breaking news
longest tongue
-
వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నిస్ రికార్డ్
ఎక్కడైన కుక్కల నాలుక ఎంత ఉంటుంది? సుమారు 5 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ అమెరికాలోని లూసియానాలో ఓ కుక్కకు నాలుక ఏకంగా 12.7 సెంటీమీటర్లు ఉంది. తాజాగా ఈ కుక్క గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న 9.49 సెంటీమీటర్లతో బెస్బీ అనే కుక్క పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. ఆ కుక్క పేరు 'జోయ్'. దాని యజమాని సాడీ, విలియమ్స్. వారికి ఈ కుక్క ఆరు వారాల వయస్సులో ఉన్నప్పుడు దొరికింది. సాధారణంగానే జోయ్ నాలుక ఎలాస్టిక్ మాదిరిగా నోటి బయటికి సాగి ఉండేది. పెరిగే కొద్దీ అందరూ ఆ కుక్కపైనే కామెంట్ చేసేవారని యజమానులు తెలుపుతున్నారు. జోయ్‌కి బయట తిరగడం, బాల్స్‌తో ఆడుకోవడం, పక్క కుక్కలతో గొడవపడడం, కారు వెంట పరుగెత్తడం, ఈత కొట్టడం అంటే ఇష్టమని చెబుతున్నారు. తమ చుట్టుపక్కల జోయ్ అంటే తెలియనివారుండరని పేర్కొన్నారు. Zoey loves to fetch and swim. Coincidentally, she has the world’s longest tongue on a dog!https://t.co/2jvoSbvga9 — Guinness World Records (@GWR) June 2, 2023 'మేము వాకింగ్‌కు జోయ్‌ను తీసుకువెళితే అందరూ మా దగ్గరికే వస్తారు. దానిని తాము పెంచుకుంటాం ఇవ్వమని అడుగుతారు. దీనిపై మేము చాలా సార్లు హెచ్చరించాం. జోయ్‌కి కోపమొస్తే కరిచిన సందర్భాలు కూడా ఉన్నాం.' అని యజమాని చెప్పారు. తన ప్యాంటుకు ఉన్న జోయ్ పంటి గాట్లను చూపిస్తూ విలియమ్స్ చిరునవ్వుతో చెప్పాడు. ఇదీ చదవండి:రెస్టారెంట్లో మహిళకు చేదు అనుభవం.. ‘అలా చేయడం తప్పా’? -
నీ నాలుక బంగారంగానూ..!
నాలుకతో ముక్కును తాకించుకోవడం.. చిన్నప్పుడు అందరూ సరదాగా ప్రయత్నించే ఉంటారు. కానీ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి మాత్రం ముక్కునే కాదు.. మోచేయి, దవడ, కళ్లను కూడా తన నాలుకతో తాకగలదు..! అమెరికాలోని మిచిగాన్కు చెందిన అడ్రియానా లూయిస్ నాలుక 4 అంగుళాల పొడవుంది. 3.9 అంగుళాలతో నిక్ స్టాబెర్ల్ అనే వ్యక్తి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. గిన్నిస్‌లో చోటు సాధించుకోవడం కోసం లూయిస్ గిన్నిస్ నిర్వహకులు సంప్రదించింది. ఒకవేళ వాళ్లు ధ్రువీకరిస్తే లూయిస్ పేరు గిన్నిస్‌లోకి ఎక్కుతుందేమో చూద్దాం..