యి రోజుల మేర తగ్గిస్తోందని, చడీచప్పుడూ కాకుండా నష్టాన్ని కలిగిస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. -
పౌష్టికాహారం అంటే కుళ్లిన గుడ్లా?
అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అతను ఆడిందే ఆట ఇచ్చిందే నాణ్యమైన ఆహారంగా చలామణి అవుతోంది. దీనికి నిదర్శనమే అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా కావడం. ఈ గుడ్లు తింటే ఇంకేమైనా ఉంటుందా..పౌష్టికాహారం మాట దేవుడెరుగు కానీ రోగాలు రావడం ఖాయం. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. శివ్వంపేట, న్యూస్‌లైన్: పౌష్టికాహారం మాట దేవుడెరుగు ఇలాంటి గుడ్లు తింటె కొత్త రోగాలు రావడం ఖాయం. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కుళ్లిన గుడ్లు సరఫరా అవుతున్నాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. మండల కేంద్రమైన శివ్వంపేటతోపాటు పలు కేంద్రాలకు వారం రోజుల క్రితం సరఫరా చేసిన గుడ్లు కుళ్లిపోయి ఉన్నాయి. పంపిణీలో ఎక్కువ శాతం గుడ్లు పాడైపోయి తీవ్ర దుర్వాసన వస్తుంది. ఇలాంటి గుడ్లను గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పెడితె కొత్త రోగాలు రావా మరి!. నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చాలాకాలం నిల్వ ఉన్న గుడ్లను సరఫరా చేస్తుండడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. గుడ్లు కూడా చిన్న సైజులో ఉంటున్నాయి. గుడ్లు పంపిణీ చేస్తున్న వారిపై అధికారులు ఉదాసీనతవైఖరి అవలంబిస్తుండడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన కుల్లినగుడ్లను గుర్తించిన కార్యకర్తలు పక్కన బెట్టారు. ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇస్తే చూడకుండా గుడ్లను ఎలా తీసుకున్నారంటూ అడుగుతారనే భయంతో కొందరు వాటిని పాడేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేప్టకుంటే గర్భిణులకు పౌష్టికాహారం కాదు కదా నాసిరకం ఆహారమే దిక్కవుతుందని చెప్పవచ్చు. తిప్పిపంపుతాం కుల్లిపోయిన గుడ్లు వచ్చిన విషయాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ సరళాదేవిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ప్రతి కేంద్రానికి తాజా గుడ్లు సదరు కాంట్రాక్టర్ ఇవ్వాల్సిందే అన్నారు. నాణ్యతగా లేని గుడ్లను మరలా తిప్పిపంపుతామని, వాటిని పంపిణీ చేయకుండా కార్యకర్తలకు ఆదేశిస్తానని చెప్పారు.


