వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నిస్‌ రికార్డ్

US Dog Achieves Guinness World Record For Longest Tongue - Sakshi

ఎక్కడైన కుక్కల నాలుక ఎంత ఉంటుంది? సుమారు 5 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ అమెరికాలోని లూసియానాలో ఓ కుక్కకు నాలుక ఏకంగా 12.7 సెంటీమీటర్లు ఉంది. తాజాగా ఈ కుక్క గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న 9.49 సెంటీమీటర్లతో బెస్బీ అనే కుక్క పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది.

 ఆ కుక్క పేరు 'జోయ్'. దాని యజమాని సాడీ, విలియమ్స్‌. వారికి ఈ కుక్క ఆరు వారాల వయస్సులో ఉన్నప్పుడు దొరికింది. సాధారణంగానే జోయ్ నాలుక ఎలాస్టిక్ మాదిరిగా నోటి బయటికి సాగి ఉండేది. పెరిగే కొద్దీ అందరూ ఆ కుక్కపైనే కామెంట్ చేసేవారని యజమానులు తెలుపుతున్నారు. జోయ్‌కి బయట తిరగడం, బాల్స్‌తో ఆడుకోవడం, పక్క కుక్కలతో గొడవపడడం, కారు వెంట పరుగెత్తడం, ఈత కొట్టడం అంటే ఇష్టమని చెబుతున్నారు. తమ చుట్టుపక్కల జోయ్ అంటే తెలియనివారుండరని పేర్కొన్నారు. 

'మేము వాకింగ్‌కు జోయ్‌ను తీసుకువెళితే అందరూ మా దగ్గరికే వస్తారు. దానిని తాము పెంచుకుంటాం ఇవ్వమని అడుగుతారు. దీనిపై మేము చాలా సార్లు హెచ్చరించాం. జోయ్‌కి కోపమొస్తే కరిచిన సందర్భాలు కూడా ఉన్నాం.' అని యజమాని చెప్పారు. తన ప్యాంటుకు ఉన్న జోయ్ పంటి గాట్లను చూపిస్తూ విలియమ్స్ చిరునవ్వుతో చెప్పాడు.  

ఇదీ చదవండి:రెస్టారెంట్‌లో మహిళకు చేదు అనుభవం.. ‘అలా చేయడం తప్పా’?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top