breaking news
lower prices
-
సెజ్ ఔషధాలకు ట్యాక్స్ రిలీఫ్
న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్) తయారు చేసి, దేశీయంగా విక్రయించే ఔషధాలపై కస్టమ్స్ సుంకాలను ఎత్తివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెజ్‌లలో తయారై, దేశీయ మార్కెట్లో అమ్మే ఔషధాలపై 10 శాతం సుంకాలు వర్తిస్తున్నాయి. ఒకవేళ తాజా ప్రతిపాదన ఆచరణ రూపం దాలిస్తే సదరు సుంకాల ప్రస్తావన లేకుండా పలు టీకాలు, కీలక ఔషధాలను దేశీయంగా తక్కువ ధరకే విక్రయించేందుకు వీలవుతుంది. అయితే, ఏకమొత్తంగా అన్ని ఔషధాలకు కాకుండా కొన్ని ఉత్పత్తులకు మాత్రమే మినహాయింపులను వర్తింప చేయొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనను చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంపిక చేసిన కొన్ని టీకాలు, కొన్ని కీలకమైన ఔషధాలు, ప్రభుత్వం నిర్ణయించే ఉత్పత్తులకు మినహాయింపునివ్వొచ్చని పేర్కొన్నాయి. వైద్య పరికరాలకు కూడా.. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థని కూడా ప్రోత్సహించే దిశగా కొన్ని మెడికల్ డివైజ్‌ల తయారీ సంస్థలు, బయోటెక్ సంస్థలకు కూడా ఇదే తరహాలో సుంకాల నుంచి మినహాయింపులనిచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్న ఉత్పత్తులను, దేశీయంగా తయారు చేసేందుకు పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ఫార్మా రంగం గణనీయంగా ఎదుగుతోందని, పలు రాష్ట్రాలు ఫార్మా సెజ్‌లను ఏర్పాటు చేస్తున్నాయని వివరించాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రతిపాదనలు తోడ్పడగలవని వివరించాయి. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై అమెరికా 100 శాతం సుంకాలను ప్రకటించడంతో దేశీయంగా ఔషధాలను విక్రయించుకునేందుకు సుంకాల నుంచి మినహాయింపునివ్వాలంటూ సెజ్ యూనిట్లు కోరుతుండటంతో ప్రభుత్వ తాజా యోచన ప్రాధాన్యం సంతరించుకుంది. సెజ్‌ల నుంచి ఎగుమతవుతున్న ఉత్పత్తుల్లో హైపర్‌టెన్షన్, మధుమేహం, కార్డియోవాసు్కలర్ వ్యాధుల్లాంటి వాటి చికిత్స కోసం ఉపయోగించే ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్టబుల్ ఔషధాలు ఉంటున్నాయి. వీటికి దేశీ మార్కెట్లో కూడా గణనీయంగా డిమాండ్ ఉంటోంది. ప్రస్తుతం దేశీ ఫార్మా మార్కెట్ 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు అంచనా. భారత్‌కి అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాల విభాగంలో 20 శాతం వాటా, టీకాల సరఫరాలో 60 శాతం వాటా ఉంది. -
అక్కడ మరోసారి క్షీణించిన ఉల్లి ధరలు
నాసిక్ : నిన్న మొన్నటి దాకా వినియోగదారులకు కళ్లనీరు తెప్పించిన ఉల్లిధరలు ఇపుడు మహారాష్ట్రలో ఉల్లి రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి పాయల మార్కెట్ లాసల్గాన్ లో గురువారం ఉల్లి ధర భారీగా పడిపోయింది. ఇప్పుడక్కడ మంచి రకానికి చెందిన వంద కిలోల ఉల్లిపాయలు ధర రూ. 425 పలుకుతున్నాయి. కిలో రూ 4.25 గా నమోదైంది. 2012 జూన్ తర్వాత ఈ స్థాయికి దిగి రావడం ఇదే మొదటి సారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ పోలిస్తే సరఫరాలో పెరుగుదలే ధరలు తగ్గుముఖం పట్టడానికి రైతులు భారీ పరిమాణంలో ఉల్లిపాయలు తీసుకువస్తున్నారనీ, డిమాండ్ తక్కువగా ఉందన్నారు. ఇదికాకుండా, మంచి నాణ్యతలేని ఉల్లిపాయల కారణంగా అత్యంత నష్టం వాటిల్లిందని లాసల్గాన్ ఏపీఎంసీ చైర్మన్ జయదత్త హోల్కర్ చెప్పారు. నాణ్యత లేని క్వింటా ఉల్లిని రూ .100 చొప్పున అమ్ముతున్నారని, ఈ ఏడాది ఆగస్టు 16 నాటికి ఉల్లి కనీస టోకు ధర రూ 150 క్వింటాలు వద్ద నిలిచిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నుంచి ఉత్పత్తి బావుందన్నారు. ప్రస్తుతం మార్కెట్ కు వస్తున్న ఉల్లిపాయలు వేసవి పంట ఏప్రిల్, మే నెలలది, నాలుగు ఐదు నెలల పాతది కావడంతో ఇప్పటికే మొలకెత్తుతోందని జాతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్ తెలిపారు. ఇది కూడా ధరల క్షీణతకు కారణమన్నారు. మరోవైపు భారతదేశం లో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయవిధానంలోఅవకతవకలు రైతుల నడ్డి విరుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయడ్డారు. ప్రధానంగా ఉల్లి ధరల్లోని భారీ ఒడిదుడుకులకు ఇదే నిదర్శనమన్నారు. ఫలితంగా అటు ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలను పటిష్టపర్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్పత్తిదారులకు ప్రభుత్వాలు మార్కెట్ సదుపాయాలు, మంచి, వేగవంతమైన రవాణా వ్యవస్థలను కల్పించి, ధరల్లోని అస్థిరతను తొలగించాలనీ, దీనికి రాజకీయ సంకల్పం అవసరం విశ్లేషకుల వాదన.


