breaking news
Li Shuangjiang
-
గ్యాంగ్ రేప్: ఆర్మీ ఉన్నతాధికారి కొడుక్కి జైలుశిక్ష
బీజింగ్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో చైనా ఆర్మీ ఉన్నతాధికారి పుత్రరత్నం లీ తియానీ ప్రమేయం ఉందని స్థానిక కోర్టు నిర్థారించింది. ఈ నేపథ్యంలో లీ తియానికి 10 ఏళ్ల జైలు శిక్షను బీజింగ్ మున్సిపల్ నంబర్ వన్ ఇంటర్మీడియట్ కోర్టు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా బుధవారం కథనాన్ని ప్రచురించింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దేశంలోని బడబాబులు పుత్రరత్నాలకు ఆ ఘటనతో సంబంధం ఉందని విపక్షాలతోపాటు దేశ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. అందులోభాగంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో సామూహిక అత్యాచారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అత్యాచారం ఘటనతో తన కుమారుడికి ఎటువంటి సంబంధంలేదని లీ తాయాని తండ్రి మేజర్ జనరల్ లీ షుయన్జియాంగ్ కోర్టుకు విన్నవించారు. లీ షుయన్జియాంగ్ చైనా ఆర్మీలో అత్యున్నత అధికారిగా పని చేస్తున్నారు. ఆమె భార్య, లీ తాయాని తల్లీ కూడా ఆర్మీలో గాయకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
గ్యాంగ్ రేప్ కేసులో చైనా జనరల్ కొడుక్కి జైలు
వయసులో చిన్నవారే... చేష్టలలో మాత్రం పెద్దలను మించిపోతున్నారు... మైనారిటీ కూడా తీరని యువకులు ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు. ఇందుకు కారణం... పెద్దల పెంపకంలో లోపమా... చెడు స్నేహాలు కారణమా... ఏమైతేనేం... పసితనంలోనే పాపాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. మొక్కగా ఉండగానే వంచకపోతే... వారు మానులా పెరిగి, ఆ నీడలో మరిన్ని పాపవృక్షాలకు జన్మనిస్తారు. అలా పెరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో చైనా కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఆర్మీలోని హై ప్రొఫైల్ సింగర్‌స యొక్క కుమారునికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష ఎందుకో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఆర్మీ కుటుంబానికి చెందిన వ్యక్తులు రేప్ కేసులో నిందితులుగా నిలిచారు. 17 సంవత్సరాల ‘లి తియానీ’ అనే యువకుడు, ఈ దుశ్చర్యకు మార్గదర్శకుడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో... లీ తన నలుగురు స్నేహితులతో కలిసి బీజింగ్‌లో ఒక స్త్రీని రేప్ చేశాడు. లీ తియానీ... లీ షుయాంగ్జియాంగ్ కుమారుడు. ఆయన ఆర్మీలో ‘జనరల్’ ర్యాంకు వ్యక్తి. టెలివిజన్‌లో దేశభక్తి గీతాలు ఆలపించడంలో ప్రసిద్ధులు. లీ తల్లి అయిన మెంగ్జీ కూడా చూపా పీపుల్స లిబరేషన్ ఆర్మీలో ప్రసిద్ధ గాయని. ఈ కేసును బాగా దగ్గరగా పరిశీలించిన వారు, వీరి పిల్లలు ఈ విధంగా ప్రవర్తించడం చూసి షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన జరిగినప్పుడు లీ వయసు 16 సంవత్సరాలు మాత్రమే. ఇతడితో పాటు మరొక నలుగురు కూడా ఈ కేసులో నిందితులుగా తేలారు. వారిలో ఇద్దరి వయసు 15. వారు నేరం అంగీకరించి, పశ్చాత్తాపపడటంతో, వారికి శిక్షా కాలం తగ్గింది. తను ఏ నేరమూ చేయలేదని తనను తాను సమర్థించుకోవాలనుకుంటున్నాడు లీ. ఇటువంటి పనులు చేయడం ‘లీ’ కి ఇది కొత్త కాదు. ఇంతకుముందు 2011లో నంబర్‌ప్లేట్ లేని, బిఎండబ్ల్యు కారు నడుపుతూ, నడివయసు జంట ప్రయాణిస్తున్న కారుకు ఎదురు వెళ్లడమే కాకుండా, ‘పోలీసులను పిలిచారంటే చంపుతాను జాగ్రత్త!’ అని బెదిరించాడు. ఆ సమయంలో అతడి తండ్రి క్షమాపణలు చెప్పి కుమారుడిని తీసుకొచ్చాడు. ప్రముఖుల పిల్లలు ఎటువంటి తప్పులు చేసినా, పలుకుబడి ఉపయోగించి పిల్లలకు శిక్షలు పడకుండా చేస్తున్నారని పత్రికలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. - డా.వైజయంతి