LIC Managing Director
-
బీమా రంగం డీలా
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం పాటు కొనసాగితే బీమా రంగం వృద్ధి మందగించొచ్చని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధాని చెప్పినట్టు మనం కష్టకాలాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడకుండా రక్షణ కలి్పంచారు. ఒకవేళ ఈ సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది వ్యక్తుల ఖర్చులు, పొదుపులను ప్రభావితం చేస్తుంది. ఈ సంక్షోభం సాధ్యమైనంత త్వరలో ముగిసి, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నాం’’అని దొరైస్వామి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ప్రభావితమైతే బీమా రంగం దీనికి దూరంగా ఉండలేదన్నారు. వ్యక్తుల ఆదాయాలు, వారి సామర్థ్యాలు ప్రభావితమైతే బీమా రంగంపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో మరికొంత విక్రయించే విషయమై ఎదురైన ఒక ప్రశ్నకు.. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దొరైస్వామి చెప్పారు. లిస్టింగ్ నిబంధనలను పాటించడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించినట్టు దొరైస్వామి పేర్కొన్నారు. వాటాలను దశల వారీగా 10–15 శాతం మేర తగ్గించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. 2022లో ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాలను రూ.21,000 కోట్లకు విక్రయిచడం గమనార్హం. -
భారీ పెట్టుబడులకు ఎల్ఐసీ రెడీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024 –25) దేశీ స్టాక్ మార్కెట్లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 1.3 లక్షల కోట్లను స్టాక్స్‌లో సరికొత్తగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 38,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23,300 కోట్ల విలువైన పెట్టుబడులు చేపట్టింది. కాగా.. ఈ క్యూ1లో ఎల్ఐసీ ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులపై రూ. 15,500 కోట్ల లాభం ఆర్జించింది. ఇవి గతేడాది క్యూ4(జనవరి–మార్చి)తో పోలిస్తే 13.5 శాతం అధికంకావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ కదలికలు, ధరల్లో మార్పులను నిశితంగా పరిశీలిస్తూ పెట్టుబడి అవకాశాలను వినియోగించుకుంటామని మొహంతీ తెలియజేశారు. కనీసం గతేడాది(రూ. 1.32 లక్షల కోట్లు) స్థాయిలో ఈ ఏడాది పెట్టుబడులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ జూన్ చివరికల్లా స్టాక్స్‌లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. బీమా దిగ్గజం మొత్తం 282 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. ఏఎంసీ జూమ్: జూన్‌కల్లా ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 16 శాతంపైగా ఎగసి రూ. 53,58,781 కోట్లను తాకాయి. గత క్యూ1కు ఇవి రూ. 46,11,067 కోట్లు. క్యూ1 తీరిలా: క్యూ1లో ఎల్ఐసీ లాభం 10% వృద్ధితో రూ. 10,461 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్ల నుంచి రూ. 2,10,910 కోట్లకు పెరిగింది. -
ఎల్ఐసీ ఎండీగా సత్పాల్ భాను
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా సత్పాల్ భానూను ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్‌లో ఎల్ఐసీ చైర్మన్‌గా నియమితులైన సిద్ధార్థ మొహంతి స్థానంలో సత్పాల్ భాను నియమితులయ్యారు. ఆయన బాధ్యతలను చేపట్టిన నాటి నుంచీ ఈ నియామకం వర్తిస్తుంది. 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ వరకూ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందైతే అది) భాను బాధ్యతల్లో కొనసాగుతారని ఎల్ఐసీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. -
ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా హేమంత్ భార్గవ బాధ్యతలు
హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా హేమంత్ భార్గవ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటివరకూ ఢిల్లీ, పంజాబ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హరియాణ, చండీగఢ్ ప్రాంతాలను కలిగిన నార్త్ జోన్‌కు హెడ్‌గా వ్యహరించారు. దీనికి ముందు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ ప్రాంతాలను కలిగిన తూర్పు జోన్‌కు హెడ్‌గా కొనసాగారు. జీవిత బీమా పరిశ్రమలో ఈయనకు 33 ఏళ్ల అపార అనుభవం ఉంది.


