breaking news
Locally made liquor
-
నాటుసారా నిల్వలు ధ్వంసం
బెజ్జూరు (ఆదిలాబాద్) : భారీ మొత్తంలో దాచిన నాటుసారా నిల్వలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మరిపెడ తండాలో భారీమొత్తంలో సారా నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేసి 10 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మరో 50 లీటర్ల గుడుంబాను కూడా సీజ్ చేశారు. -
'సారా తయారుచేస్తే పీడీ యాక్ట్'
తాండూరు (రంగారెడ్డి) : సారా తయారు చేసినా, విక్రయించినా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ అన్నారు. మంగళవారం తాండూరులో సారా తయారీ, విక్రయాల నియంత్రణపై సమీక్షా సమావేశం జరిగింది. దీనికి హాజరైన సందర్భంగా దశరథ్ మాట్లాడారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని, ఆ లోపే సారా తయారీని పూర్తిగా అరికడతామని చెప్పారు. అక్టోబర్ నుంచి చౌక మద్యం అందుబాటులోకి రానుందని, జిల్లాల్లో కొత్తగా 10 బార్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.